https://oktelugu.com/

‘మజిలీ – సమ్మోహనం’ కలయికలో చైతు !

నాగ చైతన్య కెరీర్ లోనే మజిలీ సినిమా ప్రత్యేకమైనది. మొత్తానికి చైతు మంచి మెచ్యూర్డ్ లవ్ స్టోరీ టచ్ చేశాడు ఈ సినిమాతో. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం చైతు మరోసారి అలాంటి సబ్జెక్ట్ నే డీల్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. మజిలీ లాంటి సక్సెస్ ఫుల్ సినిమాను నిర్మించిన సాహు గారపాటినే, చైతు చేయబోయే ఈ సినిమాను కూడా గ్రాండ్ గా నిర్మించబోతున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. ఇంతకీ ఈ సినిమాకి […]

Written By:
  • admin
  • , Updated On : August 15, 2020 / 08:06 PM IST
    Follow us on


    నాగ చైతన్య కెరీర్ లోనే మజిలీ సినిమా ప్రత్యేకమైనది. మొత్తానికి చైతు మంచి మెచ్యూర్డ్ లవ్ స్టోరీ టచ్ చేశాడు ఈ సినిమాతో. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం చైతు మరోసారి అలాంటి సబ్జెక్ట్ నే డీల్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. మజిలీ లాంటి సక్సెస్ ఫుల్ సినిమాను నిర్మించిన సాహు గారపాటినే, చైతు చేయబోయే ఈ సినిమాను కూడా గ్రాండ్ గా నిర్మించబోతున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. ఇంతకీ ఈ సినిమాకి డైరెక్టర్ కూడా మంచి విషయం ఉన్న డైరెక్టర్ కావడం కూడా ఈ సినిమాకి బాగా కలిసోచ్చేలా ఉంది.

    Also Read: స్వర్ణ ప్యాలెస్‌ ప్రమాదంపై హీరో రామ్‌ సంచలన వ్యాఖ్యలు!

    అవును, సమ్మోహనం లాంటి రొమాటింక్ లవ్ స్టోరీని అందించిన ఇంద్రగంటి మోహన కృష్ణ, చైతుతో ఆలాంటి డీసెంట్ ఎమోషనల్ లవ్ స్టోరీని చేయబోతున్నాడు. అన్నట్టు ప్రస్తుతం ఇంద్రగంటి చేస్తోన్న ‘వి సినిమా తరువాత ఆయన అందిచబోయే సినిమా చైతుదే. ఇక ఈ సినిమా కథ కూడా పెళ్లి అయిన జంట నడుమ నెలకొనే భావోద్వేగాల మధ్యే నడుస్తోందట. అంటే వారి మధ్య ప్రేమాభిమానులు, అపార్థాలు, ఇలా అన్నీ కలిసిన కథ అన్నమాట. పైగా ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు కూడా వుంటారని.. వారిలో ఒకరు సమంతనే అనుకుంటున్నారని తెలుస్తోంది.

    Also Read: స్టార్ హీరో భార్యకి అవమానం !

    కాగా ప్రస్తుతానికి ప్రీ పొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా, కరోనా అనంతరం సెట్స్ పైకి వెళ్లనుంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా మొత్తం పూర్తయినట్లు తెలుస్తోంది. ఎలాగూ ‘వి’ సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయిపొయింది. ఇక విడుదల అయిపోయి, కరోనా కల్లోలం నుంచి ఇండస్ట్రీ కూడా బయటపడ్డాక.. ఇంద్రగంటి ఈ సినిమాని స్టార్ట్ చేస్తారట.

    Tags