Vizag Steel Plant: ఉట్టికి ఎగరలేని సింగరేణి.. వైజాగ్ స్టీల్ ను ఏం ఉద్ధరిస్తుంది?

Vizag Steel Plant: విశాఖపట్నం స్టీల్ ప్లాంటును సింగరేణి టేక్ ఓవర్ చేస్తుందా? ఇది కీలకమైన ప్రశ్న.. చేసే సవాల్ లేదు అనేది జవాబు. సత్తా ఏ మాత్రం లేదు అనేది వివరణ. అబ్బే,కేసీఆర్ తలచుకుంటే ఏదైనా చేస్తారు అనేది భారత రాష్ట్ర సమితి నాయకుల స్పష్టీకరణ. ఇది జరిగేంత దమ్ము లేదు అనేది నిష్ఠుర సత్యం. చాలామందికి తెలియడం లేదు కానీ కెసిఆర్ ఆడుతున్న పొలిటికల్ గేమ్ ఇది. దానికోసం పన్నిన తెలివైన ఎత్తుగడ ఇది. […]

Written By: Bhaskar, Updated On : April 13, 2023 8:59 am
Follow us on

Vizag Steel Plant

Vizag Steel Plant: విశాఖపట్నం స్టీల్ ప్లాంటును సింగరేణి టేక్ ఓవర్ చేస్తుందా? ఇది కీలకమైన ప్రశ్న.. చేసే సవాల్ లేదు అనేది జవాబు. సత్తా ఏ మాత్రం లేదు అనేది వివరణ. అబ్బే,కేసీఆర్ తలచుకుంటే ఏదైనా చేస్తారు అనేది భారత రాష్ట్ర సమితి నాయకుల స్పష్టీకరణ. ఇది జరిగేంత దమ్ము లేదు అనేది నిష్ఠుర సత్యం. చాలామందికి తెలియడం లేదు కానీ కెసిఆర్ ఆడుతున్న పొలిటికల్ గేమ్ ఇది. దానికోసం పన్నిన తెలివైన ఎత్తుగడ ఇది. రావలసినంత లబ్ధి దక్కిన తర్వాత మళ్లీ దీని మాట ఎత్తడు. ఆ సి ఎం ఓ ఆఫీస్ నుంచి నమస్తే తెలంగాణ పత్రిక వరకు గత కొద్ది రోజులుగా ఊదుతున్న బాకాలు, మోగిస్తున్న భాజాలు, చేస్తున్న ప్రచారం ఒక్కటే ” వైజాగ్ స్టీల్ ను కెసిఆర్ కొంటున్నాడు.. ఆంధ్ర ప్రజలను కాపాడుతున్నాడు.. నరేంద్ర మోదీ అమ్ముతుంటే కెసిఆర్ కొంటున్నాడు” ..కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరు, వైజాగ్ స్టీల్ కోసం సింగరేణి కి నిజంగా అంతటి “ఆసక్తి వ్యక్తీకరణ” ఉందా? అసలు అంతటి ఆర్థిక దన్ను సింగరేణి సంస్థ కలిగి ఉందా? దీనికి సింగరేణి కార్మికులు ఇచ్చే సమాధానం లేదు. అధికారులు చెప్పే జవాబు అంత సత్తా లేదు. బ్యాంకర్లు ఇచ్చే ఆన్సర్.. అసలు బ్యాలెన్స్ షీటే సరిగా లేక అప్పులు చేస్తోంది.

విశాఖ బుక్కులో అడుగుపెట్టి రాజకీయ ప్రయోజనం పొందడమే కెసిఆర్ వ్యూహం లాగా కనిపిస్తోంది. మరోవైపు సింగరేణి వల్ల విశాఖ ఉక్కు జరిగేది ఏమిటి అనే చర్చ కూడా నడుస్తోంది. వాస్తవానికి సింగరేణి వద్ద థర్మల్ బొగ్గు మాత్రమే ఉంది. ఈ కేవలం విద్యుత్ ఉత్పత్తికి మాత్రమే ఉపయోగపడుతుంది. విశాఖ ఉక్కు కర్మాగారం తన విద్యుత్ అవసరాలకు మహానది కోల్ ఫీల్డ్స్ నుంచి బొగ్గు తెప్పించుకుంటున్నది. ఇక ఈ బొగ్గు సరఫరా కి సంబంధించి మహానది సంస్థతో ఒప్పందం ఉండడంతో టన్నుకు మూడు వేల నుంచి 3500 వరకు ఖర్చు చేస్తోంది. గత ఏడాది మే, జూన్ నెలలో బొగ్గు సమస్య ఏర్పడింది. దీంతో వైజాగ్ స్టీల్ సంస్థ సింగరేణి నుంచి బొగ్గు కొనుగోలు చేసింది. సింగరేణి బొగ్గును ఏకంగా తనకు 6000 పెట్టి కొనుగోలు చేసింది. ఒక దశలో 12,000 కూడా చెల్లించాల్సి వచ్చింది.. ఒకవేళ సింగరేణి నుంచి బొగ్గు తెచ్చుకోవాలి అనుకుంటే అది వైజాగ్ స్టీల్ కు ఆర్థిక భారం అవుతుందని అక్కడి కార్మిక వర్గాలు చెబుతున్నాయి. మరో వైపు ఈ బిడ్ లో పాల్గొనే అర్హత సింగరేణికి లేదని వైసీపీ నాయకులు చెబుతున్నారు. మీడియా కూడా ఇదే ప్రచారం చేస్తోంది.

