Etela Rajender: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ నినాదంతో బీజేపీ దూసుకురావాలనుకుంటోంది. ఇందులో భాగంగా ఇప్పటికే 100 మంది అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ 36 మంది బీసీలకు టికెట్లు ఇచ్చింది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కన్నా.. బీజేపీ బీసీలకు ఎక్కువ టిక్కెట్లు ఇచ్చింది. ఇదిలా ఉండగా.. బీజేపీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. బీజేపీని గెలిపిస్తే తెలంగాణ ముఖ్యమంత్రి బీసీ అవుతారని మొన్న హోం మంత్రి అమిత్‌షా, నిన్న ప్రధాని నరేంద్రమోదీ బల్లగుద్ది మరీ చెబుతున్నారు. దీంతో బీజేపీలో ముఖ్యమంత్రి ఎవరన్న చర్చ జరుగుతోంది. రేసులో ఈటల రాజేందర్, బండి సంజయ్, డాక్టర్ కె.లక్ష్మణ్ ఉన్నట్లు లెక్కలు వేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా హైదరాబాద్‌లో నిర్వహించిన బీసీల ఆత్మగౌరవ సభలో ప్రధాని మోదీ ఈటల, బండిన తన ఆహనంలో తీసుకుని వేదిక వద్దకు వచ్చారు. దీంతో రేసులో ఈ ఇద్దరు ఉన్నారన్న ప్రచారం మరింత ఊపందుకుంది.
ఈటలకే మొగ్గు..
తెలంగాణలో బీజేపీ గెలిస్తే మంత్రి అభ్యర్థిగా రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ పేరు దాదాపు ఖరారైనట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. రాష్ట్రంలోని బీసీవర్గాలంతా కలసి బీజేపీని గెలిపిస్తే పరిపాలనా అనుభవమున్న ఈటలను ముఖ్యమంత్రి చేస్తామని మోదీ పేర్కొన్నారని అంటున్నాయి. నిజానికి బీజేపీ ’బీసీల ఆత్మ గౌరవసభ’ వేదికగా సీఎం అభ్యర్థిపై ప్రధాని స్పష్టత ఇస్తారన్న ప్రచారం జరిగింది. కానీ అలా జరగలేదు.
సభ ముగిశాక సమావేశం..
బీసీల ఆత్మగౌరవ సభ అనంతరం మోదీ 33 బీసీ, కుల సంఘాల మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ప్రతినిధులతో భేటీ సందర్భంగా మెజా ఇతర పార్టీ నేతలతో విడిగా భేటీ అయ్యారు. పార్టీ నిలిపిన బీసీ అభ్యర్థులను గోలిపించాలని సూచించారు. ‘అందరికీ అందుబాటులో ఉండే ఈటల రాజేందరే మీ నాయకుడు’ అని ప్రధాని స్పష్టత ఇచ్చినట్టు తెలిసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, ఓబీసీ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ సమక్షంలో ఈటల పేరును ప్రస్తావించినట్లు సమాచారం. మరోవైపు సభలో కూడా ఈటలను వేదికపైకి పిలిచి తన పక్కన కూర్చోబెట్టుకోవడం గమనార్హం.
పార్టీ బలాబలాలపై ఆరా..
ఈ సందర్భం బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల తీరు, బీజేపీ అభ్యర్థుల ఖరారు, ఎన్నికల సన్నద్ధత తీరు, పార్టీ బీసీ నినాదానికి ప్రజల్లో వస్తున్న స్పందనపై మోదీ ఆరా తీసినట్టు సమాచారం. గజ్వేల్లో తన నామినేషన్‌సందర్భంగా 20 వేల మంది వరకు వచ్చారని, ప్రజల్లో మంచి స్పందన ఉందని ఈటల వివరించి నట్టు తెలిసింది. ఈ పరిణామాలన్నీ ఈటలకు అనుకూలిస్తాయని అంటున్నారు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Etela rajender cm if bjp wins
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com