పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి శుభవార్త.. రూ.7 లక్షల ఇన్సూరెన్స్..?

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి శుభవార్త చెప్పింది. పీఎఫ్ అకౌంట్ ఉన్నవాళ్లు ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్ స్కీమ్ కు అర్హులని వెల్లడించింది. పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి ఈడీఎల్ఐ స్కీమ్ ఇన్సూరెన్స్ స్కీమ్ గా ఉపయోగపడుతుంది. ఈపీఎఫ్ఓ ఖాతాదారులందరికీ బీమా ప్రయోజనాలను అందించాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ ను అమలు చేస్తుండటం గమనార్హం. Also Read: కిడ్నీ అమ్ముతా కొంటారా.. ఫేస్ బుక్ లో ఆర్టీసీ ఉద్యోగి పోస్ట్..? ఈపీఎఫ్ఓ అధికారులు ఎంప్లాయీస్ […]

Written By: Navya, Updated On : February 13, 2021 1:48 pm
Follow us on

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి శుభవార్త చెప్పింది. పీఎఫ్ అకౌంట్ ఉన్నవాళ్లు ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్ స్కీమ్ కు అర్హులని వెల్లడించింది. పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి ఈడీఎల్ఐ స్కీమ్ ఇన్సూరెన్స్ స్కీమ్ గా ఉపయోగపడుతుంది. ఈపీఎఫ్ఓ ఖాతాదారులందరికీ బీమా ప్రయోజనాలను అందించాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ ను అమలు చేస్తుండటం గమనార్హం.

Also Read: కిడ్నీ అమ్ముతా కొంటారా.. ఫేస్ బుక్ లో ఆర్టీసీ ఉద్యోగి పోస్ట్..?

ఈపీఎఫ్ఓ అధికారులు ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్ స్కీమ్ లో కొన్ని రోజుల క్రితం కీలక సవరణలు చేసి ఈపీఎఫ్ ఖాతాదారులలో ఎక్కువ మందికి ప్రయోజనం చేకూరేలా చేస్తోంది. ఈపీఎఫ్ఓ తాజాగా చేసిన సవరణలలో ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్ చనిపోవడానికి ముందు ఒకటి కంటే ఎక్కువ సంస్థలలో విధులు నిర్వహించి చనిపోయి ఉంటే వారి కుటుంబ సభ్యులకు కూడా బీమా ప్రయోజనాలను కల్పించడానికి సిద్ధమవుతోంది.

Also Read: రూ.లక్షకు నాలుగు లక్షలు పొందే ఛాన్స్.. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే..?

ఈపీఎఫ్ ఖాతాదారులు సర్వీస్ లో ఉన్న సమయంలో చనిపోతే నామినీ బీమా ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. కనిష్టంగా 2.5 లక్షల రూపాయల నుంచి గరిష్టంగా 7 లక్షల రూపాయల వరకు ఉచిత బీమాకు పీఎఫ్ ఖాతా ఉన్నవాళ్లు అర్హులు. బేసిక్ శాలరీ 15,000 రూపాయల లోపు ఉన్నవారు ఈడీఎల్ఐ స్కీమ్‌లో చేరి బీమా ప్రయోజనాలను సులభంగా పొందే అవకాశం ఉంటుంది.

మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

ఎంప్లాయర్ మొత్తం వేతనం పొందితే మాత్రం బేసిక్ సాలరీలో 0.5% లేదా గరిష్టంగా రూ.75 చెల్లించాల్సి ఉంటుంది. చనిపోయిన వ్యక్తి డెత్ సర్టిఫికెట్, ఫామ్ 5 ఐఎఫ్, నామినీ అకౌంట్‌ క్యాన్సల్ చెక్ ఇచ్చి ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్ చనిపోతే నామినీ బీమాను క్లెయిమ్ చేసుకోవచ్చు.