E.D- MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాం అనుకున్నట్టు తెలుగు రాష్ట్రాలను షేక్ చేయడం ఖాయమని అంటున్నారు. ఈ లిక్కర్ స్కాంలో తొలుత ఆరోపణలు వచ్చింది తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు కవితపైనే. బీజేపీ నేతల ఆరోపణలు తోసిపుచ్చిన ఆమె కోర్టులో ఆరోపించిన వారిపై కేసులు కూడా వేశారు. ఇక ఏపీలోని అధికార వైసీపీ నేతలకు ఇందులో ప్రమేయం ఉందని ప్రచారం సాగింది.
అనుకున్నట్టు కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తెలుగు రాష్ట్రాల్లో దాడులు చేసినట్టు తెలిసింది. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా 40 చోట్ల మరోసారి సోదాలు నిర్వహిస్తోంది. తాజాగా ఏపీలో అధికార వైసీపికి చెందిన నెల్లూరు ఎంపీతోపాటు హైదరాబాద్ లో కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత ఆడిటర్ బుచ్చిబాబు ఇంట్లో సోదాలు నిర్వహించినట్టు సమాచారం. ఈడీ నోటీసులు కూడా జారీ చేసిందని.. కేసీఆర్ కూతురు ఈ స్కాంలో ఇరుక్కుంటుందన్న ప్రచారం సాగుతోంది.
ఇక ఏపీలోనూ ఈడీ దాడులు చేసింది. నెల్లూరులోని గాంధీ బొమ్మ సెంటర్ సమీపంలో లోని పటేల్ రోడ్డు లోని వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కార్యాలయం లో ఈడి సోదాలు కొనసాగుతున్నాయి.
నెల్లూరులో ఈడి(ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) సోదాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడి హైదరాబాద్ తో సహా దేశవ్యాప్తంగా 40 చోట్ల సోదాలు నిర్వస్తున్నారు. దీనిలో భాగంగా నెల్లూరు నగరం లోవైకాపా ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కార్యాలయం లోనూ ఉదయం నుంచి అధికారులు సోదాలు నిర్వహిస్తూ, కార్యాలయ సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు.ఇంట్లోంచి ఎవరినీ బయటికి రానీయ కుండా బయటి వారిని లోపలకు పోకుండా కటినంగా సోదాలు నిర్వహిస్తున్నారు.
ఈ పరిణామం అధికారంలో ఉన్న టీఆర్ఎస్, వైసీపీకి మింగుడు పడని వ్యవహారంగా మారింది. కేంద్రంలోని మోడీ సర్కార్ లిక్కర్ స్కాం అంతుచూడడానికే రెడీ అయ్యింది. ఇక్కడ కేసీఆర్, అక్కడ వైసీపీని టార్గెట్ చేసిందని అంటున్నారు.