https://oktelugu.com/

కేంద్రంతో ఫైట్: ఎట్టకేలకు దిగొచ్చిన ట్విట్టర్

ఎట్టకేలకు సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్ దిగొచ్చింది. కేంద్రం ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అని దురుసు చర్యలకు పాల్పడ్డ ట్విటర్ తాజాగా వెనక్కి తగ్గింది. కేంద్రంలోని మోడీ సర్కార్ తీసుకొచ్చిన నూతన ఐటీ నిబంధనల అమలు దిశగా చర్యలు చేపట్టింది. భారత్ లో నివసించే ‘రెసిడెంట్ గ్రీవెన్స్ అధికారి’ని నియమించింది. భారత్ కు చెందిన వినయ్ ప్రకాష్ కు ఈ బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ట్విట్టర్ కు ఫిర్యాదు చేయాలనుకునే వారికి అడ్రస్ ను, […]

Written By:
  • NARESH
  • , Updated On : July 11, 2021 / 01:24 PM IST
    Follow us on

    ఎట్టకేలకు సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్ దిగొచ్చింది. కేంద్రం ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అని దురుసు చర్యలకు పాల్పడ్డ ట్విటర్ తాజాగా వెనక్కి తగ్గింది. కేంద్రంలోని మోడీ సర్కార్ తీసుకొచ్చిన నూతన ఐటీ నిబంధనల అమలు దిశగా చర్యలు చేపట్టింది. భారత్ లో నివసించే ‘రెసిడెంట్ గ్రీవెన్స్ అధికారి’ని నియమించింది. భారత్ కు చెందిన వినయ్ ప్రకాష్ కు ఈ బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ట్విట్టర్ కు ఫిర్యాదు చేయాలనుకునే వారికి అడ్రస్ ను, వినయ్ ప్రకాష్ ఉండే కార్యాలయం వివరాలను వెబ్ సైట్ లో పొందుపరిచింది. ఒక ఈమెయిల్ ఐడీ ఇచ్చింది. వినియోగదారులు ఈ మెయిల్ ఐడీకి ఫిర్యాదులు చేయవచ్చని సూచించింది.

    కేంద్రప్రభుత్వం కొత్త సోషల్ మీడియా నిబంధనలను దేశంలో ప్రవేశపెట్టి మే నెలలోపు అమలు చేయాలని అన్ని సోషల్ మీడియా సంస్థలకు నోటీసులు ఇచ్చింది. మే 26లోపు అమలు చేయాలని ఆదేశించింది. కేంద్రం తెచ్చిన కొత్త నిబంధనల ప్రకారం దేశంలో ట్విట్టర్ సహా అన్ని సంస్థలు బాధ్యులైన చీఫ్ కాంప్లియన్స్ ఆఫీసర్ ను నియమించాల్సి ఉంటుంది. అంతేకాదు.. రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీస్, నోడల్ కాట్రాక్ట్ అధికారులను భారత్ కు చెందిన వ్యక్తులను నియమించాలని కేంద్రం స్పష్టం చేసింది. అయితే ట్విట్టర్ మాత్రం ఈ అధికారులను నియమించలేదు. దీంతో కేంద్రం ఆగ్రహించింది.

    కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చి నెలలు గడిచినా ట్విట్టర్ ఇంకా వీటిని పాటించేందుకు విముఖత చూపిస్తోందని కేంద్రం ఆరోపిస్తోంది. కేంద్ర ఐటీ శాఖ ట్విట్టర్ కు నోటీసులు జారీ చేసింది. ఇదే చివరి నోటీసు అని.. నిబంధనలు పాటించక పోతే తక్షణమే ట్విట్టర్ తన మధ్యవర్తిత్వ హోదాను కోల్పోవాల్సి వస్తుందని కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ట్విట్టర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. అయినా ట్విట్టర్ వెనక్కి తగ్గకుండా కేంద్రమంత్రుల ఖాతాలను బ్లాక్ చేస్తూ గేమ్స్ ఆడింది. ఆగ్రహించిన కేంద్రప్రభుత్వం దేశంలో ట్విట్టర్ దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ట్విట్టర్ చేస్తున్న పనులు కేంద్రానికి ఆగ్రహం తెప్పిస్తున్నాయి. ఉపరాష్ట్రపతి వెంకయ్య అకౌంట్ ను వెరిఫైడ్ అకౌంట్ కాదంటూ తీసేసి మళ్లీ యాడ్ చేయడం దుమారం రేపింది.

    ఢిల్లీ హైకోర్టు తాజాగా అధికారుల నియామకం విసయంలో జాప్యం తగదని హెచ్చరించింది. లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. దీంతో 2 నెలల సమయం కోరిన ట్విట్టర్ తాజాగా అధికారులను ఆ గడువుకు ముందే నియమించింది. ఇప్పటికే ట్విట్టర్ పై అభ్యంతరక పోస్టులకు కాను పలు కేసులు నమోదయ్యాయి.