సచిన్ కూడా ఓ 20 మంది ఎమ్యెల్యేలతో బైటకు వస్తే అశోక్ గెలట్ ప్రభుత్వాన్ని పడగొట్టడం సులభం కాగలదని భావిస్తున్నారు. సచిన్ ని మంచి చేసుకోవడం కోసమే ఆయన మామగారైన జమ్మూ, కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, ఎంపీ ఫారూఖ్ అబ్దుల్లా విడుదలకు ఆదేశాలు జారీచేసిన్నట్లు కనిపిస్తున్నది.
గత ఏడు నెలలుగా, ఆర్టికల్ 370 రద్దు సమయం నుండి ఆయనను గృహ నిర్బంధంలోనే ఉంచారు. పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం ఆయన్ను అరెస్టు చేశారు. 83 ఏళ్ల ఫారూక్‌తో పాటు ఆయన కుమారుడు ఒమర్ అబ్దుల్లా, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీలను కూడా నిర్భధించారు. గత ఏడాది సెప్టెంబర్‌లో ఒమర్ అబ్ధుల్లాపై పీఎస్ఏను ప్రయోగించారు.
ఆ చట్టం ప్రకారం ఎటువంటి విచారణ లేకుండా రెండేళ్లు నిర్బంధంలో ఉంచవచ్చు. సాధారణంగా తీవ్రవాదులు, నేరస్థులపై ఉపయోగించే ఈ చట్టాన్ని మొదటిసారిగా రాజకీయ నాయకులపై ఉపయోగించారు. గత ఏడాది డిసెంబర్‌లో ఫారూక్ డిటెన్షన్‌ను మరో మూడు నెలల పాటు పొడిగించారు.
ఫారూఖ్ కుమార్తెను సచిన్ పైలట్ వివాహం చేసుకున్నారు. అనుకున్నట్లు జరిగితే ఇంకా నిర్బంధంలో ఉన్న మరో మాజే ముఖ్యమంత్రి, ఫారూఖ్ కుమారుడు ఒమర్ అబ్దుల్లాను కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.