Early Elections in Telangana: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రానున్నాయా..? అందుకు పార్టీలు కూడా సిద్ధమవుతున్నాయా..? బీజేపీ దూకుడుకు కారణం అదేనా..? ఇప్పుడు కాంగ్రెస్ కూడా అందుకు సన్నద్ధమవుతుందా.? అంటే అవుననే సమాధానం వస్తున్నాయి. గత కొన్ని నెలలుగా తెలంగాణలో రాజకీయ వేడి రాజుకుంది. అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలు ప్రత్యేక కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తున్నాయి. ప్రభుత్వ పథకాలతో అధికార టీఆర్ఎస్ ఆకట్టుకోగా.. పాదయాత్రతో బీజేపీ ప్రజలకు చేరువవుతోంది. మరోవైపు రచ్చ బండ కార్యక్రమమంటూ కాంగ్రెస్ ఇప్పటికే గ్రామగ్రామాన తిరుగుతోంది. ముఖ్యంగా రైతు డిక్లరేషన్ ను పరిచయం చేస్తూ వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నట్లు సంకేతాలు ఇచ్చారు.
తెలంగాణతో పాటు కేంద్రంలోనూ అధికారంలోకి రావాలనే లక్ష్యంతో టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఇప్పటికే దేశ వ్యాప్త పర్యటన చేస్తున్నారు. ఎన్డీఏ వ్యతిరేక సీఎంలను కలుస్తూ మద్దతు కోరుతున్నారు. బీజేపీ, కాంగ్రేసేతర కూటమి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలోనూ అభివృద్ధి పనుల స్పీడును పెంచుతున్నారు. వచ్చే రెండేళ్లలో అధికారంలోకి వచ్చిన తాము ఏం చేశామో ప్రజలకు చూపించాలన్న ఉద్దేశంతో పెండింగ్ పనులను పూర్తి చేయిస్తున్నారు. మరోవైపు మంత్రులు జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. ఎక్కడా రిమార్క్ రాకుండా చూసుకుంటున్నారు. అయితే పంచాయతీల్లో బిల్లుల సమస్య ఏర్పడడంతో ఇటీవల ఆ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బిల్లులను వెంటనే చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అలాగే బీమా సౌకర్యం కల్పిస్తామన్నారు. దీంతో వచ్చే ఎన్నికలకు సిద్ధంగా ఉండాలన్నట్లు పార్టీ నాయకులు సమాయత్తమవుతున్నారు.
Also Read: Pawan Kalyan Emotional : ఆ వీడియో చూసి ఎమోషనల్ అయిన పవన్ కళ్యాణ్
ఇక ప్రధాన ప్రతిపక్షమని చెప్పుకుంటున్న బీజేపీ తనదైన శైలిలో దూకుడు పెంచింది. దొరికిన ప్రతీ అవకాశాలన్ని క్యాష్ చేసుకుంటోంది. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు రకరకాల ఆరోపణలు చేస్తోంది. ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పటికే పాదయాత్ర చేసి ప్రజల్లోకి చొచ్చుకుపోయారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులను వివరిస్తూ ఆకట్టుకుంటున్నారు. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తమ పార్టీయేనని చెబుతూ వస్తున్నారు. ఇక మోదీ, అమిత్ షా లాంటి నాయకులను తెలంగాణలో దించుతూ పార్టీలో జోష్ పెంచుతున్నారు. ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలంటూ సంకేతాలిస్తున్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడానికి తామే కారణమని కాంగ్రెస్ నాయకులు గ్రామ గ్రామాన తిరుగుతున్నారు. ‘రచ్చబండ’ కార్యక్రమం ద్వారా తెలంగాణలోని కాంగ్రెస్ నాయకులంతా తమ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. పంచాయతీల్లో అభివృద్ధి పనులు చేసిన సర్పంచ్ లకు బిల్లులు చెల్లించలేని ప్రభుత్వాన్ని గద్దె దించాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారుస్తున్న కేసీఆర్ అసలు రూపం బయటపడుతోందన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. ఇప్పుడు కూడా రైతులకు ప్రత్యేకంగా పథకాలు ప్రవేశపెడుతామంటున్నారు. రైతులకు ఎకరాకు రూ.15 వేలు ఇస్తామన్నారు. అంతేకాకుండా కౌలు రైతులకు కూడా సాయం చేస్తామని చెప్పారు. అంతేకాకుండా రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్నారు. రాబోయే ఆరు నెలల్లో అసెంబ్లీ రద్దయ్యే అవకాశం ఉందని చెప్పడం సంచలనంగా మారింది.
మరోవైపు బీఎస్పీ, వైఎస్సార్సీటీ పార్టీలు కూడా పాదయాత్రలు చేస్తూ ఊరూరా తిరుగుతున్నారు. దీంతో తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావచ్చొనే సంకేతాలు అందరికి అందయా..? అనే చర్చ సాగుతోంది. 2018లో జరిగిన ఎన్నికల్లో ఈసారి 2023లో నిర్వహించాల్సి ఉంది. అయితే అంతకంటే ముందే అంటే ఈ సంక్రాంతి వరకు ఎన్నికల ఏర్పాట్లు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సీఎం కేసీఆర్ ముందస్తు కోసం ఎన్నికల కమిషన్ ను సంప్రదించగా సానుకూల సంకేతాలే వచ్చాయంటున్నారు. అయితే కేసీఆర్ తన మనసులోని మాట బయటపెట్టకున్నా.. ఆయన తీరు చూస్తే ముందస్తు ఖాయమనే చర్చ సాగుతోంది.
Also Read:Minister KTR: గ్యాంగ్ రేప్ పై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు