https://oktelugu.com/

విడ్డూరం..వైన్ షాప్ దగ్గర ఉపాధ్యాయుని డ్యూటీ!

ఇది చిత్రమో, విచిత్రమో, విడ్డూరమో తెలియదు. ప్రస్తుత సమాజంలో అత్యంత గౌరవప్రధమైన స్థానంలో ఉన్న వ్యక్తి “ఉపాధ్యాయుడు” అలాగే గౌరవం లేని వ్యక్తుల్లో “తాగుబోతులు” ముందువరుసలో ఉంటారు. అలాంటి తాగుబోతుకు ఉపాధ్యాయుడు సేవ చేయడం విచిత్రం కాకపోతే ఇంకెమిటి? ఇప్పటి సమాజంలో ఒక ఉపాధ్యాయునికి ఉన్న గౌరవం మరే ఇతర వృత్తి చేసేవారికి లేదంటే అతిశయోక్తి కాదు. అలాంటి ఒక ఉపాధ్యాయున్ని తాగుబోతులకు సేవ చేయడానికి మందు షాపుల దగ్గర డ్యూటీ వేసిన జగన్ సర్కార్ పై […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 5, 2020 / 02:58 PM IST
    Follow us on

    ఇది చిత్రమో, విచిత్రమో, విడ్డూరమో తెలియదు. ప్రస్తుత సమాజంలో అత్యంత గౌరవప్రధమైన స్థానంలో ఉన్న వ్యక్తి “ఉపాధ్యాయుడు” అలాగే గౌరవం లేని వ్యక్తుల్లో “తాగుబోతులు” ముందువరుసలో ఉంటారు. అలాంటి తాగుబోతుకు ఉపాధ్యాయుడు సేవ చేయడం విచిత్రం కాకపోతే ఇంకెమిటి? ఇప్పటి సమాజంలో ఒక ఉపాధ్యాయునికి ఉన్న గౌరవం మరే ఇతర వృత్తి చేసేవారికి లేదంటే అతిశయోక్తి కాదు. అలాంటి ఒక ఉపాధ్యాయున్ని తాగుబోతులకు సేవ చేయడానికి మందు షాపుల దగ్గర డ్యూటీ వేసిన జగన్ సర్కార్ పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

    వివరాల్లోకి వెళ్తే.. విశాఖపట్నం జిల్లాలోని బుకాయిపేట మండలంలో అనకాపల్లి గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో శేఖర్ అనే ఉపాధ్యాయున్ని ఒక వైన్ షాప్ దగ్గర తాగుబోతులను క్యూ లో నిలబెట్టడానికి నియమించింది. దీనిపై అనేమంది జగన్ సర్కార్ ని దుమ్మెత్తి పోస్తున్నారు. ఉపాధ్యాయులను ఇలా నియమించడం ఎంత మాత్రం తగదని హితవు పలుకుతున్నారు. పిల్లలకు విద్యాబుద్దులు నేర్పే ఒక టీచర్ ని వైన్ షాప్ దగ్గర డ్యూటీ వేయడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    లాక్ డౌన్ సడలింపు మరియు మద్యం దుకాణాలను తిరిగి తెరవడంతో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులకు వారి వద్ద పనిచేయాలని ఆదేశాలు జారీ చేసింది. కొంతమంది ఉపాధ్యాయులను ప్రభుత్వం నడుపుతున్న మద్యం దుకాణాలలో డిప్యుటేషన్ డ్యూటీలో నియమించారు.