Amaravati Farmers: అమరావతి రాజధాని విషయంలో హైకోర్టు తీర్పును అందరు స్వాగతిస్తున్నారు. ధర్మం గెలిచిందని చెబుతున్నారు. 807 రోజులుగా రైతులు చేస్తున్న ఉద్యమానికి శక్తి వచ్చినట్లయింది. దీంతో అన్ని వర్గాల్లో ఆనందం వెల్లివెరిసింది. హైకోర్టు తీర్పుతోనైనా ప్రభుత్వంలో మార్పు రావాలని ఆశిస్తున్నారు అన్ని రాజకీయ పార్టీలు ఏకమైనా వైసీపీ మాత్రం తాను అనుకున్నది చేయాలని సంకల్పించడం గమనార్హం. దీంతో విషయం కాస్త కోర్టు వరకు వెళ్లడం తెలిసిందే.
టీడీపీ, జనసేన, బీజేపీలు మద్దతు తెలిపినా ప్రభుత్వం మాత్రం ససేమిరా అంది. దీంతో వైసీపీ ఒంటరైపోయింది. అమరావతికి భూములిచ్చిన రైతులు రాజధాని విషయంలో తగ్గేదే లేదని ఎదురు తిరిగినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఫలితంగా ఉద్యమానికి ముందుకు వచ్చారు మహిళలు కూడా ఇందులో పాలు పంచుకున్నారు. అయినా వారిని పెయిడ్ ఆర్టిస్టులంటూ అవహేళన చేసినా వారు పట్టించుకోలేదు. తమ ప్రాంతం కోసం ఉద్యమంలో పాల్గొని తామేంటో నిరూపించారు.
Also Read: వివేకా హత్య కేసు: ఏ క్షణమైనా చార్జి షీట్
ఈ నేపథ్యంలో హైకోర్టు వెలువరించిన తీర్పును అందరు స్వాగతిస్తున్నారు. రాజకీయ పార్టీలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇకనైనా ప్రభుత్వం ప్రజామోద కార్యక్రమాలు చేపట్టాలని ప్రజాగ్రహం వ్యక్తం చేసే పనుల పట్ల పట్టింపులకు పోకుండా ఉండాలని సూచిస్తున్నారు. అయినా జగన్ మాత్రం తన పంతం మార్చుకునేలా లేనట్లు కనిపిస్తోంది. ఇంత జరుగుతున్నా ఆయన తన అభిప్రాయం మాత్రం వెల్లడించకపోవడం గమనార్హం.
రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు రాకుండా పోయాయి. మూడు రాజధానుల వ్యవహారం వెలుగులోకి రావడంతో పెట్టుబడులు పక్క రాష్ట్రానికి తరలిపోవడంతో అందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరును తప్పుబట్టినా జగన్ మాత్రం వెనక్కి తగ్గలేదు. తాననుకున్నది చేస్తానని ముందడుగు వేయడంతో ప్రజల్లో అసహనం పెరిగిపోయింది.
నిరంకుశంగా పరిపాలన చేస్తూ ప్రజల ఆగ్రహానికి గురైన ముఖ్యమంత్రి జగన్ తక్షణమే క్షమాపణ చెప్పాలనే డిమాండ్ వస్తోంది. దీంతో ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో ఇంకా తెలియడం లేదు. ఈ క్రమంలో ఇవాళ కోర్టు ఇచ్చిన తీర్పుతో రాజకీయ పరిణామాలు మారే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి.
Also Read: మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్రలో జితేందర్ రెడ్డి, డీకే అరుణ పేర్లు తెరపైకి? అసలు కథేంటి?