కరోనా మూడో దశ ప్రమాదం పొంచి ఉందని శాస్ర్తవేత్తలు హెచ్చరిస్తున్నారు. మరో వైపు దాని సంకేతాలు కనిపిస్తున్నాయి. దేశంలోని మహారాష్ర్ట, మధ్యప్రదేశ్, కర్ణాటక, జమ్మూకాశ్మీర్ రాష్ర్టాల్లో కొత్తగా వెలుగులోకి వచ్చిన మ్యూటెంట్ డెల్టా ప్లస్ వేరియంట్ కేసు ఏపీలో కూడా నమోదైంది. తిరుపతిలోని టెంపుల్ టౌన్ లో ఈ కేసు రికార్డయింది. దీంతో అందరు భయభ్రాంతులకు గురవుతున్నారు.
దీనిపై ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని సైతం మాట్లాడారు. డెల్టా ప్లస్ వేరియంట్ కు సంబంధించి పాజిటివ్ కేసు నమోదు కావడంపై వివరాలు వెల్లడించారు. కరోనా వైరస్ నిర్మూలనకు ప్రభుత్వం చేపట్టే చర్యలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. తిరుపతిలో వెలుగు చూసిన డెల్టా ప్లస్ వేరియంట్ కేసును జాగ్రత్తగా చికిత్స అందిస్తున్నామని చెప్పారు.
పేషెంట్ కు నాణ్యమైన వైద్యం చేస్తున్నామని చెప్పారు. అతడి ద్వారా మరొకరికి డెల్టా ప్లస్ వేరియంట్ సోకినట్లు గుర్తించామని పేర్కొన్నారు.
కరోనా మూడో దశ వచ్చే పరిస్థితులు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో అత్యంత జాగ్ర్తత్తగా ఉండాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సూచనలు పాటించాలని సూచించారు.
థర్డ్ వేవ్ ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. మరణాల సంఖ్య నియంత్రించడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు. లాక్ డౌన్ సడలింపులపై నిర్ణయం తీసుకుంటామని వివరించారు. కరోనా వేరియంట్ పై ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని సూచించారు. మహమ్మారి కాటుకు బలి కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు.