Facebook: మోడీకి ఫేస్‘బుక్కైందా’? ఫేక్ కంటెంట్ ను కంట్రోల్ చేయడం లేదా..?

Facebook Modi : ఉదయం లేచినప్పటి నుంచి మళ్లీ నిద్రపోయే వరకూ నిత్యం మొబైల్ తోనే గడుపుతున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అంతా తమ చేతిలో ఫోన్ లేనిదే వారు ఏ పని చేయడానికి ఇష్టపడరు. ప్రపంచంలో ఉన్న సమాచారాన్నంతా ఇప్పుడు మొబైల్ అందరి కళ్ల ముందు ఉంచుతుంది. ఇందులో సోషల్ మీడియా ప్రధాన పాత్ర వహిస్తుంది. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ ద్వారా ఎటువంటి సమాచారం అయినా మనం ఉన్నచోటే పొందవచ్చు. అయితే […]

Written By: NARESH, Updated On : October 27, 2021 3:00 pm
Follow us on

Facebook Modi : ఉదయం లేచినప్పటి నుంచి మళ్లీ నిద్రపోయే వరకూ నిత్యం మొబైల్ తోనే గడుపుతున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అంతా తమ చేతిలో ఫోన్ లేనిదే వారు ఏ పని చేయడానికి ఇష్టపడరు. ప్రపంచంలో ఉన్న సమాచారాన్నంతా ఇప్పుడు మొబైల్ అందరి కళ్ల ముందు ఉంచుతుంది. ఇందులో సోషల్ మీడియా ప్రధాన పాత్ర వహిస్తుంది. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ ద్వారా ఎటువంటి సమాచారం అయినా మనం ఉన్నచోటే పొందవచ్చు. అయితే ఫేస్భుక్ లో ఉన్న సమాచారం నిజమెంత..? అబద్ధమెంత..? అని నిర్దారించుకునేలోపే జరిగే ఘోరాలన్నీ జరిగిపోతున్నాయి. ఒక సంఘటన జరిగినప్పుడు దాని గురించి ఫేస్ బుక్ లో పెట్టడం వల్ల బుల్లెట్ స్పీడ్ తో ప్రపంచమంతా వెళ్తుంది. అయితే అది అబద్ధం అని అనుకునే లోపే ఇతరుల భావాలను ప్రేరేపిస్తున్నాయి.

modi facebook

ఫేస్ బుక్ లో వచ్చిన సమాచారం నిజం కాదని పూర్తిగా కొట్టిపారేయలేం. అలాగని పూర్తిగా నమ్మడానికి వీల్లేదు. కానీ అందులో వచ్చిన పోస్టుపై స్పందించేముందు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తప్పుడు వార్తలు, విద్వేష ప్రసంగాలు, రెచ్చగొట్టే ప్రకటనలతో ఒక దేశ వ్యవస్థను చిన్నాభిన్నం చేసే అవకాశం లేకపోలేదని కొందరు అంటున్నారు. అమెరికా తరువాత ఫేస్ బుక్ కు ఉన్న అధిక నెట్ వర్క్ భారత్ లోనే. ఈ నేపథ్యంలో భారత్ లో ఏ చిన్న సంఘటన జరిగినా దానిని ఫేస్ బుక్ ద్వారా షేర్ చేసుకుంటున్నారు. దీంతో కొందరి భావాలు ఉద్వేగపూరితంగా మారుతున్నాయి.

