Homeజాతీయ వార్తలుEtela Rajender: పొంగులేటి జూపల్లి.. ఈటెల బయటపెట్టిన సంచలన నిజాలు!

Etela Rajender: పొంగులేటి జూపల్లి.. ఈటెల బయటపెట్టిన సంచలన నిజాలు!

Etela Rajender: అంతర్గత కుమ్ములాటలు.. అనైక్యత.. తొమ్మిదేళ్లుగా అధికారానికి దూరం.. తెలంగాణ ఇచ్చిన పార్టీ అయినా ప్రజల్లో అంతగా ఆదరణ లేని పరిస్థితి.. గెలిచిన ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడి వెంటిలేషన్‌పై ఉన్న కాంగ్రెస్‌కు రేవంత్‌ పీసీసీ పగ్గాలు చేపట్టాక కాస్త ఆక్సిజన్‌ అందింది. ఈ క్రమంలో అసలైన కాంగ్రెస్‌ వాదులంటూ కొందరు సీనియర్లు చేస్తున్న చర్చతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. ఇలాంటి తరుణంలో బీజేపీ నేత, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ కాంగ్రెస్‌కు గుడ్‌ న్యూస్‌ చెప్పారు. హో.. హో.. గుడ్‌ న్యూస్‌ అంటే ఆయన కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు కాదు.. ఇద్దరు కీలక నేతలు కాంగ్రెస్‌లో చేరబోతున్నారని పరోక్ష సంకేతం ఇచ్చారు.

వాళ్లొస్తే కాగ్రెస్‌కు జోషే..
హైదరాబాద్‌లో సోమవారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన ఈటల రాజేందర్‌ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు బీజేపీలో చేరడం కష్టమేనని స్పష్టం చేశారు. చేరికల కమిటీ చైర్మన్‌గా బీజేపీలో చేరాలని వారితో చర్చలు జరిపితే.. రివర్స్‌లో వాళ్లు తనకే కౌన్సెలింగ్‌ ఇస్తున్నారని చెప్పారు. దీంతో వాళ్లు బీజేపీలో చేరే ఆలోచనలో లేరని స్పష్టం చేశారు.

ఈటలనే కాంగ్రెస్‌లోకి తోలుకుపోదామని..
ఇదిలా ఉంటే పొంగులేటి, జూపల్లి ఈటల రాజేందర్‌కే కౌన్సెలింగ్‌ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈటల కౌన్సెలింగ్‌ బీజేపీలోకి రావాలిని, వారిని ఒప్పించేలా ఉంటుంది. మరి పొంగులేటి, జూపల్లి ఈటలకే కౌన్సెలింగ్‌ ఎందుకు ఇచ్చారు.. ఏమని ఇచ్చి ఉంటారని ఎవరికివారు ఊహించుకుంటున్నారు. ఈటలనే కాంగ్రెస్‌లోకి తీసుకుపోయే ఆలోచనలో ఆ ఇద్దరు కీలక నేతలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈమేరకే వాళ్లు ఈటలకు కౌన్సెలింగ్‌ ఇచ్చానని తెలుస్తోంది.

బీజేపీలో చేరకపోవడానికి కారణాలివీ..
వాళ్లిద్దరూ బీజేపీలో చేరడానికి ఇష్టపడకపోవడానికి కారణాలను ఈటల రాజేందర్‌ వెల్లడించారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌ బలంగా ఉంది. బీజేపీ అంత బలంగా లేదని చెప్పారు. పొంగులేటి, జూపల్లితో రోజూ మాట్లాడుతున్నాని తెలిపారు. బీజేపీలో చేరేందుకు వారికి కొన్ని ఇబ్బందులున్నాయని చెప్పుకొచ్చారు.

కాంగ్రెస్‌లో చేరకుండా ఆపగలిగాను..
ఇప్పటివరకు వారిద్దరూ కాంగ్రెస్‌లో చేరకుండా మాత్రమే ఆపగలిగానని.. కానీ బీజేపీలోకి తీసుకు రాలేకపోయానని ఈటల స్పష్టం చేశారు. ఈ ప్రకారం చూస్తే.. ఈటల కూడా.. రేపో మాపో .. కౌన్సెలింగ్‌ కి కరిగిపోతారేమో తెలియదు కానీ.. ఆయనను పార్టీలోకి తెచ్చేందుకు రేవంత్‌ రెడ్డి చేయని ప్రయత్నమంటూ లేదు. పదే పదే పేరు పెట్టి పిలుస్తున్నారు. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్‌ పార్టీలోకి వస్తారని గట్టి నమ్మకంతో ఉన్నారు. వారు వారు బీజేపీలో చేరరని అంటున్నారు. బీజేపీని కల్పనా రాయ్‌గా.. కాంగ్రెస్‌ ను ఐశ్వర్రాయ్‌గా పోల్చుతూ.. పెళ్లి చూపులు చూస్తున్నారని..ఎవర్ని ఎంచుకుంటారని ప్రశ్నిస్తున్నారు. అంతే కాదు ఇతర నేతలందర్నీ కూడా కాంగ్రెస్‌ లోకి రావాలని పిలుపునిస్తున్నారు. చేరికల కమిటీ చైర్మన్‌గా వారిద్దర్నీ బీజేపీలోకి ఆకర్షించడంలోకి ఈటల విఫలమయ్యారని తెలుస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version