https://oktelugu.com/

కరోనా సోకినా.. మనకు వైరస్ లక్షణాలు ఎందుకు కనిపించడం లేదు..? కారణమిదేనా..?

దాదాపు ప్రపంచాన్ని కమ్మేసిన కరోనా వైరస్ కోట్ల మంది ప్రాణాలను బలి తీసుకుంది. మిలయన్ల మంది శరీరాల్లో ప్రవేశించి అల్ల కల్లోలం చేసింది. సంవత్సర కాలంగా కరోనా వైరస్ ఊబిలో చిక్కుకున్న జనం గత కొద్ది నెలలుగా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారని తెలుస్తోంది. వ్యాక్సిన్ల ప్రభావం.. బాధితులు తీసుకుంటున్న జాగ్రత్తలతో పాటు వైద్యులు తయారు చేసిన మెడిసిన్ కరోనా పూర్తిగా ఆవహించకపోవడానికి కారణమని తెలుస్తోంది. అయితే కరోనా ప్రారంభ దశలో కొన్ని లక్షణాలు కనిపిస్తే వైరస్ సోకిందని నిర్దారించారు. […]

Written By:
  • NARESH
  • , Updated On : January 31, 2021 / 10:51 AM IST
    Follow us on

    దాదాపు ప్రపంచాన్ని కమ్మేసిన కరోనా వైరస్ కోట్ల మంది ప్రాణాలను బలి తీసుకుంది. మిలయన్ల మంది శరీరాల్లో ప్రవేశించి అల్ల కల్లోలం చేసింది. సంవత్సర కాలంగా కరోనా వైరస్ ఊబిలో చిక్కుకున్న జనం గత కొద్ది నెలలుగా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారని తెలుస్తోంది. వ్యాక్సిన్ల ప్రభావం.. బాధితులు తీసుకుంటున్న జాగ్రత్తలతో పాటు వైద్యులు తయారు చేసిన మెడిసిన్ కరోనా పూర్తిగా ఆవహించకపోవడానికి కారణమని తెలుస్తోంది. అయితే కరోనా ప్రారంభ దశలో కొన్ని లక్షణాలు కనిపిస్తే వైరస్ సోకిందని నిర్దారించారు. కానీ రాను రాను వైరస్ జన్యువులో మార్పలు చోటు చేసుకోవడంతో ఈ వైరస్ బారిన కొందరు చిక్కుకునా లక్షణాలు కనిపించకపోయేసరికి తమకు కరోనా రాలేదని ధీమాగా ఉన్నారు. కానీ చివరి దశలో బయటపడి వెంటనే మరణాలు జరగడంతో కొందరు భయాధ్రిక్తులయ్యారు. ఇలా ఒక మనిషి శరీరంలో కరోనా సోకినా లక్షణాలు కనిపించకపోవడానికి కారణమేంటని వైద్యలు ఇంకా పరిశోధనలు చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం ఇలా లక్షణాలు కనిపించకపోవడానికి కారణం ఇదేనంటున్నారు. అదేంటో చూద్దాం..

    ఒక మనిషిలో రోగ నిరోధక శక్తిని భట్టి ఏ వైరస్ అయినా అభివృద్ధి చెందుతుందా..? లేదా..? అనేది వైద్యులు నిర్దారిస్తారు. చిన్న జ్వరం వచ్చిన జ్వరం తగ్గడానికి మెడిసిన్ తో పాటు రోగ నిరోధక శక్తి మెడిసిన్ కూడా ఇస్తారనే విషయం కొందరు మాత్రమే గ్రహిస్తారు. ఈ నేపథ్యంతో కరోనా కూడా మనిషిలోని రోగనిరోధక శక్తితో పోరాడుతుందని వైరస్ ప్రారంభ దశలోనే తేల్చారు. అంటే రోగ నిరోధక శక్తి ఎక్కవగా ఉన్నంతసేపు కరోనా పోరాడి, ఆ తరువాత బలహీనమైపోతుందని వైద్యులు చెబుతున్నారు.

    ఈ సమయంలో ప్రతిఒక్కరూ తమ రోగ నిరోధక శక్తిని పెంచుకునేందు సరైన ఆహారం తీసుకోవాలని ఇప్పటికే వైద్యులు సూచిస్తున్నారు. అయితే ఇది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఇప్పటికే కొందరు ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారు సరైన ఆహారం తీసుకునే అవకాశం లేదు. దీంతో వారిలో రోగ నిరోధక శక్తి తక్కువగానే ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే కరోనా ప్రారంభ స్టేజీలో ఇతర వ్యాధులు.. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు వైరస్ దాడికి తట్టుకోలేకపోయారు. డయాబెటిస్ ఉన్నవారు సహజంగానే పరిమితితో కూడిన ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల వీరిలో కరోనా వైరస్ దాడి చేసిన క్రమంలో రోగనిరోధక శక్తి మరింత సన్నగిల్లేసరికి కొందరి మరణాలకు కారణమైంది.

    అయితే కరోనా ఉన్నవారిలో లక్షణాలు కనిపించకపోవడానికి కారణమేంటని విషయంపై వైద్యులు కొన్ని విషయాలను ప్రస్తావించారు. వాస్తవానికి వీరిలో కరోనా ఉన్నా వారు ఇంకా వైరస్ తో పోరాడున్నారని అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ విషయాన్ని వారు గుర్తించడమేలా ప్రశ్నపై… కరోనా ఉన్నాలక్షణాలు లేకపోవడానికి కారణంపై పరిశోధనలు జరుగుతున్నాయని, ఇప్పటి వరకైతే అలాంటి పరీక్షలు ఎక్కడా జరగలేన్నారు. మనిషిలో కరోనా ఉన్నా కూడా లక్షణాలు లేకపోవడానిక ప్రధానంగా రోగనిరోధక శక్తి యాక్టివ్ గా ఉండడమేనని ప్రాథమికంగా తెల్సుకోవచ్చని వైద్యులు తెలిపారు.

    కానీ ఇక్కడ బలమైన వైరస్, బలహీనమైన వైరస్ అని రెండు రకాలు శరీరంలోకి ప్రవేశించిందా..? అనే విషయంపై పరిశోధనలు చేస్తున్నామని అంటున్నారు. ఏదీ ఏమైనా ఇప్పుడున్న వ్యాక్సిన్ల తో కొంత రోగ నిరోధక శక్తి అభివృద్ధి చేసుకొని కరోనా దాడి నుంచి రక్షణ పొందవచ్చని తెలిపారు. కరోనా వైరస్ పరిణామక్రమ మొత్తంలో రోగ నిరోధక శక్తియే ప్రధాన ఆయుధనమి వైద్యులు సూచిస్తున్నారు.