Homeఆంధ్రప్రదేశ్‌Jagan- Govt Employees: ఏపీ ప్రభుత్వంపై తిరుగుబాటుకు రెడీ అయిన ఉద్యోగులు

Jagan- Govt Employees: ఏపీ ప్రభుత్వంపై తిరుగుబాటుకు రెడీ అయిన ఉద్యోగులు

Jagan- Govt Employees: ఏపీలో ఉద్యోగులు మరోసారి పోరుబాటకు సన్నద్ధమవుతున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమాన్ని తీవ్రతరం చేయనున్నారు. గత మూడేళ్లుగా వైసీపీ సర్కారు తమను దారుణంగా వంచించిందని ఆరోపిస్తూ ఆందోళన బాట పడుతున్నారు. సెప్టెంబరు 1న మిలియన్ మార్చ్ కు పిలుపునిచ్చారు. దాని సన్నాహాల్లో నిర్వాహకులు ఉన్నారు. అయితే ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వానికి అనుకూలంగా ఉండడంతో ప్రత్యామ్నాయంగా కొందరు నిర్వాహక కమిటీగా మారి మిలియన్ మార్చ్ ను విజయవంతం చేసేందుకు ఉపాధ్యాయులు, ఉద్యోగులను సమీకరించే పనిలో ఉన్నారు.అయితే గత అనుభవాల దృష్ట్యా మిలియన్ మార్చ్ ను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం అన్ని వ్యూహాలను రూపొందిస్తోంది. అందులో భాగంగా ఉపాధ్యాయులు హాజరుకాకుండా ఉండేందుకు ప్రయత్నిస్తోంది. కొత్తగా వారికి హాజరు యాప్ ను రూపొందిస్తోంది. పాఠశాల నిర్దేశిత సమయాల్లో ముఖానికి సంబంధించి మూడు కోణాల్లో హాజరును నమోదు చేసే యాప్ ను మంగళవారం నుంచి అమలుచేస్తోంది. ఎటువంటి సన్నాహాలు లేకుండా ఉన్నపలంగా అమలుచేయడం వెనుక ప్రభుత్వ ఉద్దేశ్యం అదేనన్న వ్యాఖ్యలు మాత్రం వినిపిస్తున్నాయి.

Jagan- Govt Employees
Jagan- Govt Employees

సీపీఎస్ రద్దు హామీ ఏమైంది?
అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామన్న హామీకి అతీగతీ లేదు. మూడేళ్లు దాటుతున్నా చలనం లేదు. బహుశా సీఎం జగన్ పాలన వారం రోజులు దాటకపోయి ఉంటుందని ఉద్యోగ, ఉపాధ్యాయులు విమర్శిస్తున్నారు. గత ఎన్నికల్లో జగన్ కు ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు అండగా నిలిచాయి. అందుకే అంతగా మెజార్టీ సాధ్యమైందని రాజకీయ విశ్లేషకులు సైతం భావిస్తుంటారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యోగ, ఉపాధ్యాయులపై కఠినంగా వ్యవహరించిన సందర్భాలున్నాయి. డీఏలు ఇచ్చి.. అదే పీఆర్సీ అని లెక్క కట్టిన సందర్భాలున్నాయి. అడ్డగోలుగా వాదించి జీతాలు పెరగకుండా చూసింది. దీంతో తాము దారుణంగా నష్టపోయామన్న భావన, బాధ, కసి ఆ రెండు వర్గాల్లో ఉండిపోయింది. అనేక సౌకర్యాలకు సైతం మంగళం పలికింది. సీపీఎస్ విషయంలో సైతం మడమ తిప్పేసింది. ఒక వేళ అమలుచేస్తే మాత్రం పెద్ద మొత్తంలో బడ్జెట్ అవసరమని భావించి మౌనాన్నే ఆశ్రయిస్తోంది.అప్పట్లో అవగాహన లేక హామీ ఇచ్చామన్న ప్రభుత్వ ప్రకటనతో ఉద్యోగ, ఉపాధ్యాయులు జగన్ సర్కారుపై గుర్రుగా ఉన్నారు.

Also Read: AP Govt Teachers: ఏపీలో ఉపాధ్యాయులకు షాకిచ్చిన జగన్

మిలియన్ మార్చ్ కు సన్నాహాలు..
సెప్టెంబరు 1న మిలియన్ మార్చ్ ను విజయవంతం చేసి ప్రభుత్వం కళ్లు తెరిపించాలన్న కసితో ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఉన్నారు. ప్రభుత్వంపై తమ అసంతృప్తిని తెలియజేయాలని భావిస్తున్నారు. అయితే గతంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు విజయవాడలో తలపెట్టిన నిరసన కార్యక్రమంపై ఉక్కుపాదం మోపినా ఫలితం లేకపోయింది. లక్షలాదిగా తరలివచ్చి తమ ప్రతాపాన్ని చూపారు. ఒక విధంగా చెప్పాలంటే అప్పటి నుంచే ప్రజా వ్యతిరేకత ప్రారంభమైందని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. అందుకే ఈ సారి ఉద్యోగ, ఉపాధ్యాయులు తలపెట్టిన మిలియన్ మార్చ్ ను భగ్నం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అసలు కార్యక్రమానికే అనుమతి ఇవ్వలేదు. కఠిన ఆంక్షలు అమలుచేయడం ద్వారా వారిని కట్టడిచేయాలని చూస్తోంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో మిలియన్ మార్చ్ చేసి తీరుతామని ఉద్యోగ, ఉపాధ్యాయులు చెబుతున్నారు.

Jagan- Govt Employees
Jagan- Govt Employees

నేతలతో పని లేకుండా..
అయితే మిలియన్ మార్చ్ పై ఉద్యోగ సంఘాల నేతలెవరూ నోరు మెదపడం లేదు. ప్రస్తుతానికి వారు గుంభనంగా ఉన్నారు. ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారన్న ఆరోపణలైతే వినిపిస్తున్నాయి. అయితే సంఘాల నేతలతో పనిలేకుండా కార్యక్రమాన్ని చేసి తీరుతామని మాత్రం ఉపాధ్యాయులు, ఉద్యోగులు చెబుతున్నారు. అయితే ఉద్యోగుల కంటే ఉపాధ్యాయులే ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. ప్రభుత్వం చిన్నపాటి మేలు ప్రకటన చేస్తే ప్రజాప్రతినిధుల ఫొటోలకు పాలాభిషేకాలకు పురమాయించే నేతలు.. ఇప్పుడు ఉద్యోగ, ఉపాధ్యాయుల హక్కుల కోసం మిలియన్ మార్చ్ నకు పిలుపునిస్తే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నాయి. మిలియన్ మార్చ్ సక్సెస్ అయితే మాత్రం మిగతా వర్గాలు సైతం రోడ్డెక్కే అవకాశముంది. అందుకే ప్రయత్నాలను నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

Also Read:Jagan Chandrababu: పార్టీలోనూ కలవరా పుష్ప.. జగన్ , చంద్రబాబు ల హావభావాలు చూడాల్సిందే?

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular