https://oktelugu.com/

పలాస 1978 రివ్యూ: వృధా ప్రయాస

న‌టీన‌టులు: ర‌క్షిత్‌, న‌క్ష‌త్ర‌, తిరువీర్‌, ర‌ఘుకుంచె, జ‌నార్ధ‌న్‌, శ్రుతి, ల‌క్ష్మ‌ణ్ త‌దిత‌రులు నిర్మాత‌: ధ్యాన్ అట్లూరి వ‌ర‌ప్ర‌సాద్‌ ద‌ర్శ‌క‌త్వం: క‌రుణ కుమార్‌ సంగీతం: ర‌ఘుకుంచె సినిమా అనేది అద్భుత దృశ్య మాధ్యమం. విభిన్న కధల్ని ,వాస్తవ సంఘటల్ని చాలా అందంగా ,హృద్యంగా ప్రేక్షకులకి అందించ వచ్చు. ఆ క్రమంలో తెలుగు తెర ఫై మంచి ప్రయత్నం పలాస 1978 . ఒక ఊరి చరిత్రని నేపధ్యంగా తీసుకొని అల్లబడిన ఈ చిత్ర కథ తెలుగు తెరకు కొత్త […]

Written By:
  • Neelambaram
  • , Updated On : March 7, 2020 / 02:22 PM IST
    Follow us on

    న‌టీన‌టులు: ర‌క్షిత్‌, న‌క్ష‌త్ర‌, తిరువీర్‌, ర‌ఘుకుంచె, జ‌నార్ధ‌న్‌, శ్రుతి, ల‌క్ష్మ‌ణ్ త‌దిత‌రులు
    నిర్మాత‌: ధ్యాన్ అట్లూరి వ‌ర‌ప్ర‌సాద్‌
    ద‌ర్శ‌క‌త్వం: క‌రుణ కుమార్‌
    సంగీతం: ర‌ఘుకుంచె

    సినిమా అనేది అద్భుత దృశ్య మాధ్యమం. విభిన్న కధల్ని ,వాస్తవ సంఘటల్ని చాలా అందంగా ,హృద్యంగా ప్రేక్షకులకి అందించ వచ్చు. ఆ క్రమంలో తెలుగు తెర ఫై మంచి ప్రయత్నం పలాస 1978 . ఒక ఊరి చరిత్రని నేపధ్యంగా తీసుకొని అల్లబడిన ఈ చిత్ర కథ తెలుగు తెరకు కొత్త అనుభవమే అందులో ఎటువంటి సందేహం అక్కరలేదు. కానీ కధలో కొత్తదనం లోపించడం మాత్రం ఒక వెలితిగా మిగిలి పోయింది.

    కథ :

    జానపద కళనే నమ్ముకొని బ్రతికే బడుగు జీవితాల వ్యధ పలాస 1978 చిత్రం. ఆదరణకు నోచుకోని మనుషుల తిరుగుబాటు ఈ చిత్రం. పెత్తందారీ వ్యవస్థ రగిల్చిన అగ్నికి అసహన వాయువు తోడైతే ఏమౌతుందో ఈ చిత్రం చెబుతుంది. నేటికీ తరగని జాతి అంతరాల చర్చకు ఈ సినిమా ఒక మార్గదర్శి. జానపద కళనే వృత్తిగా చేసుకొని బ్రతికే రంగారావు, మోహన్ రావు అనబడే ఇద్దరు అన్నదమ్ములు తమ ఊరి షావుకారు చేసే దురాగతాలపై ఎలా స్పందించారు అనేది చిత్ర కథ. ఆ క్రమంలో జరిగే సంఘర్షణ , పోరాటాల వల్ల తమ చేతులకు నెత్తురు అంటింది అని ఆ మరక అంత త్వరగా పోదని కథానాయకుడు చెప్పడంతో సినిమా ముగుస్తుంది.

    దర్శకత్వం:

