వామ్మో..ఇదేం పరుగు..మూడవ స్థానానికి ఉసేన్ బోల్ట్

కర్ణాటకలో సంప్రదాయ క్రీడ “కంబల” రేస్ లో మొన్నటికి మొన్న శ్రీనివాస్ గౌడ అనే యువకుడు 100మీటర్లను కేవలం9.55సెకన్లోనే పరుగుత్తిన విషయం తెలిసిందే.. అయితే ఇదే రేస్ లో మరో కొత్త ప్రపంచ రికార్డ్ నెలకొలిపి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందుతున్నాడు నిశాంత్ అనే కుర్రాడు. శ్రీనివాస్ కన్నా 4సెకన్ల తక్కవ సమయంలో 100మీటర్లు పరుగెత్తిన నిశాంత్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెలబ్రిటీగా మారిపోయాడు. 100మీటర్లను కేవలం9.51సెకన్లోనే పరుగుత్తి వరల్డ్ రికార్డు సృష్టించాడు. ప్రపంచలో పరుగుల వీరుడు ఉసేన్ […]

Written By: Neelambaram, Updated On : February 19, 2020 1:05 pm
Follow us on

కర్ణాటకలో సంప్రదాయ క్రీడ “కంబల” రేస్ లో మొన్నటికి మొన్న శ్రీనివాస్ గౌడ అనే యువకుడు 100మీటర్లను కేవలం9.55సెకన్లోనే పరుగుత్తిన విషయం తెలిసిందే.. అయితే ఇదే రేస్ లో మరో కొత్త ప్రపంచ రికార్డ్ నెలకొలిపి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందుతున్నాడు నిశాంత్ అనే కుర్రాడు. శ్రీనివాస్ కన్నా 4సెకన్ల తక్కవ సమయంలో 100మీటర్లు పరుగెత్తిన నిశాంత్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెలబ్రిటీగా మారిపోయాడు. 100మీటర్లను కేవలం9.51సెకన్లోనే పరుగుత్తి వరల్డ్ రికార్డు సృష్టించాడు.

ప్రపంచలో పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్ కి 100మీటర్లు కవర్ చేయడానకి 9.58సెకన్లు పట్టిన విషయం తెలిసిందే. అయితే మొన్న శ్రీనివాస్ గౌడ్, నిన్న నిశాంత్ లు మరో రెండు కొత్త రికార్డులు సృష్టించారు. అందుకుగాను వారికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీనివాస్ గౌడకు ఇచ్చిన ఆఫర్ లాగా కేంద్రక్రీడాశాఖ మంత్రి నిశాంత్ కు కూడా ఛాన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

జంతు హక్కుల కార్యకర్తల ఒత్తిడితో కొన్నేళ్ల క్రితం కర్నాటకలో “కంబల” పోటీలపై నిషేధం కొనసాగింది. అయితే సిద్దరామయ్య నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు ప్రత్యేక చట్టం చేసి కంబాలా పోటీలకు అనుమతిచ్చారు.