నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై ఏపీ ప్రభుత్వం రాజద్రోహం కేసు నమోదు చేసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిల్ పై విడుదలై గురువారం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. దేశ రాజధానిలో కరోనా ఉధృతంగా ఉండడంతో ఎయిమ్స్ ను కొవిడ్ రోగుల కోసం కేటాయించారు. కేంద్రం జోక్యంతో అదే ఆస్పత్రిలో రఘురామకు ప్రత్యేక వార్డు కేటాయించారు. అరెస్టు తర్వాత రఘురామ తొలిసారి కీలక ట్వీట్ చేశారు. ఏడాదిన్నర కాలంగా ఏపీ సర్కారుపై, సీఎం జగన్ పై విమర్శలు చేయడంతో ఎంపీపై సీఐడీ సుమోటాగా రాజద్రోహం కేసు నమోదు చేసి జైల్లో పెట్టింది. కస్టడీలో పోలీసులు కొట్టారని ఎంపీ ఫిర్యాదు చేయడంతో వ్యవహారం సుప్రీంకోర్టు దాకా వెళ్లడంతో బెయల్ వచ్చింది.
ఎంపీ రఘురామ ఎయిమ్స్ లో చేరడానికి ఢిల్లీకి వెళ్లినప్పటికి ఆస్పత్రి ప్రస్తుతం కొవిడ్ రోగులతో నిండిపోయినందున ప్రత్యేక వార్డు సదుపాయం కల్పించేందుకు ఆలస్యమైంది. కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ ఎయిమ్స్ డైరె క్టర్ రణదీప్ గులేరియా ఫోన్ చేసి రఘురామ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదేశించారు. గులేరియా ఎంపీ రఘురామకు ఫోన్ చేసి ఎయిమ్స్ కు రావాల్సిందిగా కోరారు.
రాజద్రోహం ఆరోపణలపై రఘురామను అరెస్టు చేసి గుంటూరుకు తరలించడం అక్కడి నుంచి అక్కడి జీజీహెచ్ లో ఆయనకు ట్రీట్ మెంట్ ఇవ్వడం, గుంటూరు జిల్లా జైలులోనూ ఒక రాత్రి ఉంచారు. ఏపీ సర్కారు తనకు ఇచ్చిన చికిత్సపై ఎంపీ అనుమానాలు వ్యక్తం చేశారు. జీజీహెచ్ లో తనపై ఏదైనా విష ప్రయోగం జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. ఎయిమ్స్ డైరెక్టర్ ను వివరణ కోరారు. రఘురామపై రాజద్రోహం కేసులో ఆంధ్రజ్యోతి ఏ2గా ఉన్నది.
సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి నుంచి బుధవారం ఢిల్లీ వెళ్లిన సమయంలో గురువారం ఎయిమ్స్ లో చేరిన సందర్బంగా రఘురామ వీల్ చైర్ కే పరిమితమయ్యారు. కాలి గాయాలు తగ్గకపోవడం, నొప్పి ఎక్కువగా ఉండటం, బీపీ నియంత్రణలో లేకపోవడం లాంటి సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఎయిమ్స్ ప్రాంగణంలో తనను పలకరించిన మీడియాతో మాట్లాడేందుకు ఎంపీ నిరాకరించారు.