Elon Musk Tweet- Buying Manchester United: ప్రపంచ కుభేరుడు ఎలెన్ మస్క్ మరో సంచలన ప్రకటన చేశాడు. మొన్నటి వరకు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సోషల్ మీడియా ట్విట్టర్ ను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటన చేశాడు. దాని కోసం నిధులు సేకరించాడు. చివరకు ఏదో కారణం చెప్పి దాన్ని కొనుగోలును ఆపేశాడు. ఈ దెబ్బతో ట్విట్టర్ షేర్లు ఢమాల్ అయిపోయి దాని బ్రాండ్ విలువ పడిపోయింది. నష్టాలు వచ్చాయి. తాజాగా ఎలెన్ మస్క్ ఫుట్ బాల్ క్రీడపై కన్నేసినట్లు తెలుస్తోంది. ఇంగ్లీష్ ఫుట్ బాల్ క్లబ్ ‘మాంచెస్టర్ యూనైటెడ్’ ను సొంతం చేసుకోబోతున్నానని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నాడు. త్వరలో ఫుట్ బాల్ ను కొనబోతున్నా.. అని ట్విట్టర్లో చేసిన మెసేజ్ దుమారం రేపుతోంది. అయితే ఈ క్లబ్ యజమాని అమెరికన్ గ్లేజర్ కుటుంబం నుంచి ఎలాంటి రిప్లై రాలేదు. కానీ ఆయన ట్వీట్ కు మాత్రం ఘాటుగా రిప్లైస్ వస్తున్నాయి.
ప్రపంచంలో అత్యుత్తమ ఫుట్ బాల్ క్లబ్బుల్లో ‘మాంచెస్టర్ యునైటెడ్’ఒకటి. ఇది ఏకంగా 20 సార్లు ఇంగ్లాండ్ చాంపియన్ గా నిలిచి రికార్డు సృష్టించింది. మూడుసార్లు యూరోపియన్ కప్ ను గెలుచుకుంది. దీంతో క్లబ్ మార్కెట్ విలువ వేగంగా పెరిగింది. మంగళవారం నాటిని ఈ క్లబ్ విలువ 2.08 బిలియన్ డాలర్లుగా ఉంది. 2005లో దీనిని అమెరికాకు చెందిన గ్లేజర్ కుటుంబం 790 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. అయితే కొంతకాలంగా క్లబ్ ఆటతీరు నిరాశజనంగా ఉంది. దీంతో ఈ క్లబ్ కు వ్యతిరేకంగా ఆందోళనలు చేపడుతున్నారు.
Also Read: China Jackal: ఈ చైనా నక్క పులి కంటే బలమైంది
గతేడాది ఇవి తీవ్రం కావడంతో గ్లేజర్స్ యాజమాన్యం నుంచి తప్పుకోవాలని ఫుట్ బాల్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఎలెన్ మస్క్ సంచలన ట్వీట్ చేశాడు. ఆయన సొంత ట్వీట్ ద్వారా ‘నేను రిపబ్లికన్ పార్టీకి మద్దతిస్తున్నాను.. ’ అంటూ ట్వీట్ చేశారు. ఆ తరువాత మరో ట్విట్ ద్వారా ‘నేను మాంచెస్టర్ యునైటెడ్ ను కొనుగోలు చేస్తున్నాను.. మీకు స్వాగతం’ అంటూ ట్వీట్ చేశారు. అయితే ఎప్పటిలాగే ఎలెన్ మస్క్ కు వ్యతిరేకంగా ట్వీట్లు మొదలయ్యాయి. అయితే ఎలెన్ మస్క్ వివాదాస్పద ట్వీట్ చేసిన ‘మాంచెస్టర్’ యాజమాని గ్లేజర్ నుంచి ఎటువంటి స్పందన లేదు. అంతేకాకుండా ఎలెన్ మస్క్ ఫుట్ బాల్ క్లబ్ ను ఎలా కొనుగోలు చేస్తున్నారో తెలపలేదు.
అయితే కొందరు ఫుట్ బాల్ ఫ్యాన్స్ ‘మాంచెస్టర్’ను కొనుగోలు చేయాలని కోరడంతోనే ఎలెన్ మస్క్ ఈ ప్రకటన చేశారని సోషల్ మీడియా వేదికగా చర్చ సాగుతోంది. అయితే ఎలెన్ మస్క్ ట్వీట్ పై రకరకాల వార్తలు వస్తున్నాయి. ఇది సరదా కోసమే ట్వీట్ చేశారని కొందరు అంటుంటే.. మరికొందరు క్లబ్ ను కొనే సత్తా మస్క్ కు ఉందని వాదిస్తున్నారు. అయితే గతంలో ట్వీట్టర్ కొనుగోలు విషయంలో ఎలెన్ మస్క్ ప్రకటన చేసిన తరువాత ఆ తరువా వెనక్కి తగ్గాడు. ఇప్పుడు కూడా అలాగే చేస్తాడని అంటున్నారు. మరి ఈ కుభేరుడు ఆ తరువాత ఎలాంటి ప్రకటన చేస్తారో వేచి చూద్దాం.
Also Read: Teachers- YCP Govt: ఏపీలో ఉపాధ్యాయుల సెల్ డౌన్.. వైసీపీ సర్కారుకు షాక్