జగన్ కేసీఆర్ మధ్య యుద్ధం మొదలైనట్లేనా..?

ఏపీలో రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలకు కొన్ని విషయాల్లో పోలికలు ఉన్నాయి. రెండు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే అధికారంలో ఉండగా అధికారంలోకి రావడానికి అటు కేసీఆర్ కానీ ఇటు జగన్ కానీ పడిన కష్టం అంతాఇంతా కాదు. చంద్రబాబు కేసీఅర్ మధ్య విబేధాలు ఉన్నా జగన్ కేసీఆర్ మాత్రం ఒకరితో ఒకరు సన్నిహితంగానే మెలిగారు. పలు సందర్భాల్లో కేసీఆర్ కొడుకు కేటీఆర్ సైతం జగన్ గురించి పాజిటివ్ గా వ్యాఖ్యానించిన సందర్భాలు ఉన్నాయి. Also Read : […]

Written By: Navya, Updated On : September 23, 2020 10:12 am
Follow us on

ఏపీలో రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలకు కొన్ని విషయాల్లో పోలికలు ఉన్నాయి. రెండు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే అధికారంలో ఉండగా అధికారంలోకి రావడానికి అటు కేసీఆర్ కానీ ఇటు జగన్ కానీ పడిన కష్టం అంతాఇంతా కాదు. చంద్రబాబు కేసీఅర్ మధ్య విబేధాలు ఉన్నా జగన్ కేసీఆర్ మాత్రం ఒకరితో ఒకరు సన్నిహితంగానే మెలిగారు. పలు సందర్భాల్లో కేసీఆర్ కొడుకు కేటీఆర్ సైతం జగన్ గురించి పాజిటివ్ గా వ్యాఖ్యానించిన సందర్భాలు ఉన్నాయి.

Also Read : స్మార్ట్‌ఫోన్లు లేని పేదలకు ఊరట.. రూ.4 వేలకే స్మార్ట్‌ ఫోన్‌

కొన్ని నెలల క్రితం ఇరు రాష్ట్రాల మధ్య జలవివాదం తలెత్తిన సమయంలో కూడా జగన్, కేసీఆర్ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్న దాఖలాలు లేవు. అయితే వ్యవసాయ బావులకు బిగించే మీటర్ల వల్ల ఇరు రాష్ట్రాల సీఎంల మధ్య వివాదం షురూ అయింది. మంత్రి హరీష్ రావు తెలంగాణ సర్కార్ కు ప్రయోజనం చేకూరేలా వ్యాఖ్యలు చేయబోయి జగన్ సర్కార్ పై విమర్శలు చేశారు. జగన్ సర్కార్ 4 వేల కోట్ల కోసమే బావులకు మీటర్లను బిగిస్తోందని చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.

కేంద్రం 2,500 కోట్లు ఇస్తామని చెప్పినా మీటర్లను బిగించడానికి తమ సర్కార్ అంగీకరించలేదని హరీశ్ రావు చెప్పారు. రైతుల ప్రయోజనాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోమని అన్నారు. హరీష్ రావు వ్యాఖ్యలు జగన్ కేసీఆర్ మధ్య పరోక్ష యుద్ధానికి కారణమవుతున్నాయి. భవిష్యత్తులో ఒక పార్టీపై మరొక పార్టీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పటికే తెలుగు రాష్ట్రాల మధ్య అనేక విషయాల్లో వివాదాలు ఉన్నాయి. సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటే మాత్రమే ఆ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. వివాదాలు తలెత్తితే మాత్రం తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కోర్టు మెట్లెక్కాల్సి ఉంటుంది. మీటర్ల అంశం జగన్ కేసీఆర్ ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధానికి దారి తీస్తోందనే చెప్పాలి.

Also Read : తెలంగాణలో పొలిటికల్  హీట్