https://oktelugu.com/

సరిహద్దులు దాటిన కవిత సహాయం!

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభన నేపథ్యంలో అనేక దేశాలు లాక్‌ డౌన్‌ ని అమలుపరుస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణకి చెందిన ఆరుగురు విద్యార్థులు లండన్‌ లో చిక్కుకుపోయారు. వారు స్వదేశానికి రాలేక అక్కడే ఉంటూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ విద్యార్థులకు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత బాసటగా నిలిచారు. నిజామాబాద్, కరీంనగర్, వరంగల్‌ జిల్లాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు ఈ ఏడాది జనవరిలో మాంచెస్టర్‌ లోని యూనివర్సిటీ ఆఫ్‌ సెంట్రల్‌ లాంక్‌షైర్‌ లో ఎంబీఏ కోర్సులో […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 25, 2020 / 10:17 AM IST
    Follow us on

    ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభన నేపథ్యంలో అనేక దేశాలు లాక్‌ డౌన్‌ ని అమలుపరుస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణకి చెందిన ఆరుగురు విద్యార్థులు లండన్‌ లో చిక్కుకుపోయారు. వారు స్వదేశానికి రాలేక అక్కడే ఉంటూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ విద్యార్థులకు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత బాసటగా నిలిచారు.

    నిజామాబాద్, కరీంనగర్, వరంగల్‌ జిల్లాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు ఈ ఏడాది జనవరిలో మాంచెస్టర్‌ లోని యూనివర్సిటీ ఆఫ్‌ సెంట్రల్‌ లాంక్‌షైర్‌ లో ఎంబీఏ కోర్సులో చేరారు. లాక్‌ డౌన్‌ తో విమానాలు రద్దు కావడంతో వారు అక్కడే చిక్కుకుపోగా, అక్కడి ప్రభుత్వపరంగా కూడా వారికి ఎలాంటి సాయమూ అందలేదు. దీంతో వారు తమ పరిస్థితిని వివరిస్తూ సాయం చేయాలని ట్విట్టర్‌ ద్వారా మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల ఇబ్బందులను తెలుసుకున్న కవిత.. వారిని ఆదుకోవాలని తెలంగాణ జాగృతి యూకే అధ్యక్షుడు సుమన్‌ బల్మూరిని కోరారు. ఆ విద్యార్థులను సంప్రదించిన సుమన్‌.. వారికి 3 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేశారు. బ్రిటన్‌ లో పరిస్థితులు చక్కబడేవరకూ వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.