Homeఆంధ్రప్రదేశ్‌Jagan Govt: ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన ఉద్యోగులు.. దెబ్బకు అత్యవసర కేబినెట్ భేటీ పెట్టిన జగన్..!

Jagan Govt: ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన ఉద్యోగులు.. దెబ్బకు అత్యవసర కేబినెట్ భేటీ పెట్టిన జగన్..!

Jagan Govt: జగన్ ప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగులు షాకిచ్చారు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన ఫిట్మెంట్, హెచ్‌ఆర్‌ఏ తగ్గిస్తూ తీసుకొచ్చిన జీవోపై ఉద్యోగుల సంఘం నేతలతో పాటు ఉద్యోగులు కూడా గుర్రుగా ఉన్నారు. సీఎం జగన్ పీఆర్సీ ప్రకటిస్తారని ఎంతో ఆశగా చూశామని.. తమ జీతాలు పెరుగుతాయని ఆశ పడితే ప్రస్తుతం వచ్చే వేతనాలను కూడా తగ్గించారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పీఆర్సీ కోసం తీసుకొచ్చిన జీవోను వెంటనే రద్దు చేసి హెచ్‌ఆర్‌ఏ అందరికీ ఆమోద యోగ్యంగా ఉండేలా నిర్ణయం తీసుకోవాలని వారు కోరుతున్నారు. లేనియెడల సమ్మెకు సిద్ధమని ప్రభుత్వానికి నోటీసులు కూడా జారీ చేశారు.

Jagan Govt
AP CM Jagan

ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం శుక్రవరాం అత్యవసరంగా మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహిస్తోంది. దీనిపై స్పష్టత కరువైంది. కానీ, గెజిటెడ్ ఉద్యోగుల సంఘం హైకోర్టులో పిటిషన్ వేసిందని తెలియడంతోనే సీఎం జగన్ కేబినెట్ భేటీకి ఆదేశించారని తెలిసింది. గెజిటెడ్ అధికారులు వేసిన పిటిషన్‌లో కీలకమైన అంశాలు ఉన్నాయి. విభజన చట్టంలోని 78(1 ) ప్రకారం తమకు వచ్చే జీతం, అలవెన్స్‌లు తగ్గించే అధికారం ప్రభుత్వానికి లేదని వారు ముక్త కంఠంతో వాదిస్తున్నారు.

Jagan Govt
AP Employees

Also Read: ఉద్యోగులతో జగన్ అనవసరంగా పెట్టుకుంటున్నాడా?
ప్రస్తుతం అలవెన్స్‌లతో పాటు ఐఆర్ కన్నా తక్కున ఫిట్‌మెంట్ ఖరారు చేయడం వల్ల జీతం తగ్గిపోతోంది. డీఏలను జీతంలో కలిపి పెరుగుతుందని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, డీఏలకు, బేసిక్ శాలరీ, అలవెన్స్‌లకు సంబంధం లేదు. వేతనం తగ్గించడం లేదని మొత్తం చేతికి వచ్చే శాలరీని కోర్టులో చూపించడానికి వీల్లేదు. ఈ విషయం కోర్టులో నిలబడదు.

అందుకే ఇప్పుడు అలవెన్స్‌ల తగ్గింపు కోర్టులో నిలబడదన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఈ కారణంగానే ప్రభుత్వం హడావుడిగా మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసిందని కొందరు అంటున్నారు. దీనిపై కోర్టులో విచారణ ప్రారంభం కాకముందే ఆర్డినెన్స్ తెచ్చి ఉద్యోగుల సమస్యకు పరిష్కారం చూపుతామని ప్రభుత్వ వర్గాల నుంచి లీకులు వస్తున్నాయి. ఇలాంటి సమస్యలు వస్తాయని సలహాదారులు చెబుతున్నా వినకుండా ఏపీ ప్రభుత్వం తనకు నచ్చింది చేస్తూ విమర్శలపాలవుతోంది.

Also Read: ఫిట్‌మెంట్ పంచాయితీ.. సమ్మెకు సై అంటున్న ఉద్యోగులు..?

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

3 COMMENTS

  1. […] Pradeep Raj:  గత రెండేళ్లుగా కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. స్టార్ హీరోలు అకాల మరణం పొందుతున్నారు. 2020 సంవత్సరంలో హీరో చిరంజీవి సర్జా హఠాన్మరణం పొందారు. ఆయన గుండెపోటు కారణంగా మరణించారు. చిరంజీవి సర్జా మరణం మరవక ముందే 2021లో పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మరణించారు. గుండెల్లో నొప్పిగా ఉందని ఆసుపత్రికి స్వయంగా బయలుదేరిన పునీత్ మార్గం మధ్యలో మరణించారు. కారు వరకూ కూడా నడిచి వచ్చిన పునీత్… ఐదు నిమిషాల వ్యవధిలో మరణించారు. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular