ఈటలతో ఫైట్: కాసులతో కేసీఆర్ కొడుతున్నాడు?

తెలంగాణలో ఇప్పుడు అందరి దృష్టి హుజురాబాద్ పైనే పడింది. ఈటల రాజేందర్ టీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరడంతో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. అధికార పార్టీ టీఆర్ఎస్, బీజేపీ రెండు ప్రతిష్టాత్మకంగా భావించి హుజురాబాద్ లోనే మకాం వేస్తున్నాయి. తమ నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నాయి. ఎలాగైనా విజయం సాధించాలనే తపనతో ముందుకు వెళ్తున్నాయి. కేసీఆర్, రాజేందర్ మధ్య జరిగే యుద్ధంలా మారిపోయే అవకాశాలున్నాయని తెలుస్తోంది. సవాళ్లు,ప్రతిసవాళ్లతో హోరెత్తిస్తున్నాయి. అధికార పార్టీ ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను […]

Written By: Srinivas, Updated On : June 24, 2021 2:04 pm
Follow us on

తెలంగాణలో ఇప్పుడు అందరి దృష్టి హుజురాబాద్ పైనే పడింది. ఈటల రాజేందర్ టీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరడంతో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. అధికార పార్టీ టీఆర్ఎస్, బీజేపీ రెండు ప్రతిష్టాత్మకంగా భావించి హుజురాబాద్ లోనే మకాం వేస్తున్నాయి. తమ నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నాయి.

ఎలాగైనా విజయం సాధించాలనే తపనతో ముందుకు వెళ్తున్నాయి. కేసీఆర్, రాజేందర్ మధ్య జరిగే యుద్ధంలా మారిపోయే అవకాశాలున్నాయని తెలుస్తోంది. సవాళ్లు,ప్రతిసవాళ్లతో హోరెత్తిస్తున్నాయి. అధికార పార్టీ ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను మోహరించి ప్రజల్లో విశ్వాసం కలిగించేందుకు పాటు పడాల్సిందిగా సూచిస్తున్నాయి.

ఇప్పటికే పెండింగులో ఉన్న పనులు పూర్తయ్యేలా చూస్తున్నారు. నిధుల వరద పారిస్తున్నారు. ఈటల రాజేందర్ పై ఆరోపణలు ఎక్కుపెడుతున్నారు. ఈటల కూడా అంతే స్థాయిలో విరుచుకుపడుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ దిగజారిందని విమర్శిస్తున్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి అధికార పార్టీ అహంకారానికి మధ్య జరుగుతున్న పోరాటంగా ఈటల రాజేందర్ అభివర్ణిస్తున్నారు.

అధికార పార్టీకి లొంగి ఓట్లు వేయొద్దని సూచిస్తున్నారు. నిజమైన ఉద్యమకారుడెవరో మీకు తెలుసని చెబుతున్నారు. ఏనాడు హుజురాబాద్ గోడు పట్టని కేసీఆర్ ఇప్పుడు లేని ప్రేమ ఒలకబోస్తున్నారని దుయ్యబట్టారు. అధికారపార్టీ కోట్లాది రూపాయలు ఆగమేఘాల మీద కుమ్మరిస్తోంది. విజయం కోసం ఎంతకైనా తెగించేందుకు సిద్ధం గా ఉన్నట్లు తెలుస్తోంది.