https://oktelugu.com/

Elon musk : ఆర్థిక నేరగాడి మరో సంచలన లేఖ.. ఈసారి ప్రపంచ కుబేరుడికే.. ఆఫర్‌ ఎంతిచ్చాడో తెలుసా?

Elon musk : భారత ఆర్థిక నేరగాడు సుఖేశ్‌ చంద్రశేకర్‌(Sukhesh Chandrashekar). ఇతని గురించి చాలా మందికి తెలియదు. ప్రస్తుతం ఢిల్లీలోని మరోండి జైల్లో ఉన్నాడు.

Written By: , Updated On : February 26, 2025 / 02:40 PM IST
Elon musk

Elon musk

Follow us on

Elon musk : భారత ఆర్థిక నేరగాడు సుఖేశ్‌ చంద్రశేకర్‌(Sukhesh Chandrashekar). ఇతని గురించి చాలా మందికి తెలియదు. ప్రస్తుతం ఢిల్లీలోని మరోండి జైల్లో ఉన్నాడు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌(BRS) ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఆయన పేరిట లేఖలు బయటకు వచ్చాయి. జైల్లో కూడా అతను రాజభోగాలు అనుభవిస్తున్న వీడియోలూ వచ్చాయి. ఇప్పుడు ఏకంగా ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు లేఖ రాశాడు.

దేశంలో ఆర్థిక నేరాలకు పాల్పడి జైలుశిక్ష అనుభవిస్తున్నాడు సుఖేష్‌ చంద్రశేఖర్‌. గతంలో పలు అంశాలపై జైలు నుంచే లేఖలు రాసిన సుఖేష్‌ ఇపుపడు ఏకంగా ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌(Elan Musk)కు లేఖ రాశాడు. ఈ లేకలో బిజినెస్‌ డీల్‌ గురించి రాసుకొచ్చాడు. మస్క్‌ సీఈవోగా ఉన్న ఎక్స్‌ కంపెనీలో 2 లక్షల బిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెడతానని ఆఫర్‌ ఇచ్చాడు. డోజ్‌(Doze)కు నాయకత్వం వహిస్తునందుకు మస్క్‌ను అభినందించాడు. గతంలో టెస్లా స్టాక్స్‌లో పెట్టుబడి పెడితే లాభాలు వచ్చాయని పేర్కొన్నాడు. ఇటీవల తన ప్రియురాలు జాక్వెలిన్‌ పెర్నాండేజ్‌ పుట్టిన రోజు కూడా సుఖేష్‌ జైలు నుంచి లవ్‌ లెటర్‌ రాశాడు.

Also Read : ఓ ఎలన్ మస్కూ.. ఎన్ని దుకాణాలు తెరుస్తావు స్వామీ.. ఎన్ని విత్తనాలు వేసావూ 

తాజాగా మస్క్‌కు ఇలా..
ఇక తాజాగా ఎక్స్, టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌కే లేఖ రాశాడు. అందులో ఎలాన్‌ మస్క్‌ నా మనిషి అని పేర్కొన్నాడు. అంతేకాదు యూఎస్‌ ప్రభుత్వం కొత్తగా సృష్టించిన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియనీస(డోజ్‌)కి నాయకత్వవం వహిస్తున్నందుకు మస్క్‌ను అభినందించాడు షుఖేష్‌ చంద్రశేఖర్‌. ఎక్స్‌ కంపెనీలో 2 బిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. ఎక్స్‌ అతనికి ఇష్టమైన సోషల్‌ మీడియా ప్లాట్‌పాంగా చెప్పుకొచ్చాడు. సుఖేష్‌ రాసిన లేఖలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను పెద్దన్నయ్య అని పేర్కొన్నాడు. ట్రంప్, ఎలాన్‌ మస్క్‌పై అతను ప్రశంసలు కురిపించాడు.

టెస్లా స్టాక్స్‌లో పెట్టుబడి..
ఇదిలా ఉంటే సుఖేష్‌ గతంలో టెస్లా స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టాడని లేఖలో పేర్కొన్నాడు. ఇందుకు భారీగా లాభాలు వచ్చాయని తెలిపాడు. ప్రస్తుతం ఎక్స్‌ కంపెనీలో కూడా భారీగా పెట్టుబడులు పెట్టడానికి రెడీ అని పేర్కొన్నాడు. తన ఆఫర్‌ను అంగీకరించాలని లేఖలో కోరాడు. జైలు నుంచి ఇలాంటి బహిరంగ ప్రకటనలు, లేఖలు రాయడం సుఖేష్‌కు ఇది మొదటిసారి కాదు. గతంలో బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌కు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కే జ్రీవాల్‌కు, ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు నాయుడుకు, కేసీఆర్‌ తనయ కవితకు, తనయుడు కేటీఆర్‌కు లేఖలు శారాడు.