
ఈటల రాజేందర్ టీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి జూన్ 2న తన అసెంబ్లీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసే అవకాశం ఉంది. జూన్ 2 తెలంగాణ ఏర్పాటు దినం కావడంతో రాజేందర్ ఆ తేదీని ఎంచుకున్నట్లు తెలిసింది. కొద్ది రో జులుగా వస్తున్న ఊహాగానాలకు తెర పడినట్లయింది. త్వరలో ముహూర్తం ఖరారు చేసుకుని పార్టీలో చేరతారని చెబుతున్నారు.
మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరతారని తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా నానుతున్న వ్యవహారం ఓ కొలిక్కి వస్తోంది. ఇటీవల ఓ ఫాంహౌస్ లో జరిగిన సమావేశంలో బీజేపీ జాతీయ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీకి చెందిన ప్రముఖులు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పార్టీలోకి రావాలని ఆహ్వానించడంతో పాటు పలు హామీలు ఇచ్చినట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ ను కలిసిన మాట వాస్తవమే అని ఈటల సమాధానమిచ్చారు.
మరో వైపు కమలనాథులు ఈటల ఏ పార్టీలో చేరబోతున్నారని చెబుతున్నారు? బీజేపీలోనా? కాంగ్రెస్ లోనా? ఒక వేళ బీజేపీలో చేరితే ముహూర్తం ఎప్పుడు? అనే ప్రశ్నలు వేస్తున్నారు. గత కొన్ని రోజులుగా పలు ఊహాగానాలు రావడంతో ఈటల భవితవ్యంపై అందరికీ సందేహాలు ఏర్పడ్డాయి. ఒక దశలో సొంత పార్టీ పెడతారనే వార్త వ్యాపించింది. దీంతో ఆయన రాజకీయ నిర్ణయంపై అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
బీజేపీ జాతీయ నేతలతో గురువారం మధ్యాహ్నం రాష్ర్ట అధ్యక్షుడు బడి సంజయ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా బండి ఈటల ప్రస్తావించారు. ఈటలకు కాషాయ కండువా వేసేందుకు త్వరలో ముహూర్తం ఖరారు కానుందని చెప్పారు. ఈటల కాషాయ కండువా కప్పుకునేందుకు నిర్ణయించుకున్నట్లు బండి సంజయ్ చె ప్పేశారు. బీజేపీ పెద్ద మాస్టర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.