Homeజాతీయ వార్తలుFifth century ship: ప్రాచీన నౌకా వైభవం.. 500 ఏళ్ల తర్వాత ఒమన్‌కు పురాతన పద్ధతిలో...

Fifth century ship: ప్రాచీన నౌకా వైభవం.. 500 ఏళ్ల తర్వాత ఒమన్‌కు పురాతన పద్ధతిలో భారత్ ప్రయాణం

Fifth century ship: ప్రాచీన కాలంలో మన నౌకా యానం అద్భుతంగా ఉండేది. నాడు రోడ్డు, రైలు మార్గాలు లేకపోవడంతో నౌకల్లోనే వివిధ దేశాలకు వెళ్లేవారు. నాటి టెక్నాలజీ అద్భుతంగా ఉండేది. ఇప్పుడు నాటి వైభవాన్ని భవిష్యత్‌ తరాలకు చాటేలా కేంద్రం అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 2025, డిసెంబర్‌ 29న భారతీయ నౌకా చరిత్రకు కొత్త అధ్యాయం లిఖితమవుతుంది. గుజరాత్‌లోని పోర్‌బందర్‌ నుంచి ప్రారంభమయ్యే పెద్ద పడవలు, ప్రాచీన ‘స్టిచ్డ్‌ ప్లాంక్‌‘ పద్ధతితో తయారై, ఇండోనేషియా, వియత్నాం, కంబోడియా, ఓమాన్‌ వరకు సముద్ర మార్గాల్లో ప్రయాణిస్తాయి. ఈ ప్రయాణం భారత నేవీ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, హోలీ ఇన్నోవేషన్స్‌ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. నాటి సాంకేతికతను ఆధునిక నావికులతో కలిపి, భారత సముద్ర యాన వారసత్వాన్ని ప్రపంచానికి ప్రదర్శిస్తున్నారు.

ప్రాచీన సాంకేతికత పునరుజ్జీవనం
చోళుల కాలంలో వికసించిన ఈ పద్ధతి, కొబ్బరి తాడులతో వుడుపలకలను బంధించి, సహజ గమ్ముతో సముద్ర అలలను తట్టుకునేలా రూపొందించారు. ఎల్లోరా, అజంతా గుహల్లో చిత్రించిన డిజైన్‌ల ఆధారంగా తయారైన ఈ పడవలు, టన్నుల సరుకు మోసుకెళ్లేలా, సైనిక యుద్ధాలకు సజ్జమవుతాయి. సుప్రసిద్ధ నౌకా నిర్మాణ నిపుణుడు బాబు శంకరన్‌ మార్గదర్శకత్వంలో ఈ ప్రాజెక్టు పూర్తయింది. ఆంగ్లేయులు రాకముందు భారత పడవలు మడగాస్కర్, జాంజిబార్‌ వరకు విస్తరించాయనే చరిత్రను ఈ ప్రయాణం పునరుద్ధరిస్తుంది.

బాలీ నుంచి నికోబార్‌ వరకు..
పోర్‌బందర్‌ నుంచి జలప్రవేశం పొందిన పడవలు, బాలీ ద్వీపం, వియత్నాం, కంబోడియా గమనించి, నక్కవరం (నికోబార్‌)లో ఆగి, ఓమాన్‌కు చేరతాయి. చోళ సామ్రాజ్య కాలంలో ఈ మార్గాల్లో వాణిజ్యం, యుద్ధాలు జరిగాయి. ప్రకతి స్నేహపూర్వక మెటీరియల్స్‌తో తయారైన ఈ పడవలు, సముద్ర శక్తులను ఎదుర్కొనేలా డిజైన్‌ చేయబడ్డాయి. ఆధునిక నావికలు పాత టెక్నాలజీని నడిపిస్తూ, నేటి తరానికి చరిత్ర బోధను అందిస్తారు.

సాంస్కృతిక వారసత్వ పునరుద్ధరణ..
ఈ ప్రయాణం భారత సముద్రయాన గొప్పలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తుంది. 500 సంవత్సరాల తర్వాత పునరావృతమవుతున్న ఈ సాహసం, ప్రాచీన పద్ధతులు ఇప్పటికీ ప్రస్తుతమవుతాయని నిరూపిస్తుంది. వాణిజ్యం, రక్షణ, సాంస్కృతిక మార్గదర్శకత్వంగా భారతుడు ప్రపంచాన్ని పాలించిన గతాన్ని గుర్తు చేస్తూ, యువతకు స్ఫూర్తినిస్తుంది. ఈ ప్రాజెక్టు ద్వారా భారతీయ నౌకా కళా వస్తువులు అంతర్జాతీయ మహిమను పొందుతాయి.

 

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version