AP Political Survey: ఏపీలో సర్వే సంస్థల సందడి నెలకొంది. ఇప్పటికే అధికార పార్టీ ఐ- ప్యాక్ ను నియమించుకుంది. ప్రతిపక్ష పార్టీ షోటైమ్ సంస్థను నియమించుకుంది. సొంత సర్వేలతో కార్యకర్తల్లో జోష్ నింపే ప్రయత్నం జరుగుతోంది. క్షేత్రస్థాయిలో ఎలా ఉన్నా ఫలితాలు తమకు అనుకూలంగా ఉండేలా సర్వేల నిర్వహణ జరుగుతోంది. ఇలాంటి తరుణంలో ఆత్మసాక్షి పేరిట ఓ స్వతంత్ర సంస్థ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో సంచలన ఫలితాలను పేర్కొంది. ఏపీలో ఎవరు ఎవరితో కలిస్తే గెలుస్తారో పూసగుచ్చినట్టు వెల్లడించింది.
ఇది సర్వేల యుగం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా రాజకీయ పార్టీలు సర్వే సంస్థలను ఆశ్రయిస్తున్నాయి. మున్సిపల్ ఎన్నిక నుంచి అసెంబ్లీ ఎన్నికల వరకు సర్వే సంస్థల పై పూర్తీగా ఆధారపడుతున్నాయి. ఇక అధికార పార్టీ అధినేతకు ఓ సర్వే సంస్థ ఎంత చెబితే అంత అన్న ప్రచారం ఉంది. అంతలా ఆయన ఆ సర్వే సంస్థల పై నమ్మకం పెట్టుకున్నారన్న మాట. అధికార పార్టీకి తామేమి తక్కువ కాదన్నట్టుగా ప్రతిపక్ష పార్టీ కూడా ఓ సర్వే సంస్థను ఏర్పాటు చేసుకుంది. క్షేత్రస్థాయిలో లోపాలను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తోంది. అధికార, ప్రతిపక్షాలు సర్వేల పై ఇంతగా ఆధారపడటానికి ప్రధాన కారణం.. రాజకీయ పార్టీలకు ప్రజల నాడి పై పట్టు లేకపోవడమే కారణమని చెప్పవచ్చు. గతంలో రాజకీయ నాయకులు ప్రజల నాడిని పసిగట్టగలిగేవారు. కానీ కాలక్రమేణా రాజకీయ పార్టీ ప్రజల నాడిని పసిగట్టగల నైపుణ్యాన్ని కోల్పోయాయని చెప్పవచ్చు. అందుకే సర్వే సంస్థలే సర్వం అన్నట్టు పరిస్థితి తయారైందని అనుకోవచ్చు.
తాజాగా ఏపీలో శ్రీ ఆత్మసాక్షి గ్రూపు నిర్వహించిన సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2024 ఎన్నికల్లో ఏ పార్టీలు కలిసి పోటీ చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో సర్వేలో స్పష్టంగా వెల్లడైంది. ఈ సర్వేలో నాలుగు వేర్వేరు కాంబినేషన్లతో ఎన్నికలకు వెళ్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో పేర్కొన్నారు. మొదటగా జనసేన, వైసీపీ, టీడీపీలు ఒంటరిగా పోటీ చేస్తే.. జనసేనకు 6-7 స్థానాలు, వైసీపీకి 63-72 స్థానాలు, టీడీపీకి 78-81 స్థానాలు రావొచ్చని సర్వేలో వెల్లడైంది. 27-30 సీట్లలో తీవ్రమైన పోటీ ఉంటుంది. ఇందులో టీడీపీ, జనసేన, వైసీపీ, బీజేపీ, లెఫ్ట్ పార్టీలతో సహా ఇతర పార్టీలన్నీ ఒంటరిగా పోటీ చేస్తే ఇలాంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది.
జనసే, టీడీపీ పొత్తులో భాగంగా కలిసి పోటీ చేస్తే జనసేన, టీడీపీకి కలిపి 110 -115 స్థానాలు, వైసీపీకి 65-68 స్థానాలు వచ్చే అవకాశం ఉంటుంది. 10-12 స్థానాల్లో తీవ్రమైన పోటీ ఉంటుంది. టీడీపీ, జనసేన ప్రభుత్వం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. అదే సమయంలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తే .. 68- 73 స్థానాలు, వైసీపికి 90-98 స్థానాలు వచ్చే అవకాశం ఉంటుంది. 4-8 స్థానాల్లో తీవ్రమైన పోటీ ఉంటుంది. వైసీపీ ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.
టీడీపీ, జనసేన, లెఫ్ట్ పార్టీలు కలిసి పోటీ చేస్తే 116-120 స్థానాలు, వైసీపీకి 60-62 స్థానాలు వస్తాయి. 3-4 సీట్లలో తీవ్రమైన పోటీ ఉంటుంది. టీడీపీ, జనసేన, లెఫ్ట్ పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. అదే సమయంలో టీడీపీ, జనసేన, లెఫ్ట్ పార్టీల పొత్తును 57 శాతం పైగా జనం సమర్థించినట్టు సర్వేలో వెల్లడైంది. కానీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే .. టీడీపీ,జనసేన ఓడిపోతాయని చెప్పకనే సర్వేలో చెప్పారు. టీడీపీ, జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకుంటే అంతిమంగా వైసీపీ గెలుస్తుందని సర్వేలో పేర్కొన్నారు.
మొత్తం నాలుగు రకాల కాంబినేషన్లతో సర్వే ఫలితాలు వెల్లడించగా.. అందులో అత్యధికంగా జనసేన, టీడీపీ పొత్తు కుదిరితే ప్రభావం , ఫలితం ఎలాగుంటుందో స్పష్టంగా పేర్కొన్నారని చెప్పవచ్చు. రెండు పార్టీల పొత్తుతో ఫలితం ఏకపక్షంగా ఉండబోతోందని సర్వే ఫలితం వెల్లడిస్తోంది. అదే సమయంలో లెఫ్ట్ పార్టీలతో కలిస్తే మెజార్టీ స్థానాల్లో గెలుపు ఖాయమని సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. అయితే.. టీడీపీ, జనసేనలు బీజేపీతో పొత్తు కోసం ఆరాటపడుతున్నాయి. కానీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే .. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఓటమి పాలవుతుందని సర్వేలో పేర్కొనడం గమనార్హం. బీజేపీ కూడా ఏపీలో ఒంటరిగా వెళ్లే ఆలోచనలో ఉంది. టీడీపీ, జనసేన మాత్రం ప్రతిపక్షాలు ఐక్యంగా వెళ్లాలని కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి సర్వే ఫలితం రావడం రాజకీయంగా కొత్త చర్చకు దారితీసిందని చెప్పవచ్చు.
SHAIK SADIQ is a senior content writer who writes articles on AP Politics, General. He has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Politics. He Contributes Politics and General News. He has more than 10 years experience in Journalism.
Read MoreWeb Title: Eyewitness survey these are the parties that will win in ap
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com