https://oktelugu.com/

ఏడేళ్లకు ఆనందం.. ఆంధ్రా టు తెలంగాణ

తెలంగాణ, ఏపీ విడిపోయిన ఏడేళ్లకు ఆంధ్రా ప్రభుత్వంలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులకు ఉపశమనం లభించింది. వారి ఇన్నేళ్ల నిరీక్షణకు ఏపీ సీఎం జగన్ తెరదించాడు. ఆరు సంవత్సరాలుగా తెలంగాణ, ఏపీ సర్కార్ మధ్య నలిగిపోయిన ఉద్యోగులంతా చివరకు పోరాటం చేసి.. రెండు తెలుగు రాష్ట్రాలను ఒప్పించి బదిలీ చేసుకున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేస్తున్న తెలంగాణకు చెందిన 711 మంది ఉద్యోగులు చివరకు తెలంగాణకు రానున్నారు. 711 మంది తెలంగాణ ఉద్యోగులను వారి సొంత రాష్ట్రానికి పంపించడానికి […]

Written By:
  • NARESH
  • , Updated On : March 31, 2021 / 09:13 PM IST
    Follow us on

    తెలంగాణ, ఏపీ విడిపోయిన ఏడేళ్లకు ఆంధ్రా ప్రభుత్వంలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులకు ఉపశమనం లభించింది. వారి ఇన్నేళ్ల నిరీక్షణకు ఏపీ సీఎం జగన్ తెరదించాడు. ఆరు సంవత్సరాలుగా తెలంగాణ, ఏపీ సర్కార్ మధ్య నలిగిపోయిన ఉద్యోగులంతా చివరకు పోరాటం చేసి.. రెండు తెలుగు రాష్ట్రాలను ఒప్పించి బదిలీ చేసుకున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేస్తున్న తెలంగాణకు చెందిన 711 మంది ఉద్యోగులు చివరకు తెలంగాణకు రానున్నారు.

    711 మంది తెలంగాణ ఉద్యోగులను వారి సొంత రాష్ట్రానికి పంపించడానికి ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం అనుమతి ఇచ్చారు. ఈ మేరకు ఉత్తర్వులు సాయంత్రం వెలువరించారు. ఉదయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేస్తున్న తెలంగాణ స్థానిక ఉద్యోగుల ప్రతినిధి బృందం ముఖ్యమంత్రిని క్యాంప్ కార్యాలయంలో కలిసింది. తెలంగాణలో విధుల్లో చేరడానికి వీలుగా ఆంధ్రప్రదేశ్ నుంచి రిలీవ్ చేయాలని సీఎం జగన్ ను అభ్యర్థించారు. వారి అభ్యర్థనకు ముఖ్యమంత్రి అంగీకరించి వెంటనే ఉత్తర్వులు జారీ చేయించారు.

    ఈనెల ప్రారంభంలో తెలంగాణ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తమ ఉద్యోగులు ఏపీలో ఉన్నారని.. వారిని పంపించాలని ఏపీ సీఎస్ ఆదిత్య నాథ్ దాస్ కు లేఖ రాశారు, తెలంగాణ ఉద్యోగులను త్వరగా స్వరాష్ట్రానికి రప్పించాలని కోరుతూ సోమేష్ కుమార్ అభ్యర్థించారు. ఈ లేఖపై ఆదిత్యనాథ్ దాస్ సానుకూలంగా స్పందించారు.

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ (జనరల్ అడ్మినిస్ట్రేషన్ (ఎస్ఆర్) విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ ఎల్ ప్రేమ్‌చంద్రరెడ్డికి రాసిన లేఖలో తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీ (ఫైనాన్స్) కె రామకృష్ణారావు మాట్లాడుతూ మూడవ, ఐదోతరగతి ఉద్యోగులను తిరిగి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. కమలనాథన్ కమిటీ రాష్ట్ర కేడర్ ఉద్యోగుల తుది కేటాయింపు సమయంలో తెలంగాణ ఉద్యోగులు తెలంగాణ రాష్ట్రాన్ని ఎంపిక చేసిన దానికి విరుద్ధంగా ఏపీకి కేటాయించారని తెలిపారు. ఈ లేఖతో సుమారు 700 మంది ఉద్యోగుల జాబితాను కూడా జతపరిచి పంపించారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం వారందరినీ విడుదల చేయడంతో ఉద్యోగులకు ఉపశమనం లభించింది.

    ప్రభుత్వ చొరవతో 700 మంది మూడో,నాలుగో తరగి ఉద్యోగులు స్వరాష్ట్రం తెలంగాణకు రానున్నారు. మూడో తరగతి కింద డ్రైవర్లు, రికార్డ్ అసిస్టెంట్లు, లిఫ్ట్ ఆపరేటర్లు మరియు క్యాషియర్లు మరియు 4వ తరగతి లోపు అటెండర్లు, జమేధర్ మరియు క్లర్క్ లు ఆంధ్రాలో పనిచేస్తున్నారు. కారుణ్య ప్రాతిపదికన ఉద్యోగం పొందిన తరువాత ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ నుండి ఉద్యోగులను తిరిగి తీసుకురావడానికి ప్రణాళికలు రూపొందించినట్లు తెలంగాణ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.