https://oktelugu.com/

పరీక్షల నిర్వహణకు ఎందుకు మొండిపట్టు?

ఏపీలో పదో తరగతి పరీక్షల విషయంలో సీఎం జగన్ మొండిగా వ్యవహరిస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు వ్యతిరేకిస్తున్నా పరీక్షలు నిర్వహించేందుకే మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే పరీక్షలు మొదలు కావాల్సి ఉండగా కరోనా ప్రభావంతో నెల రోజులు వాయిదా పడ్డాయి. నెల రోజుల తరువాత కూడా కరోనా ముప్పు తొలగిపోతుందని గ్యారెంటీ లేదు. పరీక్షలు నిర్వహిస్తే మూల్యాంకనానికి ఇంకో 45 రోజులు పడుతుంది. సర్టిఫికెట్లు జారీ జారీచేసే సరికి మరికొన్ని రోజులు పట్టవచ్చు. సెప్టెంబర్-అక్టోబర్ వరకు కానీ విద్యార్థులు ఇంటర్మీడియట్లో […]

Written By: , Updated On : June 2, 2021 / 09:28 PM IST
Follow us on

ఏపీలో పదో తరగతి పరీక్షల విషయంలో సీఎం జగన్ మొండిగా వ్యవహరిస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు వ్యతిరేకిస్తున్నా పరీక్షలు నిర్వహించేందుకే మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే పరీక్షలు మొదలు కావాల్సి ఉండగా కరోనా ప్రభావంతో నెల రోజులు వాయిదా పడ్డాయి. నెల రోజుల తరువాత కూడా కరోనా ముప్పు తొలగిపోతుందని గ్యారెంటీ లేదు.

పరీక్షలు నిర్వహిస్తే మూల్యాంకనానికి ఇంకో 45 రోజులు పడుతుంది. సర్టిఫికెట్లు జారీ జారీచేసే సరికి మరికొన్ని రోజులు పట్టవచ్చు. సెప్టెంబర్-అక్టోబర్ వరకు కానీ విద్యార్థులు ఇంటర్మీడియట్లో చేరలేరు. తర్వాత నాలుగు నెలలకు మించి విద్యా సంవత్సరం ఉండదు అది ఇంటర్మీడియట్లో వారికి ఇబ్బందే. అవన్నీ పక్కన పెడితే ప్రస్తుత కరోనా ముప్పు నేపథ్యంలో పరీక్షలు నిర్వహించి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటాలు ఆడటం మంచిది కాదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

తెలంగాణ సహా 14 రాష్ర్టాలు పదో తరగతి పరీక్షలను రద్దు చేశాయి. కేంద్ర ప్రభుత్వం సైతం సీబీఎస్ఈ పదోతరగతి పరీక్షలు కూడా ఇప్పటికి రద్దు చేయగా తాజాగా 12వ తరగతి పరీక్షల విషయంలోనూ ఇదే నిర్ణయం తీసుకున్నారు.ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. పరీక్షల కంటే విద్యార్థుల ఆరోగ్యం, భద్రతే ముఖ్యమని ప్రధాని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

విద్యార్థులను పరీక్షరాసేందుకు బలవంతం చేయకూడదని ప్రధాని సూచించారు. ప్రధాని అలా ఆలోచించినపుడు ఏపీ సీఎం మాత్రం ఎందుకు మొండి పట్టు పడుతున్నారనే ప్రశ్న ఉదయిస్తోంది. సీబీఎస్ఈ తో పోలిస్తే రాష్ర్టాల పరిధిలో జరిగే పదో తరగతి పరీక్షలు అంత ముఖ్యం కాదని ప్రస్తుత అసాధారణ పరిస్థితుల్లో పరీక్షలు రద్దు తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని గుర్తించాలన్నారు.