The financial crisis: కేసీఆర్, జగనే కాదు.. మోడీ కూడా అంతే!

The financial crisis కరోనా కల్లోలం అందరినీ రోడ్డునపడేసింది. ఉద్యోగాలు ఊడగొట్టింది. ఉపాధిని చిదిమేసింది. ఈ దెబ్బకు సామాన్యులే కాదు.. ప్రభుత్వాల ఆర్థిక వ్యవస్థ కూడా అతలాకుతలం అవుతుంది. శ్రీలంక దేశం అయితే ఆర్థిక విపత్తులోకి కృంగిపోయింది. అయితే ఏపీ ఆర్థిక పరిస్థితి కూడా ఏమాత్రం బాగా లేదని.. జీతాలు, పెన్షన్లకు కూడా ప్రతీ నెల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పులు చేస్తోందని ప్రతిపక్ష టీడీపీ, దాని అనుకూల మీడియా రచ్చ చేస్తోంది. అయితే ఏపీనే కాదు.. తెలంగాణ ప్రభుత్వం […]

Written By: NARESH, Updated On : May 23, 2022 2:22 pm
Follow us on

The financial crisis కరోనా కల్లోలం అందరినీ రోడ్డునపడేసింది. ఉద్యోగాలు ఊడగొట్టింది. ఉపాధిని చిదిమేసింది. ఈ దెబ్బకు సామాన్యులే కాదు.. ప్రభుత్వాల ఆర్థిక వ్యవస్థ కూడా అతలాకుతలం అవుతుంది. శ్రీలంక దేశం అయితే ఆర్థిక విపత్తులోకి కృంగిపోయింది. అయితే ఏపీ ఆర్థిక పరిస్థితి కూడా ఏమాత్రం బాగా లేదని.. జీతాలు, పెన్షన్లకు కూడా ప్రతీ నెల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పులు చేస్తోందని ప్రతిపక్ష టీడీపీ, దాని అనుకూల మీడియా రచ్చ చేస్తోంది.

అయితే ఏపీనే కాదు.. తెలంగాణ ప్రభుత్వం కూడా పీకల్లోతు అప్పుల్లో ఉన్న సంగతి ఎవరికీ తెలియదు. కేసీఆర్ సర్కార్ లో ప్రభుత్వ ఉద్యోగులు టీచర్లకు 12వ తేదీ వరకూ జిల్లాకు ఒకరోజు చొప్పున జీతాలు సర్దుబాటు చేస్తున్నారు. ఈ విషయాన్ని కేసీఆర్ కు భయపడి ఏ మీడియా కూడా ఎలుగెత్తి చాటడం లేదు. దీంతో జగన్ సర్కార్ అప్పుల గురించి వైరల్ చేస్తూ.. కేసీఆర్ సర్కార్ ను సైలెన్స్ చేస్తున్నారన్న విమర్శలున్నాయి.

తెలంగాణ, ఏపీ సమస్యనే ఇది కాదు.. దేశం పరిస్థితి కూడా అంతేనట.. మోడీ సార్ ‘పెట్రో’ధరల బాదుడు తగ్గించడంతో ఇప్పుడా లక్ష కోట్లను ఎలా సర్దుబాటు చేయాలో తెలియక తాజాగా భారతదేశ అవసరాలను తీర్చడానికి  13 బిలియన్ డాలర్ల రుణాన్ని తీసుకోవాలని యోచిస్తున్నట్టు తెలిపింది. పెట్రోల్, గ్యాస్ ధరలు ఒక్కసారిగా తగ్గడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఆ లోటును భర్తీ చేసేందుకు కేంద్రంలోని మోడీ సర్కార్ ఇలా అప్పు చేసి పప్పు కూడు తినాలని యోచిస్తోంది.

ఏపీ సీఎం జగన్ నే అందరూ టార్గెట్ చేస్తున్నారు. నిజానికి ఇంతకంటే ఘోరంగా తెలంగాణ పరిస్థితి ఉందంటున్నారు. తమది దేశంలోనే సంపన్న రాష్ట్రం అని చెప్పుకుంటున్న కేసీఆర్.. ఇతర రాష్ట్రాలకు వెళ్లి మరీ అక్కడి రైతులకు ఆర్థికసాయం చేస్తున్నారు. కానీ తెలంగాణలోని సమస్యలు పరిష్కారంలో.. మౌళిక వసతుల కల్పనలో రూపాయి విదిల్చడంలేదన్న విమర్శలున్నాయి.

ఇంత పెద్ద ఎత్తున రుణం తీసుకుంటున్నా కేంద్రంలోని మోడీ సర్కారుకు వ్యతిరేకంగా ఎవరూ గళం విప్పడం లేదు. ఎందుకంటే ఇప్పుడు మోడీని ఎదురించే వారు లేరు. కేంద్రమే కాదు.. రాష్ట్రాల పరిస్థితి కూడా ఇంతే. ఈ కరోనా కల్లోలం నుంచి ఏ ప్రభుత్వాలు, సామాన్యులు, ఉద్యోగులు కోలుకోవడం లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని విమర్శల వాన కురిపించడంలోనూ ప్రతిపక్షాలు పక్షపాతం చూపించకపోతే మంచిదని హితవు పలుకుతున్నారు.