https://oktelugu.com/

Father Rapes Daughter: తండ్రిలా కాపాడేవాడే కాటేస్తున్నాడు.. రెండేళ్లుగా అత్యాచారం.. షాకింగ్ నిజాలు

Father Rapes Daughter: మహిళలపై దారుణాలు జరిగిపోతూనే ఉన్నాయి. ఎన్ని చట్టాలు వచ్చినా వాటిని ఆపడం తరం కావడం లేదు. ఫలితంగా దేశంలో నానాటికి నేరాలు పెరిగిపోతున్నాయి. అతివలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. నిర్భయ, దిశ లాంటి చట్టాలున్నా అగంతకుల్లో భయం మాత్రం కనిపించడం లేదు. రోజుకో కేసు వెలుగు చూస్తూనే ఉంది. దీంతో మహిళల పరిస్థితిపై ఆందోళన కలుగుతూనే ఉంది. హైదరాబాద్ లో ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య చేయడం సంచలనం సృష్టించింది. హైదరాబాద్ బండ్లగూడలోని […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : September 15, 2021 11:52 am
    Follow us on

    Father Rapes DaughterFather Rapes Daughter: మహిళలపై దారుణాలు జరిగిపోతూనే ఉన్నాయి. ఎన్ని చట్టాలు వచ్చినా వాటిని ఆపడం తరం కావడం లేదు. ఫలితంగా దేశంలో నానాటికి నేరాలు పెరిగిపోతున్నాయి. అతివలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. నిర్భయ, దిశ లాంటి చట్టాలున్నా అగంతకుల్లో భయం మాత్రం కనిపించడం లేదు. రోజుకో కేసు వెలుగు చూస్తూనే ఉంది. దీంతో మహిళల పరిస్థితిపై ఆందోళన కలుగుతూనే ఉంది. హైదరాబాద్ లో ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య చేయడం సంచలనం సృష్టించింది.

    హైదరాబాద్ బండ్లగూడలోని గౌస్ నగర్ ప్రాంతానికి చెందిన మహిళ భర్తతో విడాకులు తీసుకుని పిల్లలతో నివసిస్తోంది. ఆమెకు 14 ఏళ్ల కూతురు, ఇద్దరు కుమారులున్నారు. అంబర్ పేటకు చెందిన ఓ వ్యాపారి ఆమెను చేరదీసి తోడుంటానని చెప్పాడు. అప్పుడప్పుడు వస్తూ పోతుంటాడు. ఈ నేపథ్యంలో ఆమె కూతురుపై కన్నేశాడు.

    మూడేళ్లుగా భయపెడుతూ ఆమెపై అత్యాచారం చేస్తూనే ఉన్నాడు. ఎవరికి చెప్పొద్దని బెదిరిస్తున్నాడు. తను ఎవరికి చెప్పుకోలేక నానా ఇబ్బందులు పడేది. కానీ ఈ నెల 13న తల్లి అతడి చర్యను గమనించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

    తోడుంటానని చెప్పి తోడేళులా ప్రవర్తించాడు. నమ్మినందుకు నట్టేట ముంచాడు. కూతురులా చూసుకోవాల్సిన ఆమెను తన కామవాంఛకు బలిచేశాడు. ఇలాంటి దారుణాలు రోజుకోటి వెలుగు చూస్తున్నాయి. అమాయక బాలికలే పావులుగా మారిపోతున్నారు. తల్లిని తమ వైపు తిప్పుకుని కూతుళ్లపై దారుణాలు చేయడంతో భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎవరికి చెప్పుకోలేక కుమిలిపోతున్నారు. రెండో సంబంధాలతో లాభం కంటే బదులు నష్టాలే ఎక్కువగా వస్తున్నాయి.