Celebrities: హీరో హీరోయిన్లు ఎంత సులభంగా ప్రేమలో పడతారో.. అంతే సులభంగా ఆ ప్రేమను మర్చిపోతారు. అసలు సినిమా ఇండస్ట్రీలోని ప్రేమలు పెళ్లిళ్లు దాకా వెళ్లవు అంటారు. ఒకవేళ వెళ్లినా పెళ్లి పీటల దగ్గర్లోనే ఆగిపోతాయి అంటారు. ఒక్కోసారి పెళ్లి అయినా.. కాలం గడిచే కొద్దీ ఆ బంధం తెగిపోతుంది అంటారు. ఆ అనేది కూడా సినిమా వాళ్లే.

ఏది అయితే ఏమి.. చాలా మంది హీరోయిన్లు తమ ప్రేమను పెళ్లిళ్లుగా మార్చుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. ముందు ప్రేమించుకుని తర్వాత కుటుంబ సభ్యులను ఒప్పించి, నిశ్చితార్థం కూడా చేసుకుని ఆ తర్వాత తీరిగ్గా విడిపోతున్నారు. మరి పెళ్లి పీటల వరకు వచ్చి విడిపోయిన నటీనటులు ఎవరో చూద్దాం.
ఉదయ్ కిరణ్, సుష్మిత:

హీరోగా సడెన్ గా స్టార్ డమ్ తెచ్చుకున్నాడు ఉదయ్ కిరణ్. మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుష్మితను ఉదయ్ ప్రేమించాడు. వీరిద్దరికి 2003లో పెద్దల సమక్షంలో నిశ్చితార్థం కూడా ఘనంగా జరిగింది. అయితే, పెళ్లి అయిపోతుంది అనుకున్న తరుణంలో కొన్ని కారణాల కారణంగా ఎంగేజ్ మెంట్ అయ్యాక ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత సుష్మిత, విష్ణు ప్రసాద్ ని పెళ్లి చేసుకున్నారు.
రష్మిక – రక్షిత్ శెట్టి

క్రేజీ బ్యూటీ రష్మికకి కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. పెళ్లితో ఒక్కటి అవుతారు అనుకునే సమయంలో అనూహ్యంగా వీళ్ళు విడిపోయారు. పెళ్లి క్యాన్సిల్ అయింది.
మెహ్రీన్ – భవ్య భిష్ణోయ్:

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదగలేక పోయిన మెహ్రీన్, భవ్య భిష్ణోయ్ తో ప్రేమలో పడింది. అతను కూడా ఆమెను ప్రేమించాడు. ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. కానీ తర్వాత ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలు వచ్చాయి. దాంతో వీరి వివాహం కూడా క్యాన్సిల్ అయ్యింది.
అఖిల్ – శ్రీయ భూపాల్:

అక్కినేని అఖిల్ కూడా శ్రీయ భూపాల్ ను ప్రేమించాడు. వీళ్ళ ఎంగేజ్మెంట్ 2016 లో పెద్దల సమక్షంలో ఘనంగా జరిగింది. కానీ వీరి వివాహం కూడా మధ్యలో ఆగిపోయింది.
తరుణ్ – ఆర్తి అగర్వాల్:

తరుణ్, ఆర్తి అగర్వాల్ హీరోహీరోయిన్లుగా మంచి ఫామ్ లో ఉన్న సమయంలోనే ఇద్దరూ ప్రేమించుకున్నారు. ప్రేమ పక్షుల్లా కలిసి తిరిగి పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ ఆ ప్రేమ మధ్యలోనే కరిగిపోయింది.
త్రిష – వరుణ్:

సీనియర్ హీరోయిన్ త్రిష, వ్యాపార వేత్త వరుణ్ మానియన్ ను ప్రేమించింది. ఇద్దరూ ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయింది. పెళ్లి చేసుకోకుండానే ఇద్దరు విడిపోయారు.
నయనతార – ప్రభుదేవా:

ప్రభుదేవాకి ఇది వరకే పెళ్లి అయినా నయనతారను ఘాడంగా ప్రేమించాడు. నయన్ కూడా అతన్ని పెళ్లి చేసుకోవడానికి మతం మార్చుకోవాలనుకుంది. ఈ ముదురు ప్రేమ పెళ్లి దాకా వెళ్లలేదు.
శింబు, హన్సిక :

హన్సిక, శింబుతో ప్రేమలో పడింది. పెళ్లి చేసుకొని నటనకు గుడ్ బై చెప్పాలనుకుంది కూడా. కానీ మధ్యలోనే విడిపోయింది.
అక్షయ్ కుమార్, శిల్పాశెట్టి :

అక్షయ్ కుమార్, శిల్పా శెట్టి ఎంతో గాఢంగా ప్రేమించుకున్నారు. కానీ ఆ తర్వాత అక్షయ్ కుమార్ ట్వింకిల్ ఖన్నాని వివాహం చేసుకున్నాడు. ఆ బాధలో శిల్పా శెట్టి రాజ్ కుంద్రకు దగ్గర అయింది.