https://oktelugu.com/

దేవదాసిగా మారనున్న అనసూయ?

డైరెక్టర్ కృష్ణవంశీ తాజా చిత్రం ‘రంగ మార్తండ’. చాలా గ్యాప్ తర్వాత కృష్ణవంశీ ఈ మూవీని తెరక్కెక్కిస్తున్నాడు. బిగ్ బాస్-3 సీజన్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ హీరోగా నటిస్తుండగా.. రాజశేఖర్-జీవిత దంపతుల కూతురు శివాత్మిక హీరోయిన్ గా నటిస్తోంది. మరాఠిలో ఘన విజయం సాధించిన ‘నటసామ్రాట్’ మూవీని కృష్ణవంశీ తెలుగులో ‘రంగ మార్తండ’గా తీసుకురాబోతున్నాడు. అయితే ఈ మూవీలో స్టార్ యాంకర్ అనసూయ ఓ స్పెషల్ చేస్తుందనే టాక్ ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. Also Read: […]

Written By:
  • NARESH
  • , Updated On : September 17, 2020 / 02:29 PM IST
    Follow us on

    డైరెక్టర్ కృష్ణవంశీ తాజా చిత్రం ‘రంగ మార్తండ’. చాలా గ్యాప్ తర్వాత కృష్ణవంశీ ఈ మూవీని తెరక్కెక్కిస్తున్నాడు. బిగ్ బాస్-3 సీజన్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ హీరోగా నటిస్తుండగా.. రాజశేఖర్-జీవిత దంపతుల కూతురు శివాత్మిక హీరోయిన్ గా నటిస్తోంది. మరాఠిలో ఘన విజయం సాధించిన ‘నటసామ్రాట్’ మూవీని కృష్ణవంశీ తెలుగులో ‘రంగ మార్తండ’గా తీసుకురాబోతున్నాడు. అయితే ఈ మూవీలో స్టార్ యాంకర్ అనసూయ ఓ స్పెషల్ చేస్తుందనే టాక్ ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది.

    Also Read: దెబ్బకు చేతులెత్తి దండం పెట్టిన బండ్ల గణేష్

    శరవేగంగా షూటింగు జరుపుకున్న ‘రంగ మార్తండ’ కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ మూవీలో కృష్ణవంశీ భార్య రమ్యకృష్ణ, విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్, బ్రహ్మనందంలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వీరితోపాటు జబర్దస్త్ యాంకర్ అనసూయ ఓ స్పెషల్ రోల్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బుల్లితెరపై తన గ్లామర్ తో ఆకట్టుకుంటున్న అనసూయ సినిమాల్లో మాత్రం సెలక్టివ్ రోల్స్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది.

    అనసూయ ఇటీవల సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘రంగస్థలం’ మూవీలో నటించింది. ఈ మూవీలో రాంచరణ్ అత్తగా నటించి మెప్పించింది. రంగమ్మత్తగా ఆమె చూపిన అభినయానికి ప్రేక్షకులంతా ఫిదా అయ్యారు. ఈ మూవీ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ గా నిలువడంతో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. కాగా అనసూయ మాత్రం సెలక్టివ్ రోల్స్ చేస్తూ ముందుకెళుతోంది. ‘క్షణం’ మూవీలోనూ అందరికీ గుర్తిండిపోయే పాత్రలో అనసూయ నటించింది.

    Also Read: సీరియల్ రేటింగ్ కూడా బిగ్ బాస్ కు రావట్లేదా?

    తాజాగా కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న ‘రంగ మార్తండ’లో అనసూయ దేవదాసిగా నటిస్తుందట. దేవుడి ఉత్సవాల్లో నాట్యం చేస్తూ జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉండే దేవదాసిగా కన్పించనుందని సమాచారం. అనసూయ కోసం కృష్ణవంశీ ఓ ప్రత్యేకపాటను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఆమె పాత్రకు సినిమాకు హైలట్ గా నిలుస్తుందనే టాక్ విన్పిస్తోంది. కృష్ణ వంశీ స్పెషల్ సాంగ్స్ ఏ రేంజులో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీంతో అనసూయను దర్శకుడు కృష్ణవంశీ ఎలా చూపిస్తారో అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.