Farmers Debts AP: ‘ రైతు ప్రభుత్వం.. మా నాన్న రైతును రుణ విముక్తుడిని చేశాడు.. నేను రైతును రాజులు చేస్తాను.. రైతు రాజ్యం తెస్తాను’ 2019 అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులకు ఇచ్చిన హామీ ఇది. అధికారంలోకి వచ్చాక కూడా తమది రైతు ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వం అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. రైతును రాజును చేయడం అటుంచి.. క్షేత్రస్థాయిలో ఒక్కో అన్నదాతపై జగన్ రెడ్డి పాలనలో రూ. 2.45 లక్షల అప్పు మిగిలింది.

దేశంలోనే నెంబర్ వన్..
రైతులపై అప్పుల భారంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఇదేమో కాకి లెక్కలు కాదు. కేంద్ర ప్రభుత్వమే పార్లమెంటులో స్వయంగా ఈ ప్రకటన చేసింది. ఇలాంటివేవీ పాలకులకు కనిపించడం లేదు. నేను బటన్ నొక్కుతున్నాను సంక్షేమం రైతులకు అందుతుంది అన్న భావన భ్రమలోనే జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. డబ్బులు పంచడం కోసమే అప్పులు చేసుకుంటూ రైతులపై మోయలేని భారం మోపుతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే జగన్ పాలన పూర్తయ్యే నాటికి ఒక్కో రైతుపై మూడు లక్షల అప్పు పడుతుందని అంచనా.
పంట కొనుగోళ్లకు ప్రయాస..
రైతు సంక్షేమం అంటూ ఊదరగొట్టే వైఎస్ఆర్సిపి సర్కారు రైతులు పండించిన పంట కొనుగోలుకూ తిప్పలు పడుతుంది. పంట కొనుగోలుకు సంబంధించిన డబ్బులు మొత్తం కేంద్రమే ఇస్తున్నప్పటికీ.. పాలనా అనుభవం లేని సీఎం జగన్ సంక్షేమం పేరుతో డబ్బులు పంచుతూ రైతులను ఇబ్బంది పెడుతున్నారు. కేంద్రం నిధులను నిదుర పనులకు కార్యక్రమాలకు మళ్లిస్తూ పంటలు కూడా కొనుగోలు చేయలేని పరిస్థితిలో ఏపీ సర్కార్ ఉంది. ఇటీవల తుఫాను ప్రభావంతో వేల ఎకరాల్లో పంటలు నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు. రైతులను ఆదుకుంటామని చెబుతున్న జగన్ మళ్ళీ అప్పులు తెచ్చి అదే రైతులపై భారం మోపుతున్నారు. అమాయకులైన రైతులకు ఈ విషయం అర్థం కావడం లేదు.
సీబీఐ దత్తపుత్రుడికి.. ఈ జైల్ రెడ్డికి ఇలాంటివి ఏమీ కనిపించవు. ఎవడు ఇంట్లో దూరుతున్నాడు.. ఎవరికి ఎంత మంది పెళ్లాలు ఉన్నారు.. ఆదివారం వస్తే చికెన్ కొనాలా.. ఫిష్ కొనాలా ఇలాంటి బోడి కబుర్లు మీటింగుల్లోచెప్పమంటే ముందుంటాడు.

5వ స్థానంలో తెలంగాణ
మరో తెలుగు రాష్ట్రం తెలంగాణ రైతులు కూడా క్రమంగా అప్పుల ఊబిలో కూరుకు పోతున్నారు. మీ రాష్ట్రంలో ఓ రైతుపై రూ
1.52 లక్షల అప్పు ఉందనీ కేంద్రం వెల్లడించింది. తెలంగాణ రైతులకు మేలు చేస్తున్నామని.. దేశంలో ఏ రాష్ట్రంలో యువని విధంగా రైతుబంధు రైతు బీమా ఇస్తున్నామని కేసీఆర్ పదే పదే చెబుతున్నారు. కానీ రైతులకు అందించే సబ్సిడీ విత్తనాలు యంత్రాలు ఎరువులు పూర్తిగా ఎత్తేసి రైతుబంధు రైతు బీమా ఇస్తున్న విషయం మాత్రం చెప్పడం లేదు. రైతుబంధు రైతు బీమా ద్వారా ప్రభుత్వానికి ఆదాయము మిగులుతుంది. మరోవైపు రైతులపై అప్పుల భారం పెరుగుతుంది. కాలేశ్వరం ప్రాజెక్టు పేరుతో వేల కోట్ల రూపాయలను మళ్ళించడంతో ఈ పరిస్థితి ఏర్పడిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. కాలేశ్వరం ప్రాజెక్టు మాత్రం ఇప్పటివరకు లక్ష్యం మేరకు ఆయకట్టుకుని అందించలేదు. మరోవైపు విద్యుత్ బకాయలు భారీగా పెరిగిపోతున్నాయి. రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ కూడా సక్రమంగా అమలు కావడం లేదు.
మొత్తంగా తెలుగు రాష్ట్రాల పాలకులు తమ అనుసరిస్తున్న విధానాలతో రైతును ఊబిలోకి నడుతున్నారు.