Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికల పోలింగ్ లో విషాదం అలుముకుంది. ఆదిలాబాద్ పట్టణంలో ఓటు వేయడానికి వచ్చిన ఇద్దరు వృద్ధులు మృతి చెందారు. నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులు, వికలాంగుల కోసం ఎన్నికల కమిషన్ ఇంటి వద్ద ఓటింగ్ నకు అవకాశం ఇచ్చింది. కానీ అవగాహన లేక చాలామంది వినియోగించుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో ఇద్దరు వృద్ధులు మృతి చెందడం బాధాకరం.
ఆదిలాబాద్ పట్టణంలో ఓటు వేయడానికి వచ్చిన ఇద్దరు వృద్ధులు అస్వస్థతకు గురయ్యారు. కొద్దిసేపటికి మృతి చెందారు. మా వాళ్లకు చెందిన తోకల గంగమ్మ ఓటు వేయడానికి వచ్చారు. క్యూ లైన్ లో ఉండగా ఒక్కసారిగా ఫిట్స్ రావడంతో కుప్పకూలిపోయారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. అలాగే భుక్తాపూర్ కు చెందిన రాజన్న ఓటు వేయడానికి వచ్చి వరుసలో నిలబడ్డాడు. ఎంత లోనే కళ్ళు తిరిగి పడిపోవడంతో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాజన్న మృతి చెందాడు. పోలింగ్ లో ఇద్దరు వృద్ధులు మృతి చెందడంతో స్థానికంగా విషాదం నెలకొంది. పోలింగ్ పై ప్రభావం చూపింది.
వయోవృద్ధులు, వికలాంగులు ఇంటి వద్ద నుంచే ఓటు వేసుకునే అవకాశాన్ని ఎలక్షన్ కమిషన్ కల్పించింది. ప్రతి పోలింగ్ కేంద్రంలో వారం ముందుగానే డి 12 ఫారాలను అందుబాటులోకి తెచ్చింది. వారు ముందుగానే దరఖాస్తు సమర్పించుకుంటే బిఎల్ఓ ఓటు వేసుకునేందుకు ఎన్నికల అధికారికి సిఫార్సు చేస్తారు. గతంలో ఇటువంటి వారికి ఆయా రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు బండ్లు, బైకులతోపాటు భుజాన వేసుకుని వచ్చేవారు. అటువంటి వారికి ఎలక్షన్ కమిషన్ ఇంటి వద్ద నుంచే ఓటు వేసుకునే అవకాశం కల్పించింది. నేరుగా పోస్టల్ బ్యాలెట్ రూపంలో ఓటు హక్కు నమోదు చేసుకుని. ఎన్నికల అధికారికి సమర్పించవచ్చు. కానీ దీనిపై అవగాహన లేని చాలామంది నేరుగా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేయడానికి ఇబ్బందులు పడ్డారు.