దుర్గగుడి ఆ మూడు సింహాలు ఆయన ఇంట్లోనే ఉంటాయి: మాజీ మంత్రి సంచలనం

ఏపీ రాజకీయాలన్నీ ఇప్పుడు ఆలయాల చుట్టూనే తిరుగుతున్నాయి. రోజుకు ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఘటన వెలుగులోకి వస్తూనే ఉంది. అంతర్వేది రథం దగ్ధం, విగ్రహాల ధ్వంసం, విజయవాడ దుర్గమ్మ రథంలో మూడు వెండి విగ్రహాలు మాయం కావడంపై దుమారం రేగుతోంది. వైఎస్సార్‌సీపీ–-టీడీపీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. టీడీపీ అధినేత కూడా సందర్భంగా దొరికినప్పుడల్లా ఈ విషయం మీద ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. Also Read: నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన జగన్ […]

Written By: NARESH, Updated On : September 17, 2020 3:23 pm
Follow us on


ఏపీ రాజకీయాలన్నీ ఇప్పుడు ఆలయాల చుట్టూనే తిరుగుతున్నాయి. రోజుకు ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఘటన వెలుగులోకి వస్తూనే ఉంది. అంతర్వేది రథం దగ్ధం, విగ్రహాల ధ్వంసం, విజయవాడ దుర్గమ్మ రథంలో మూడు వెండి విగ్రహాలు మాయం కావడంపై దుమారం రేగుతోంది. వైఎస్సార్‌సీపీ–-టీడీపీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. టీడీపీ అధినేత కూడా సందర్భంగా దొరికినప్పుడల్లా ఈ విషయం మీద ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉన్నారు.

Also Read: నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన జగన్ సర్కార్….?

ముఖ్యంగా బెజవాడ ఆలయం ఘటనపై టీడీపీతోపాటూ పార్టీలన్నీ మండిపడుతున్నాయి. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఈ సింహాల వ్యవహారంపై తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆలయంలోని వెండి రథంలో మూడు సింహాల విగ్రహాలు మాయమవ్వడం బాధాకరమని అయ్యన్న పాత్రుడు అభిప్రాయపడ్డారు. చోరీ జరిగిన విషయం స్పష్టంగా కనిపిస్తుంటే కొంతమంది మూర్ఖులు అసలు ఉన్నాయో లేవో అని, లాకర్ లో ఉన్నాయని, స్టోర్ రూంలో ఉన్నాయని, వెతుకుతున్నాం అని ప్రకటనలు చేస్తున్నారన్నారు. వెతకాల్సింది లాకర్ లోనో, స్టోర్ రూం లోనో కాదు దుర్గమ్మ గుడికి కూతవేటు దూరంలో ఉన్న దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇంట్లో అంటూ ఘాటుగా ట్వీట్‌ చేశారు.

నిత్యం దేవాలయాలపై దాడులు జరగడం ఆందోళన కలిగిస్తున్నాయని ఎమ్మెల్సీ వెంకన్న అంటున్నారు. దుర్గమ్మ ఆలయంలోని వెండి రథంలో మూడు సింహాల విగ్రహాలు మాయమైతే దేవాదాయ శాఖ మంత్రి నిర్లక్ష్యంగా మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. లాకర్‌‌లో, స్టోర్ రూంలో ఉన్నాయని అధికారులు చెబుతుండడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. కనీసం పోలీసులకు ఫిర్యాదు కూడా ఇవ్వలేదంటే అనుమానాలు బలపడుతున్నాయని.. స్టోర్ రూం, లాకర్లు కాకుండా దేవాదాయ శాఖ మంత్రి ఇంట్లో వెతకాలంటూ సూచించారు. వెతికితే పోయిన విగ్రహాలు ఖచ్చితంగా దొరుకుతాయన్నారు.

Also Read: శ్రీవారి నిధులను ఏపీ సర్కార్ వాడుకోనుందా?

ఈ ఆరోపణలకు మంత్రి ఎలా కౌంటర్ ఇస్తారో చూడాలి ఇక. ఇప్పటికే అంతర్వేది ఘటనపై సీబీఐ ఎంక్వైరీ కోరిన జగన్‌.. దుర్గమ్మ ఆలయంలో మాయమైన మూడు సింహాల విగ్రహాలపై ఎలా స్పందిస్తారు. వీటన్నింటి నుంచి జగన్‌ ప్రభుత్వం ఎలా బయటపడుతుంది.