ప్రజలకు శుభవార్త.. ఆధార్ పాన్ లింక్ గడువు పొడిగింపు..?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఆధార్ పాన్ లింక్ ను ఇప్పటికే పలుమార్లు పొడిగించిన సంగతి తెలిసిందే. కరోనా విజృంభణ నేపథ్యంలో కేంద్రం తాజాగా మరోసారి ఆధార్ పాన్ లింక్ గడువును పొడిగించింది. ఇప్పటివరకు ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ లింక్ చేసుకోని వారికి ఇది శుభవార్త అనే చెప్పాలి. కేంద్రం గడువు పొడిగించకపోతే ఆధార్ కార్డ్ తో పాన్ కార్డ్ లింక్ చేసుకోని వారు 1,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు జరిమానా చెల్లించాల్సి […]

Written By: Navya, Updated On : April 1, 2021 11:29 am
Follow us on

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఆధార్ పాన్ లింక్ ను ఇప్పటికే పలుమార్లు పొడిగించిన సంగతి తెలిసిందే. కరోనా విజృంభణ నేపథ్యంలో కేంద్రం తాజాగా మరోసారి ఆధార్ పాన్ లింక్ గడువును పొడిగించింది. ఇప్పటివరకు ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ లింక్ చేసుకోని వారికి ఇది శుభవార్త అనే చెప్పాలి. కేంద్రం గడువు పొడిగించకపోతే ఆధార్ కార్డ్ తో పాన్ కార్డ్ లింక్ చేసుకోని వారు 1,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు జరిమానా చెల్లించాల్సి ఉండేది.

Also Read: మధ్యతరగతి ప్రజలకు శుభవార్త చెప్పిన మోదీ సర్కార్..?

పాన్ ఆధార్ లింక్ గడువును పొడిగించడంపై ప్రజల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పదేపదే గడువును పొడిగిస్తూ కేంద్రం పాన్ ఆధార్ లింక్ విషయంలో తీసుకుంటున్న నిర్ణయం సరైన నిర్ణయం కాదని కొంతమంది అభిప్రాయపడుతుంటే మరి కొందరు మాత్రం కరోనా పరిస్థితుల నేపథ్యంలో పాన్ ఆధార్ లింక్ చేసుకోని వారికి కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల మేలు జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు.

Also Read: సామాన్యులకు శుభవార్త.. భారీగా తగ్గనున్న సిలిండర్ ధరలు..?

ఆధార్ తో పాన్ కార్డును గడువు లోగా లింక్ చేసుకోకపోతే ఆ పాన్ కార్డు చెలుబాటు కాదు. లోక్ సభ ఇప్పటికే ఆధార్ పాన్ కార్డ్ అనుసంధానం చేసుకోని వారిపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు చర్యలు తీసుకోవడానికి 234 హెచ్ ద్వారా వీలు కల్పిస్తోంది. ఆధార్ తో లింక్ చేసుకోకపోవడం వల్ల పాన్ కార్డ్ పని చేయని పక్షంలో ఫైనాన్షియల్ లావాదేవీలు జరగవు. పాన్ కార్డ్ లేకపోతే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఇబ్బందులు ఎదురవుతాయి.

పాన్ కార్డ్ లేని వారు ఐటీ రిటర్న్స్ ను దాఖలు చేయడం సాధ్యం కాదు. పాన్ కార్డ్ లేకుండా బ్యాంక్ అకౌంట్ తెరిచినా టీడీఎస్ ఎక్కువ మొత్తం కట్ అయ్యే అవకాశం ఉండటంతో పాన్ ఆధార్ కార్డులను లింక్ చేసుకుంటే మంచిది.