వైసీపీ తీసుకున్న 3 రాజధానుల నిర్ణయంలో భాగంగా విశాఖను అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ గా ప్రకటించిన తర్వాత వైజాగ్ వాసులు విపరీతమైన సందిగ్ధత లో పడ్డారు. అయితే ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం నుండి వారికి ఒక గుడ్ న్యూస్ వచ్చింది. దేశ రవాణా వ్యవస్థలో హైవేలు అత్యంత కీలకం. ప్రపంచంలో ఎన్నో అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన దేశంలో హైవేలపై రవాణా అంత ఆశాజనకంగా సాగటం లేదు.
Also Read: ప్రభుత్వానికి, న్యాయ వ్యవస్థకు మధ్య అగాధం?
అందుకే రవాణా రంగానికి మరింత ఊతం ఇవ్వాలని నగరాల మధ్య ప్రయాణాన్ని వేగవంతం చేయడం కోసం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నూతన రవాణా వ్యవస్థ నిర్మాణానికి నడుంబిగించింది. 23 కొత్త హైవేల నిర్మాణానికి హైవేస్ అథారిటీ డెడ్లైన్ విధించింది. 2025, మార్చి 25 లోగా ఈ హైవేలను నిర్మించాలని కీలక నిర్ణయం తీసుకుంది.
వీటిలో భాగంగా ఈ హైవేలు.. ఆంధ్ర రాష్ట్రంలో హైదరాబాద్, వైజాగ్, విజయవాడ ల మీదుగా కూడా వెళ్లనున్నాయి. వీటి నిర్మాణం కోసం ఎన్ హెచ్ స్పెషల్ పర్పస్ వెహికల్స్ ను ఏర్పాటు చేయనుంది. కొత్త హైవే లలో మూడు హైవేలు హైదరాబాద్ కు సంబంధించి ఉండటం విశేషం. హైదరాబాద్ నుంచి భద్రాచలం మీదుగా విశాఖపట్నానికి ఒక హైవే నిర్మించనున్నారు. ఇందులో భాగంగా 221 కిలోమీటర్ల మేర ఈ కొత్తగా హైవే నిర్మిస్తారు.
Also Read: కేటీఆర్ రెడీ.. మరి లోకేష్?
అలాగే రాయిపూర్-విశాఖ నగరాల మధ్య 464 కిలోమీటర్ల పొడవైన హైవే కూడా నిర్మించనున్నారు.ఇకపోతే తెలంగాణ తాకుతూ భద్రాచలం మీదుగా నాగపూ- విజయవాడ నగరాల మధ్య 457 కిలోమీటర్ల పొడవైన మరో హైవే నిర్మిస్తున్నారు. ఇలా వైజాగ్ నగరవాసులకు పలువురు ప్రధానమైన వాణిజ్య నగరాల నుండి అనుసంధానం జరుగుతుండటంతో…. ఒకవేళ రాజధాని కనుక విశాఖలో నిర్మించినట్లు అయితే… ఎన్నో రకాలుగా ఈ హైవేలు ఉపయోగపడుతున్నాయి. ఇంకా ఇతర రాష్ట్రాలకు వారి ప్రయాణ సమయం కూడా భారీగా తగ్గబోతోంది.