
నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో వెలుగుచూసిన కరోనా ఆయుర్వేద మందు తయారీదారుడు ఆనందయ్యకు ఏపీ సర్కార్ భద్రత పెంచింది. ఆయనకు తాజాగా పోలీసులు రక్షణ కల్పిస్తున్నారు. ఒక ఎస్ఐ, నలుగురు పోలీసులతో భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.
ఆనందయ్య కరోనా మందు పనిచేస్తుండడం.. జనాలు పోటెత్తుతుండడం.. దీనిపై ఏపీ ప్రభుత్వం, ఐసీఎంఆర్ విచారణ జరుపుతోంది. ఈ మందు హానికరం కాదని ఏపీ ఆయుష్ శాఖ తెలిపింది.
ఈ క్రమంలోనే వైసీపీ సర్వేపల్లి ఎమ్మెల్యే గోవర్ధన్ రెడ్డి నెల్లూరు పోలీసులకు ఆనందయ్యకు భద్రత కల్పించాలని విన్నవించారు. ప్రభుత్వం దీనికి స్పందించింది.
ఆనందయ్యను ఆయన ఇంటి నుంచి ఖాళీ చేయించి నెల్లూరు నగరంలోని సీవీఆర్ అకాడమీలోని ఆరో బ్లాక్ లో పోలీసులు ఉంచారు. ఆనందయ్యతోపాటు ఆయన కుమారుడు, సోదరుడి కుమారుడు కూడా పోలీస్ రక్షణలో ఉన్నాడు.
ఫార్మా మాఫియా నుంచి ఆనందయ్యకు ప్రమాదం పొంచి ఉందన్న ఆందోళనల నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం స్పందించి రక్షణ కల్పించినట్టు తెలుస్తోంది.