ఆన్‌లైన్ షాపింగ్‌లో నెం 1 స్థానంగా కొనసాగుతున్న ఆమెజాన్ షాపింగ్ ఇక తెలుగు వినియోగదారుల కోసం ప్రత్యేక పోర్టల్‌ను అందించనుంది. ఇకపై ఆంగ్లంపై పట్టు తక్కువ ఉన్నవారికి సైతం అర్థమయ్యేలా పోర్టల్‌ను డిజైన్ చేశారు. ఇప్పటికే ఇంగ్లీష్, హిందీలో సేవలందిస్తున్న ఈ కంపెనీ ప్రస్తుతం తెలుగు భాషలో సేవలందించనుంది. ఆండ్రాయిడ్ మొబైల్‌తో పాటు ఎక్కడి నుంచైనా ఆమెజాన్ వస్తువుల గురించి తెలుగుభాషలో తెలుసుకోవచ్చు. వచ్చే నెలలో దసరా, ఆ తరువాత దీపావళి పండుగలు రానున్న నేపథ్యంలో ఆమెజాన్ భారీ ఆఫర్లు ప్రకటించే అవకాశం ఉంది. దీంతో అన్ని భాషల్లోని వారికి సులభంగా అర్థమయ్యేలా డిజైన్ చేస్తున్నామని ఆమెజాన్ మార్కెటింగ్ డైరెక్టర్ కిశోర్ తెలిపారు. అలాగే కస్టమర్ సర్వీస్‌ను కూడా తెలుగు భాషలో రూపొందించనున్నామని ఆయన తెలిపారు.
Also Read: బడికెళ్లకుండానే పది పరీక్షలు.