https://oktelugu.com/

ఎస్‌ఈసీ అధికారాలను వినియోగించినా..! : నామినేషన్లకు తప్పని అడ్డంకులు

రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయంటే.. సర్వాధికారాలు ఎన్నికల కమిషన్‌కే ఉంటాయి. ప్రభుత్వం కూడా సైడ్‌ అయిపోవాల్సిందే. ఇప్పుడు ఏపీలోనూ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే అక్కడి ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌‌ తన సర్వాధికారాలను ఉపయోగిస్తున్నారు. ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు. ఎన్నికల ప్రారంభంలోనే పలువురు అధికారులను ఇష్టారాజ్యంగా బదిలీ చేశారన్న ఆరోపణలు సైతం ఎదుర్కొన్నారు. Also Read: ఆ సహనం వెనుక మతలబేంటి..? : డ్యామేజీ తప్ప ఇమేజీ వస్తుందా..! ఈ నేపథ్యంలో అధికారాలను సమర్థంగా వినియోగించుకుంటూ […]

Written By:
  • Srinivas
  • , Updated On : February 13, 2021 / 01:39 PM IST
    Follow us on


    రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయంటే.. సర్వాధికారాలు ఎన్నికల కమిషన్‌కే ఉంటాయి. ప్రభుత్వం కూడా సైడ్‌ అయిపోవాల్సిందే. ఇప్పుడు ఏపీలోనూ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే అక్కడి ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌‌ తన సర్వాధికారాలను ఉపయోగిస్తున్నారు. ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు. ఎన్నికల ప్రారంభంలోనే పలువురు అధికారులను ఇష్టారాజ్యంగా బదిలీ చేశారన్న ఆరోపణలు సైతం ఎదుర్కొన్నారు.

    Also Read: ఆ సహనం వెనుక మతలబేంటి..? : డ్యామేజీ తప్ప ఇమేజీ వస్తుందా..!

    ఈ నేపథ్యంలో అధికారాలను సమర్థంగా వినియోగించుకుంటూ ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాలని రాష్ట్ర హైకోర్టు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌కు సూచించింది. ఇందులో భాగంగా ఆయన పుంగనూరు, మాచర్లలో ప్రత్యర్థులను అసలు నామినేషన్లు వేయనివ్వకపోవడం.. వేసిన వారి నామినేషన్లు తిరస్కరించడం వంటివి చేశారు. దీనిపై పలు పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. వాటిపై విచారణ జరిపిన హైకోర్టు ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. అయితే.. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న వారిని మంత్రులు బహిరంగంగానే హెచ్చరించారు. బ్లాక్ మెయిల్ చేశారు. ఎవరైనా ఎన్నికల కమిషన్‌కు సహకరిస్తే.. కోడ్ ఎత్తేసిన తర్వాత బ్లాక్ లిస్టే అని నిర్మోహమాటంగా హెచ్చరించారు.

    ఈ క్రమంలో అధికారులు కూడా ఎస్‌ఈసీ చెప్పినట్లుగా సిన్సియర్‌గా డ్యూటీలు చేసే పరిస్థితులు లేవు. ఆ విషయం సులువుగానే అర్థం చేసుకోవచ్చు. ఎస్‌ఈసీ ఆదేశాలను ప్రభుత్వ యంత్రాంగం పాటిస్తున్న సూచనలు కూడా లేవు. ఎస్‌ఈసీ ఆదేశాలు ఇచ్చిన తర్వాత ప్రభుత్వానికి అభ్యంతరం లేదు అన్న సిగ్నల్స్ వచ్చిన తర్వాత మాత్రమే అమలు చేస్తున్నారు. లేకపోతే లేదు. ఇలాంటి పరిస్థితులు ఉండడంతో అసలు నియోజకవర్గాల్లో నామినేషన్లు కూడా వేయలేని పరిస్థితి ఏర్పడింది.

    Also Read: పంచాయతీ ఎన్నికల్లో పార్టీల బలనిరూపణ

    మాచర్ల, పుంగనూరు నియోజకవర్గాల్లో గ్రామాల్లో పోటీ చేయాలనుకుంటున్న ప్రత్యర్థులు.. ఎంత దారుణమైన ఒత్తిళ్లను ఎదుర్కొన్నారో.. బెదిరింపులకు గురయ్యారో అది అక్కడి వారికి మాత్రమే తెలుసు. బయటకు కూడా చెప్పుకోలేనంత పరిస్థితి నెలకొంది. ఒకవిధంగా చెప్పాలంటే ప్రాణాలకు కూడా గ్యారంటీ లేని దుస్థితి. ఇంత భయంకరమైన పరిస్థితులు ఏర్పడినా.. పోలీసు ఉన్నతాధికారులు నోరు మెదపలేరు. చివరికి హైకోర్టు ఆదేశించినా ఎవరూ మాట వినే పరిస్థితి లేదు. ఎస్‌ఈసీ తన అధికారాలను ఉపయోగించుకోవాలని హైకోర్టు చెబుతోంది కానీ.. ఇప్పటికైతే ఏపీలో ఆ పరిస్థితి లేదనేది కళ్ల ముందు కనిపిస్తున్న సత్యం.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్