    తెలుగులో పలు లఘు చిత్రాలు తీసి ప్ప్రశంసలు అందుకొన్న కరుణ కుమార్ తన తొలి ప్రయత్నంగా ఒక ఊరి నేపధ్యం తీసుకోవడం చాలా బాగుంది. తమిళం లో భారతి రాజా, బాలా , చరణ్ , వెట్రిమారన్ వంటి దర్శకులు ఇలాంటి విల్లెజ్ బేస్డ్ చిత్రాలకు పెట్టింది పేరు. వారి బాట లోనే ఒక ఊరి నేపధ్యం ఈ చిత్రానికి కదా వస్తువు అయ్యింది. ఆ కథని దర్శకుడు బాగా హేండిల్ చేసాడు. కరుణ కుమార్ దర్శకుడిగా సక్సెస్ అయినప్పటికీ తాను చెప్పిన కధలో కొత్త ధనాన్ని చూపించ లేక పోయాడు. సినిమాలో వచ్చే దృశ్యాలన్నీ ఎక్కడో చూసిన ఫీలింగ్ కలుగు తుంది. ఇంకా గట్టిగా చెప్పాలంటే సినిమాలో థ్రిల్ కొరవడింది. రంగస్థలం వంటి చిత్రం బ్లాక్ బస్టర్ అవ్వడానికి కారణం ఆ సినిమాలోని థ్రిల్లింగ్ అంశాలే… అలాంటి వాటిని తన చిత్రంలో చూపించడం లో దర్శకుడిగా కరుణ కుమార్ విఫల మయ్యాడు.

    నటీనటులు :

    గతంలో లండన్ బాబులు చిత్రం తో తెలుగు తెరకు పరిచయం అయిన రక్షిత్ తన రెండో చిత్రంగా పలాస 1978 ని ఎన్నుకోవడం అభినందించదగ్గ విషయం. తనలోని నటుడికి పరీక్ష పెట్టె ఇలాంటి చిత్రాలే అతని భవిష్యత్ కి బాగా ఉపయోగ పడతాయి. ఇక హీరో అన్న రంగారావు గా నటించిన తిరువీర్ కూడా మంచి నటనని కనబర్చాడు. ఇక విలన్లుగా నటించిన రఘు కుంచె, లింగమూర్తి తమ దుర్మార్గాన్ని బాగా చూపించారు.హీరోయిన్ గా నటించిన నక్షత్ర ఉన్నంతలో పర్వాలేదు అనిపించింది. ఆమె తన తొలి చిత్రం రాజదూత్ లో కనిపించిన దానికి భిన్నంగా పలాస చిత్రంలో కనిపించి నటిగా మెరుగయింది.

    సాంకేతిక నిపుణులు :

    కథ, మాటలు, స్క్రీన్ ప్లే , దర్శకత్వం వంటి కీలక శాఖలు తన భుజాల ఫై మోసిన కరుణ కుమార్ ఒక్క కథ విషయం లోనే తడ బడ్డాడు. పాత కదాంశానికి కొత్త ట్విస్టులు ఇవ్వడం లో ఫెయిల్ అయ్యాడు. ఇక మాటల రచయితగా మంచి ప్రతిభ చూపించాడు. కత్తిని అమ్మినవాడిది కాదు తప్పు దాన్ని ఉపయోగించే వాడిదే తప్పు, శోభనం లేని పెళ్లి ఎందుకు దండగ వంటి అర్ధవంతమైన మాటలు సినిమాకి సపోర్ట్ గా నిలిచాయి. అలాగే చిత్రానికి కరుణ కుమార్ అందించిన స్క్రీన్ ప్లే బాగుంది. మంచి నేటివిటీ తో అందర్నీ ఆకట్టు కొనేలా వుంది. సినిమాకి వెన్నెముకగా నిలిచిన అంశాల్లో .కెమెరా మాన్ అరుళ్ విన్సెంట్ పాత్ర మరువలేనిది. మంచి పిరియాడికల్ మూవీ కి ఉండాల్సిన సొగసులు బాగా అద్దాడు. ఎడిటింగ్ కూడా ఒకే అనదగ్గ స్థాయిలో ఉంది. ఇక సంగీత దర్శకుడిగా రఘు కుంచె కూడా మంచి ఫలితమే రాబట్టాడు. కానీ పాటల్ని హిట్ చేయడం లో ఇంకా కొంచెం శ్రద్ద చూపిస్తే బాగుండేది.

    విశ్లేషణ :

    కొత్త ప్రయత్నానికి పాత కథ తోడవ్వడం తో పలాస 1978 చిత్రం ప్రేక్షకుల్ని మెప్పించడం లో విఫలం అయ్యింది. సినిమా విడుదలకు ముందు ఉన్న హైప్ సినిమా వచ్చాక తగ్గడానికి ప్రధాన కారణం ఇదే . భూస్వాముల ఫై అణగారిన వర్గాల తిరుగుబాటు అనేది ఎప్పటి నుంచో ఉన్న కధాంశం. దాని కొత్తగా చెప్పడంలో దర్శకుడు మాత్రం సఫలం కాలేక పోయాడు. ఆపరేషన్ సక్సెస్ పేషంట్ డెడ్ అన్న చందంలా పలాస 1978 చిత్రం ఆశించిన ఫలితాన్ని దక్కించుకోలేక పోతోంది.