Exit Polls 2022 LIVE Updates: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఎగ్జిట్ పోల్స్: యూపీలో గెలుపు ఎవరిదంటే? పంజాబ్ లో షాకింగ్!

Exit Polls 2022 LIVE Updates: అందరూ ఉత్కంఠగా ఎదురుచూసిన ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి. దీంతో ఎగ్జిట్ పోల్స్ అన్నీ పోటెత్తాయి. యూపీలో ఎవరిది అధికారం అయితే కేంద్రంలో వారిదే మరోసారి పీఠం. దీంతో ఉత్తరప్రదేశ్ లో గెలుపు ఎవరిదన్నది దేశం మొత్తం ఊపిరి బిగిబట్టి చూశారు. కానీ ఈ దేశంలోని అతిపెద్ద రాష్ట్రం మరోసారి బీజేపీ ఖాతాలోనే పడుతుందని ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఘోషిస్తున్నాయి. దేశంలోనే కీలకమైన పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో రెండోసారి […]

Written By: NARESH, Updated On : March 8, 2022 2:21 pm
Follow us on

Exit Polls 2022 LIVE Updates: అందరూ ఉత్కంఠగా ఎదురుచూసిన ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి. దీంతో ఎగ్జిట్ పోల్స్ అన్నీ పోటెత్తాయి. యూపీలో ఎవరిది అధికారం అయితే కేంద్రంలో వారిదే మరోసారి పీఠం. దీంతో ఉత్తరప్రదేశ్ లో గెలుపు ఎవరిదన్నది దేశం మొత్తం ఊపిరి బిగిబట్టి చూశారు. కానీ ఈ దేశంలోని అతిపెద్ద రాష్ట్రం మరోసారి బీజేపీ ఖాతాలోనే పడుతుందని ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఘోషిస్తున్నాయి. దేశంలోనే కీలకమైన పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో రెండోసారి బీజేపీనే అధికారం చేపడుతుందని మెజార్టీ సంస్థలు అంచనావేశాయి.

Exit Polls 2022 LIVE Updates

ఇక పంజాబ్ లో కాంగ్రెస్ అనూహ్యంగా ఓడిపోయి ఆ స్థానంలో ఆమ్ ఆద్మీ అధికారంలోకి వస్తుందని తేలింది. ఇక ఉత్తరాఖండ్ లో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ ఖాయం అని తేలింది. గోవాలోనూ కాంగ్రెస్, బీజేపీకి సమాన సీట్లు వస్తాయని సర్వేలు తేల్చాయి.

దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఉత్తరప్రదేశ్ లో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకు గాను ఏడు దశల్లో పోలింగ్ పూర్తయ్యింది. పంజాబ్ లో 117, ఉత్తరాఖండ్ లో 70, మణిపూర్ లో 60, గోవాలో 40 అసెంబ్లీ సీట్లకు పోలింగ్ ముగిసింది. మొత్తం 5 రాష్ట్రాల్లో 690 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఏడు విడతల్లో జరిగిన ఎన్నికలు నేటితో ముగిశాయి. ఫిబ్రవరి 10న మొదలైన అసెంబ్లీ ఎన్నికల సంగ్రామం మొత్తం ఏడు విడతల్లో కొనసాగింది.

Also Read: Scholarship: కేంద్రప్రభుత్వ స్కాలర్‌షిప్‌ పూర్తి వివరాలివే.. చివరి తేదీ ఎప్పుడంటే?

-ఎగ్జిట్ పోల్స్ అంచనాలు

-గోవా 40 సీట్లు
-జన్ కీ బాత్ ఇండియా: బీజేపీకి 13-19, కాంగ్రెస్ 10-14, తృణమూల్ 7-8, ఆప్ 5

-ఉత్తరాఖండ్ సీట్లు 70
-ఈటీజీ రీసెర్చ్ : బీజేపీకి 38, కాంగ్రెస్ 30, ఇతరులు 1
-మ్యాట్రిజ్ : బీజేపీకి 31, కాంగ్రెస్ 35, ఇతరులు 2
టైమ్స్ నౌ: బీజేపీకి 37, కాంగ్రెస్ 31, ఇతరులు ఒక్క స్తానంలో విజయం

-పంజాబ్ 117 సీట్లు
-మ్యాటిక్స్ : ఆప్ 62-70, కాంగ్రెస్ 23-31, ఎస్ఏడీ 18-21, ఇతరులు 3-7,
-ఆత్మసాక్షి: ఆప్ 34-38, కాంగ్రెస్ 58-61, ఎస్ఏడీ 18-21, ఇతరులు 3-7
-న్యూస్ ఎక్స్ -పోల్ స్టార్: బీజేపీకి 1-6, కాంగ్రెస్ 24-29, ఆప్ 56-61, ఇతరులు 6
-పీ మార్క్ : ఆప్ 60-84, కాంగ్రెస్ 18-31, ఎస్ఏడీ 12-19, ఇతరులు 1

-ఉత్తరప్రదేశ్ 403 సీట్లు
మ్యాటిక్స్ : బీజేపీకి 262-277, ఎస్పీ 119-134, బీఎస్పీ 7-15, కాంగ్రెస్ 3-8, ఇతరులు 2,
ఆత్మసాక్షి: బీజేపీ 138-140, ఎస్పీ 235-240, బీఎస్పీ 19-23, కాంగ్రెస్ 6
-న్యూస్ ఎక్స్ -పోల్ స్టార్: బీజేపీకి 211-222, ఎస్పీ కూటమి 140-160, బీఎస్పీ 12-22
-పీ మార్క్ : బీజేపీకి 225-250, ఎస్పీ కూటమి 130-155, బీఎస్పీ 12-22, కాంగ్రెస్ 2-6, ఇతరులు 2

Also Read: Telangana Budget 2022: తెలంగాణ బడ్జెట్ హైలెట్స్: దళితబంధుకు నిధులు భారీగా పెంపు..