Wedding Tradition: వివాహం అనేది ప్రతి మనిషి జీవితంలో ఒక మధురమైన ఘట్టం. అందువల్లే దీనిని అత్యంత ఆడంబరమైన వేడుకగా జరుపుకుంటారు. ఇక ఇటీవల కాలంలో వివాహాల కోసం భారీగా ఖర్చు పెడుతున్నారు. తమ స్థాయికి తగ్గట్టుగా వివాహాన్ని జరుపుకుంటున్నారు. మనదేశంలో వివాహ క్రతువులు ప్రాంతాలకు తగ్గట్టుగా జరుగుతుంటాయి. కొన్ని ప్రాంతాలలో విచిత్రమైన విధానాలలో వివాహాలు జరుగుతుంటాయి. సోషల్ మీడియా వల్ల అటువంటి వివాహాలు ప్రస్తుతం వెలుగులోకి వస్తున్నాయి. అలాంటి వీడియోనే ఇది కూడా.
సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు కనిపిస్తుంటాయి. అటువంటిదే ఈ వీడియో కూడా. కాకపోతే ఇది చాలా విచిత్రంగా ఉంది. వాస్తవానికి ఇటువంటి విధానం అనేది ఒకటి ఉందని.. ఇలా కూడా వివాహం జరుగుతుందని ఈ వీడియో చూసేదాకా చాలామందికి తెలియదు. ఆ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాల ప్రకారం కొంతమంది మహిళలు ముసుగు ధరించి ఉన్నారు. ఓ వ్యక్తి సూటు బూటు ధరించి, చేతిలో తల్వార్ తో కనిపిస్తున్నాడు. మీసాలు కూడా రాజసానికి ప్రతీకగా కనిపిస్తున్నాయి. ఈలోగా అక్కడ మహిళలు పాటలు పాడుతున్నారు.. అంతలోనే ఆ యువకుడు మహిళ దగ్గరికి వెళ్ళాడు. ఆమె తన జాకెట్టు తీసి.. స్థనంలో ఉన్న పాలను తాగమని ఆదేశించింది. దీంతో అతడు తన నోట్లో ఆ మహిళ రెండు స్థనాలను పెట్టుకున్నాడు. అలా పాలు తాగాడు. ఆ తర్వాత ముందుకు కదిలాడు.
ఈ దృశ్యం చూసే వాళ్లకు విచిత్రంగా ఉండవచ్చు. కొంతమందికి అభ్యంతరకరంగా ఉండవచ్చు. కానీ ఇందులో లోతైన అర్థం ఉంది. చేసుకునే భార్యను తన పాల మీద ఒట్టు వేసి మరీ జాగ్రత్తగా చూసుకోవాలని తల్లి ఇచ్చే ఆదేశమని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వివాహ క్రతువు రాజస్థాన్ రాష్ట్రంలో జరుగుతుందని.. మహిళ స్థనాల నుంచి పాలు తాగే విధానాన్ని అక్కడ పవిత్ర కార్యంగా చూస్తారని నెటిజన్లు అంటున్నారు. దీనిని బూతుగా పరిగణించకూడదని హెచ్చరిస్తున్నారు. ఒక తల్లికి.. కుమారుడికి మధ్య ఉండే అవినాభావ సంబంధాన్ని ఇది వెల్లడిస్తుందని వారు వివరిస్తున్నారు.
మహిళ స్థనం నుంచి పాలు తాగిన తర్వాత పెళ్లికొడుకు వివాహ వేదిక వద్దకు వెళ్తాడు. ఆ తర్వాత అత్తింటి వారు అతడికి మిఠాయిలు తినిపిస్తారు. పూజారి అతనితో కొన్ని వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తాడు. అనంతరం పెళ్లి కుమార్తెను పరిచయం చేసి.. ఆమెతో వివాహం జరిపిస్తాడు. అనంతరం ఇరుపక్షాల వారు మిఠాయిలు తినిపించుకుంటారు. సంప్రదాయ వంటకాలు తయారుచేసి వివాహ వేడుకకు వచ్చిన బంధువులకు వడ్డిస్తారు.