Vizag Steel Plant

మరోవైపు విశాఖ ఉక్కు బిడ్ లో తెలంగాణ ప్రభుత్వం సింగరేణి ద్వారా పాల్గొంటున్నది. బుధవారం ఆ సంస్థకు చెందిన అధికారులు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను సందర్శించారు. అయితే ఇక్కడే అసలు ప్రశ్న ఎదురవుతోంది. వాస్తవానికి తెలంగాణలో సింగరేణి పరిస్థితి ఏమంత బాగోలేదు. సంస్థలో ప్రభుత్వ పెత్తనం ఎక్కువైపోయింది. సింగరేణి నిధులను ఇతర మార్గాలకు మళ్లించడంతో సంస్థ ఆర్థికంగా ఇబ్బంది పడుతోంది. సంస్థ అధికారిక బ్యాలెన్స్ షీట్ పరిశీలిస్తే విస్మయపరిచే వాస్తవాలు కళ్ళకి గడుతున్నాయి. అలాంటి సంస్థ వైజాగ్ స్టీల్ ను ఏం ఉద్ధరిస్తుందని కార్మిక వర్గాలు అంటున్నాయి. దీని ప్రకారం చూస్తే ఉట్టికి ఎగరలేనమ్మ.. స్వర్గానికి ఎగిరినట్టు ఉందని వారు వివరిస్తున్నారు. వాస్తవానికి సింగరేణి ఒకప్పుడు సిరిసంపదలతో తులతూగింది.. పనుల భారం తగ్గించుకునేందుకు లాభాలు తక్కువ చూపించి ఆ నిధులను సింగరేణి విస్తరణకు ఉపయోగించిన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఒక్కోసారి జీతాలు ఇచ్చేందుకు కూడా అప్పులు తేవాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారత రాష్ట్ర సమితి పెద్దల “ప్రత్యేక ఆసక్తి” వల్ల విద్యుత్ ప్లాంట్లు విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగానే కని విని ఎరుగనిస్థాయిలో అప్పులు తెచ్చేందుకు భారీ ప్లాన్లు వేస్తున్నారు.. ఇలాంటప్పుడు వైజాగ్ స్టీల్ సంస్థను సింగరేణి ఎలా కాపాడుతుంది అనేది పెద్ద ప్రశ్నగా ఉంది.

అంతే కాదు తన ఒడిలోనే వేలం వేస్తున్న గనులను కొనలేని స్థితిలో సింగరేణి ఉంది.. ఇలాంటప్పుడు వైజాగ్ స్టీల్ విషయంలో ఒకవేళ ఆసక్తి వ్యక్తిగణలో పాల్గొంటే సింగరేణి కోరి కష్టాలు తెచ్చుకున్నట్టే అని కార్మిక వర్గాలు చెబుతున్నాయి. సింగరేణి 2021_22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 1227 కోట్ల లాభాలను ఆర్జించింది. కానీ ఈ డబ్బులు సంస్థ వద్ద లిక్విడ్ రూపంలో లేవు. తవానికి తెలంగాణ విద్యుత్ సంస్థల నుంచే దాదాపు 14 వేల కోట్లు సింగరేణికి రావాలి. ఆ డబ్బులు ఇచ్చే పరిస్థితిలో విద్యుత్ సంస్థలు లేవు. వసూలు చేసుకునేంత దమ్ము కూడా సింగరేణికి లేదు. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వమే సింగరేణి పీక నొక్కుతోంది కాబట్టి.. ఈ విషయాలు బయటపడకుండా జాగ్రత్త పడుతోంది కాబట్టి.