https://oktelugu.com/

ఇంజినీర్లు ఇలాంటి పని చేస్తున్నారేంటి?

చెన్నైకి చెందిన 21 ఏళ్ల ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఎస్ ఆదిత్య కార్ పార్కింగ్ అటెండర్‌గా పనిచేస్తున్నారు. ప్రతి నెలా 18 వేల రూపాయల జీతం పొందుతున్న ఆదిత్య, చెన్నై కార్పొరేషన్ కు చెందిన స్మార్ట్ కార్ పార్కింగ్ కోసం రూపొందించిన యాప్ ప్రమోషన్ కోసం పనిచేస్తున్నారు. ఈ ఉద్యోగానికి 10 వ తరగతి పాస్ అయిన అభ్యర్థులు సరిపోతారు. అయితే ఈ ఉద్యోగం కోసం సుమారు 50 మంది ఇంజనీర్లు, ఎంబీఏ డిగ్రీ హోల్డర్లు దరఖాస్తు చేశారు. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : March 7, 2020 2:46 pm
    Follow us on

    చెన్నైకి చెందిన 21 ఏళ్ల ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఎస్ ఆదిత్య కార్ పార్కింగ్ అటెండర్‌గా పనిచేస్తున్నారు. ప్రతి నెలా 18 వేల రూపాయల జీతం పొందుతున్న ఆదిత్య, చెన్నై కార్పొరేషన్ కు చెందిన స్మార్ట్ కార్ పార్కింగ్ కోసం రూపొందించిన యాప్ ప్రమోషన్ కోసం పనిచేస్తున్నారు. ఈ ఉద్యోగానికి 10 వ తరగతి పాస్ అయిన అభ్యర్థులు సరిపోతారు. అయితే ఈ ఉద్యోగం కోసం సుమారు 50 మంది ఇంజనీర్లు, ఎంబీఏ డిగ్రీ హోల్డర్లు దరఖాస్తు చేశారు. వీరు అవుట్‌సోర్స్ అందించిన సంస్థ ద్వారా ఈ పని చేస్తున్నారు. తాము తక్కువ అర్హత ఉన్న వ్యక్తికి దక్కే ఉద్యోగావకాశాలను హరించడం లేదని ఆదిత్య చెప్పారు. ఆదిత్య మాట్లాడుతూ, ‘పదవ తరగతి పాస్ అయిన అబ్బాయి లేదా అమ్మాయి ఈ పనిలోకి దిగితే, వారు ఈ టెక్నిక్ అర్థం చేసుకోవడానికి 4 నుండి 5 గంటలు పడుతుంది. అదే మాకు అయితే రెండు, మూడు నిమిషాలు మాత్రమే పడుతుంది.

    ఆదిత్య మాదిరిగానే ఎంబీఏ డిగ్రీ హోల్డర్, 21 సంవత్సరాల రాజేష్ కూడా టీమ్ లీడర్‌గా చేరాడు. రాజేష్ తాను గతంలో అందుకున్న జీతానికన్నా తక్కువ జీతానికి ఈ ఉద్యోగంలో చేరాడు. అతనికి పెళ్లి అవడంతో పాటు ఆరేళ్ల పిల్లవాడు కూడా ఉన్నాడు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ ఎంబీఏ లేదా బీఈ చేసిన తర్వాత ఎవరికీ ఉద్యోగాలు రావడం లేదు. మా లాంటివారు రూ. 10,000 కన్నా తక్కువ జీతం వచ్చినా పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నిరుద్యోగ సమస్యతో పోరాడుతున్న 1500 మందికి పైగా ఉన్నత విద్యావంతులైన అభ్యర్థులు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే సంస్థ 50 మందికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చింది. కాగా ఎస్ఎస్ టెక్, టర్క్ మీడియా సర్వీసెస్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ బి రిజ్వాని కటు మాట్లాడుతూ 1000 మంది అభ్యర్థులలో 50 మందిని ఎంపిక చేసి, వారికి శిక్షణ ఇచ్చారని చెప్పారు. గత సంవత్సరం తమిళనాడు అసెంబ్లీలో 14 స్వీపర్ పోస్టులకు 4,600 మంది ఇంజనీర్లు, ఎంబీఏ చేసినవారు, రీసెర్చ్ స్కాలర్స్ దరఖాస్తు చేశారని చెప్పారు.