‘ఉప్పెన‌’ కోసం ఇంత రిస్కా..? ముందే తెలిస్తే వ‌ద్ద‌నేవాణ్నిః నాగ‌బాబు

మెగా మేనల్లుడు, సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ హీరోగా పరిచయమైన‌ మూవీ ‘ఉప్పెన’. ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం.. స‌క్సెస్ ఫుల్ గా ర‌న్ అవుతోంది. హీరో, హీరోయిన్ల పెర్ఫార్మెన్స్ తోపాటు ద‌ర్శ‌కుడి టేకింగ్ గురించి కూడా ఆడియ‌న్స్ త‌మ‌ ఫీలింగ్స్ ఎక్స్ ప్రెస్ చేస్తున్నారు. తాజాగా.. ఈ సినిమాపై మెగా బ్రదర్ నాగబాబు తన అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. Also Read: ‘ఉప్పెన‌’ జోరు.. తొలిరోజు కలెక్షన్స్ ఎంతంటే..? ‘నేను […]

Written By: Bhaskar, Updated On : February 13, 2021 1:52 pm
Follow us on


మెగా మేనల్లుడు, సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ హీరోగా పరిచయమైన‌ మూవీ ‘ఉప్పెన’. ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం.. స‌క్సెస్ ఫుల్ గా ర‌న్ అవుతోంది. హీరో, హీరోయిన్ల పెర్ఫార్మెన్స్ తోపాటు ద‌ర్శ‌కుడి టేకింగ్ గురించి కూడా ఆడియ‌న్స్ త‌మ‌ ఫీలింగ్స్ ఎక్స్ ప్రెస్ చేస్తున్నారు. తాజాగా.. ఈ సినిమాపై మెగా బ్రదర్ నాగబాబు తన అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు.

Also Read: ‘ఉప్పెన‌’ జోరు.. తొలిరోజు కలెక్షన్స్ ఎంతంటే..?

‘నేను ఉప్పెన సినిమా చూశాను. ఇలాంటి రిస్క్ కంటెంట్‌ను తెరపైకి తీసుకు వచ్చిన మైత్రీ మూవీస్, సుకుమార్ రైటింగ్స్ ను మనసారా అభినందిస్తున్నాను. నేనే గనక ఈ సినిమాకు ప్రొడ్యూసర్ అవ్వాల్సి వస్తే.. అంగీకరించే వాణ్ని కాదు. నేను రిస్క్ చేయను. రిస్క్ అంటే డూ ఆర్ డై. అలాంటి రిస్క్ తీసుకొన్న ప్రొడ్యూసర్స్‌ను మెచ్చుకోవాల్సిందే’ అని అన్నారు నాగబాబు. కోట్ల రూపాయల వ్యవహారాన్ని భుజాన మోసినందుకు మనస్పూర్తిగా అభినందిస్తున్నాను అని అన్నారు మెగా బ్రదర్.

ఇక, ఈ సినిమా చేసిన వైష్ణవ్ గురించి మాట్లాడుతూ.. ‘తొలి సినిమాలోనే ఇలాంటి కంటెంట్‌ను ఒప్పుకోవడంలోనే వాడి ధైర్యం ఉంది. ఇంత రిస్క్ కంటెంట్‌ను ఒప్పుకోవడమే పెద్ద రిస్క్. అలాంటి కంటెంట్ ఉన్న సినిమాను చేసి ఒప్పించాడు.’ అని అన్నారు నాగబాబు. ఇంకా ఏమన్నారంటే.. ‘వైష్ణవ్ కెరీర్‌లో తొలి సినిమా కథ ఇదేనని, చేయాలా వద్దా అని నన్ను అడిగితే.. ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించి ఉండేవాడిని కాదు. వైష్ణవ్‌కు మున్ముందు ఇంతకంటే సూపర్‌హిట్లు రావొచ్చు. కానీ.. ఇంత పెద్ద రిస్క్ ఉన్న సినిమా ఇక రాకపోవచ్చేమో’ అని నాగబాబు అభిప్రాయపడ్డారు.

Also Read: నేను జీవితంలో పెళ్లే చేసుకోను.. వాడు వ‌స్తే మాత్రం ఆలోచిస్తా : సాయి ప‌ల్ల‌వి

ఇక డైరెక్టర్ బుచ్చిబాబు గురించి చెబుతూ.. ‘ఇది దర్శకుడి సొంత కథ కాబట్టి, దాన్ని గొప్ప చూపించాలని అనుకుని ఉండొచ్చు. కానీ.. ఇలాంటి కథను ఎంచుకోవడం అంటే.. కెరీర్‌ను పణంగా పెట్టడమే. చావోరేవో అని కండీషన్లో.. అద్భుతమైన సినిమాను తీశాడు’ అని ప్రశంసించారు. విజయ్ సేతుపతి ఫెర్ఫార్మెన్ గురి మాట్లాడుతూ.. ‘విజయ్ యాక్టింగ్ ను పిజ్జా సినిమాలోనే చూశాను. ఆయన హాలీవుడ్ రేంజ్ ఫెర్ఫార్మర్. క్యారెక్టర్‌‌కు ఎంత కావాలో అంతే చేస్తాడు’ అని చెప్పారు మెగా బ్రదర్.

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి, తన రేంజ్ చూపించుకోవాలనే తాపత్రయం వైష్ణవ్ లో ఎక్క‌డా క‌నిపించ‌లేదు అన్న నాగ‌బాబు.. మొదటి సినిమాలోనే అద్బుతమైన ఫెర్ఫార్మెన్స్ చేశాడని మెచ్చుకున్నారు. ఉప్పెన సినిమాలో.. అశీర్వాదం అనే క్యారెక్టర్‌ మాత్రమే క‌నిపించింది త‌ప్ప‌, వైష్ణ‌వ్ తేజు క‌నిపించ‌లేదు అని ప్ర‌శంస‌లు కురిపించారు మెగా బ్ర‌ద‌ర్‌.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్