Elon Musk : అమెరికన్ బిలియనీర్, ఎక్స్ యజమాని ఎలోన్ మస్క్ ప్లాట్‌ఫారమ్‌పై తన పేరును మార్చుకున్నారు. ఆయన ఎక్స్ లో తన పేరును కెకియస్ మాక్సిమస్‌గా మార్చుకున్నాడు. అతను తన ప్రొఫైల్ పిక్చర్ నుండి తన ఫోటోను తీసివేసి, దాని స్థానంలో ‘పెప్ ది ఫ్రాగ్’ మీమ్ ఫోటోను అప్ లోడ్ చేశాడు. ఇందులో పెప్ యోధుడిలా దుస్తులు ధరించి, చేతిలో గేమ్ జాయ్‌స్టిక్ పట్టుకుని ఉన్నారు. ఇంతకుముందు మస్క్ ట్విట్టర్ పేరును ఎక్స్ గా మార్చారు. మస్క్ తన సోషల్ మీడియా పోస్ట్‌ల కారణంగా తరచూ వార్తల ముఖ్యాంశాల్లో నిలిచారు.
కెకియస్ మాక్సిమస్ అంటే ఏమిటి?
Kekius Maximus (KEKIUS) ఒక మెమెకోయిన్, క్రిప్టోకరెన్సీ మార్కెట్‌లో పెద్ద పేరు. గత కొద్ది రోజులుగా దీనికి సంబంధించిన కార్యకలాపాలు పెరిగి ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది. దీని 24-గంటల ట్రేడింగ్ వాల్యూమ్ 2,734,948డాలర్లకి పెరిగింది. పెట్టుబడిదారులు దానిపై ఆసక్తి చూపుతున్నారు. డిసెంబర్ 27న గరిష్ట స్థాయికి చేరుకుంది. కెకియస్ మాక్సిమస్ లో తాజాగా భారీ జంప్ కనిపిస్తోంది. అయితే, ఫ్లాట్ ఫారమ్ పై తన పేరును ఎందుకు మార్చుకున్నాడో మస్క్ ఇంకా వివరించలేదు.
This will be priceless https://t.co/YoX4JEDu5l
— Kekius Maximus (@elonmusk) December 31, 2024
మీమ్ కాయిన్స్ అంటే ఏమిటి?
మీమ్ కాయిన్స్ అనేది ఇంటర్నెట్‌లో జరుగుతున్న ట్రెండ్‌లు లేదా మీమ్‌ల ద్వారా ప్రేరణ పొందిన క్రిప్టోకరెన్సీ. కొన్ని సంవత్సరాల క్రితం కూడా మస్క్ షిబా ఇను ప్రేరేపిత డాడ్జ్‌కాయిన్ గురించి నిరంతరం ట్వీట్ చేయడం ద్వారా చాలా ప్రజాదరణ పొందేలా చేశారు.
ఎలోన్ మస్క్ ప్రొఫైల్ పేరు, ప్రొఫైల్ ఫోటోను మార్చినప్పటికీ, అతని ప్రొఫైల్ URL ఇప్పటికీ x.com/elon-muskగా ఉంది. మస్క్ ఇటీవల పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించిన క్రిప్టోకరెన్సీ “కేకియస్ మాక్సిమస్”లో పోస్ట్ చేయడం ప్రారంభించారు. మస్క్ చేసిన ఈ చర్య అతని అనుచరులను దిగ్భ్రాంతికి గురిచేయడమే కాకుండా క్రిప్టో పెట్టుబడిదారులు, విశ్లేషకుల మధ్య చర్చకు దారితీసింది.