ఇటీవల అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్ తదితర పత్రికలు ఇండియాలో ఫేస్ బుక్ వినియోగంపై కొన్ని కథనాలు రాశాయి. భారత్ లో 22 భాషల్లో ఫేస్ బుక్ ను ఉపయోగిస్తున్నారు. వివిధ భాషల్లో నిజమైన వార్తలు, తప్పుడు సమాచారాలు పోస్టు చేస్తున్నారు. అయితే ఫేస్ బుక్ ఫ్యాక్ట్ చెక్ కోసం 10 సంస్థలతో ఒప్పందాన్ని చేసుకుంది. వీరు ఇంగ్లీషు తో పాటు 11 భాషల్లో తప్పుడు సమాచారాలను గుర్తించి వాటిని నమ్మొద్దని నిర్దారిస్తారు. అయితే కొన్ని ఫ్యాక్ట్ సంస్థలు సరైన రీతిలో పనిచేయడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని సంస్థలు ఒక వర్గానికి వత్తాసు పలుకుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

అత్యధిక జనాభా కలిగిన ఇండియాలో ఫేస్ బుక్ వినియోగదారులూ ఎక్కువే. వీరు నిత్యం అన్ లైన్ లో ఉంటూ ఎప్పటికప్పుడు వార్తలను సమీక్షిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఏ చిన్న విద్వేషపూరిత వార్త వచ్చినా స్పందిస్తుంటారు. అయితే ఓ వర్గం, ఇంకో వర్గాన్ని లక్ష్యంగా ఫేక్ న్యూస్ పెట్టినా వారు నిర్దారించకుండానే భావోద్వేగానికి గురవుతారు. దీంతో జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఈ సమయంలో ఫ్యాక్ట్ న్యూస్ సంస్థలు ఆ వార్తను నిర్దారించేలోపే నష్టపోతున్నారు.

ఇక ఫేస్ బుక్ దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ పాలక వర్గానికి మద్దతు పలుకుతుందనే ఆరోపణలు లేకపోలేదు. ఎందుకంటే ఒకటికి రెండు సార్లు ఫేస్ బుక్ సీఈవో మన ప్రధాని మోడీని కలివారు. మోడీ(Modi) విషయంలో సీఈవో జుకర్ బర్గ్ పాజిటివ్ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో భేటి అయ్యి ఘాడమైన హగ్ కూడా చేసుకున్నారు. బీజేపీకి అనుకూలంగా ఫేస్ బుక్ పనిచేస్తోందని ప్రతిపక్ష నేత రాహుల్ సైతం గతంలో ఆరోపించారు. ప్రతిపక్షాల పోస్ట్ లనే డిలీట్ చేస్తున్నారని మండిపడ్డారు.

ఇక 2018లో జర్నలిస్టులు సిరిల్ సామ్, పరంజోయ్ గుహా ఠాకుర్తాలు ఈ విషయంపై విశ్లేషణ చేశారు. ‘ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, తన మిత్రుల సాయంతో ఫేస్ బుక్ పై ఆధిపత్యాన్ని సాధించింది’ అని తెలిపారు. అయతే ఒక విషయాన్ని చెప్పినప్పుడు దానిని నిర్దారించే సోషల్ నెట్ వర్క్ అల్గారిథమ్స్ పై ఎక్కువగా విమర్శలు చేస్తున్నారు. ఈ అల్గారిథమ్ వివిధ గ్రూపుల్లో చేర్చడానికి, కొత్త పేజీలను సెర్చ్ చేయడానికి ఉపయోగపడుతాయి. ఉపయోగపడని కంటెంట్, పాత కంటెంట్ ను ఈ అల్గారిథమ్ తీసుకొస్తుంది. దీని వల్ల రాను రాను మనుషుల మధ్య దూరం పెరిగి, ఏ అవసరానికైనా ఫేస్ బుక్ పై ఆధారపడాల్సి వస్తుంది. అయితే మానవ నవీకరణకు కంప్యూటర్లు సపోర్టు మాత్రమే కావాలని, మనుషులు కంపూటర్లపై ఆధారపడకూడదని ఫేస్ బుక్ మేనేజర్ ప్రాన్సిన్ హౌజెన్ చెప్పారు.

Also Read: బీజీపీ ‘కశ్మీర్’ వ్యూహం.. వచ్చే ఎన్నికల్లో గెలుపుకోసమేనా..?