https://oktelugu.com/

జగన్ కు విద్యార్థుల భవిష్యత్ ముఖ్యమా? ప్రాణాలా?

తాను పట్టిన కుందేలు మూడే కాళ్లు అని ఆయన అంటాడు. మడమ తిప్పని.. మాట తప్పని ఆ పెద్ద మనిషి ఇప్పుడు నిజంగానే ‘విద్యార్థులకు’ పరీక్షలు పెడుతున్నాడు. అది విద్యార్థులకే కాదు.. తల్లిదండ్రులకు పరీక్షగా మారుతోంది. ప్రాణాలు కాపాడుకోవడమే పెద్ద పనిగా మారిన ఈ సమయంలో ఏపీలో పదోతరగతి, ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి తీరుతానంటున్న ఏపీ సీఎం జగన్ తీరు చర్చనీయాంశమవుతోంది. కరోనా కల్లోలం చోటుచేసుకుంటోంది. ఏపీలో రోజుకు 10వేల పైన కేసులు నమోదవుతున్నాయి. ఆ […]

Written By:
  • NARESH
  • , Updated On : April 28, 2021 / 03:56 PM IST
    Follow us on

    తాను పట్టిన కుందేలు మూడే కాళ్లు అని ఆయన అంటాడు. మడమ తిప్పని.. మాట తప్పని ఆ పెద్ద మనిషి ఇప్పుడు నిజంగానే ‘విద్యార్థులకు’ పరీక్షలు పెడుతున్నాడు. అది విద్యార్థులకే కాదు.. తల్లిదండ్రులకు పరీక్షగా మారుతోంది. ప్రాణాలు కాపాడుకోవడమే పెద్ద పనిగా మారిన ఈ సమయంలో ఏపీలో పదోతరగతి, ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి తీరుతానంటున్న ఏపీ సీఎం జగన్ తీరు చర్చనీయాంశమవుతోంది.

    కరోనా కల్లోలం చోటుచేసుకుంటోంది. ఏపీలో రోజుకు 10వేల పైన కేసులు నమోదవుతున్నాయి. ఆ సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మరణాలు ఎక్కువ అవుతున్నాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో రాష్ట్రాలన్నీ లాక్ డౌన్ దిశగా ఆలోచిస్తుంటే ఏపీ సీఎం జగన్ మాత్రం రాష్ట్రంలో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడానికి పూనుకోవడం విమర్శలకు తావిస్తోంది.

    ఇప్పుడు అందరికీ కావాల్సింది ప్రాణాలే. ఎన్ని కోట్లు వెచ్చించినా మందులు, చికిత్స లేని కరోనా ముందు సెలబ్రెటీల నుంచి సామాన్యుల దాకా నిలువలేకపోతున్నారు. ప్రాణాలు కోపాడుకోవడమే ఇప్పుడు ప్రజలకు పెద్ద టాస్క్ అయిపోయింది. ఇలాంటి చావుబతుకుల మధ్య జగన్ విద్యార్థుల భవిష్యత్ కోసం పరీక్షలు నిర్వహిస్తానని అనడం ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

    రాష్ట్రంలో పది, ఇంటర్ పరీక్షలను నిర్వహించి తీరుతానని జగన్ మొండి పట్టు పట్టుకొని కూర్చున్నాడు. ప్రతిపక్ష నేత చంద్రబాబు సహా కొందరు మేధావులు ఇలాంటి వేళ విద్యార్తుల ప్రాణాలతో చెలగాటం వద్దని అన్ని రాష్ట్రాలలాగా పాస్ చేయాలని కోరుతున్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు సైతం తాము సహకరిస్తామని.. పరీక్షలు వద్దని కోరారు.

    అయితే కూడా జగన్ వెనక్కి తగ్గడం లేదు. పది, ఇంటర్ పరీక్షలు నిర్వహించి తీరుతానని మంకు పట్టు పట్టారు. విద్యార్థుల భవిష్యత్ సర్టిఫికెట్లపైనే ఆధారపడి ఉంటుందని.. పరీక్షల నిర్వహణకు అన్ని రాష్ట్రాల్లో ఒకే విధానం లేదని జగన్ అన్నారు. పరీక్షలపై రాష్ట్రాలకే అధికారాన్ని కేంద్రం ఇచ్చిందని జగన్ కుండబద్దలు కొట్టారు.

    అయితే జగన్ వాదన మరోలా ఉంది. ‘పరీక్షలు నిర్వహించకపోతే సర్టిఫికెట్లలో పాస్ అనే ఉంటుంది. మార్కులు ఉండవు. పాస్ సర్టిఫికెట్లతో విద్యార్థులకు మంచి సంస్థల్లో సీట్లు వస్తాయా? విద్యార్థులకు ఉన్న భవిష్యత్ ఉండాలనే పరీక్షలు నిర్వహిస్తున్నాం. పరీక్షలు రద్దు చేయాలని చెప్పడం సరికాదని అన్నారు.

    అయితే ఇంతటి కరోనా కల్లోలం వేళ పరీక్షలు నిర్వహించడం కరెక్ట్ కాదనే వాదనే వినిపిస్తోంది. ఓవైపు ప్రాణాలు పోతుంటే పరీక్షలు ఎందుకని.. ముందు బతికి ఉండాలి కదా అని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.