https://oktelugu.com/

Megastar Chiranjeevi: డీ గ్లామర్ లుక్ లో మెగాస్టార్.. ఆ డైరెక్టర్ కి కలిసొచ్చేలానే ఉంది !

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నాడు. కొరటాల శివతో ఆచార్య, మెహర్ రమేష్ తో ‘భోళా శంకర్’, మోహన్ రాజాతో ‘గాడ్ ఫాదర్’, అలాగే బాబీతో మరో సినిమా, వెంకీ కుడుములతో మరో సినిమా.. ఇలా చిరు లిస్ట్ చాలా పెద్దగా ఉంది. అయితే, ఈ సినిమాల మొత్తంలో ఓ సినిమా పై మాత్రం ఇండస్ట్రీలో తెగ చర్చ జరుగుతుంది. ఆ సినిమానే ‘వేదాళం’ రీమేక్ ‘భోళా శంకర్’. ఎందుకంటే.. మెగాస్టార్ తన […]

Written By:
  • Shiva
  • , Updated On : December 18, 2021 / 01:10 PM IST
    Follow us on

    Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నాడు. కొరటాల శివతో ఆచార్య, మెహర్ రమేష్ తో ‘భోళా శంకర్’, మోహన్ రాజాతో ‘గాడ్ ఫాదర్’, అలాగే బాబీతో మరో సినిమా, వెంకీ కుడుములతో మరో సినిమా.. ఇలా చిరు లిస్ట్ చాలా పెద్దగా ఉంది. అయితే, ఈ సినిమాల మొత్తంలో ఓ సినిమా పై మాత్రం ఇండస్ట్రీలో తెగ చర్చ జరుగుతుంది.

    Megastar Chiranjeevi

    ఆ సినిమానే ‘వేదాళం’ రీమేక్ ‘భోళా శంకర్’. ఎందుకంటే.. మెగాస్టార్ తన కెరీర్ లోనే ‘భోళా శంకర్’ కోసం పూర్తి డిఫరెంట్ క్యారెక్టర్ లో నటించబోతున్నాడు. అలాగే విభిన్న లుక్ లో కనిపించబోతున్నాడు. ఆ మధ్య చిరు పూర్తి గుండు లుక్ ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ లుక్ ఈ సినిమాలోనిదే. అయితే, ఆ లుక్ దాదాపు ముప్పై నిముషాలు ఉంటుందట.

    నిజంగా ఇది షాకింగ్ విషయమే. మెగాస్టార్ డీ గ్లామర్ లుక్ లో.. అదీ ఒక గుండు లుక్ లో దాదాపు ఆరు ఏడు సీన్స్ లో కనిపించడం అంటే మామూలు విషయం కాదు. అలాగే ఈ సినిమాలో మరో క్రేజీ లుక్ కూడా ఉందట. ఆ లుక్ పూర్తి డిఫరెంట్ గా ఉంటుందట. అందుకే, ప్రస్తుతం ఈ సినిమా పై సినీ జనాల్లో కూడా ఆసక్తి పెరిగింది. అసలు మెహ‌ర్ ర‌మేష్ ఈ సినిమా స్క్రిప్ట్ లో ఎలాంటి మార్పులు చేశాడో అని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

    మెహ‌ర్ ర‌మేష్ ఈ సినిమా స్క్రిప్ట్ కోసం దాదాపు రెండు సంవత్సరాలు కష్టపడ్డాడు. అందుకే, స్క్రిప్ట్ బాగా వచ్చింది. మెగాస్టార్ కి కూడా బాగా నచ్చింది. ముఖ్యంగా కథలోని మెయిన్ ఎమోషన్స్ ను మెహర్ రమేష్ అద్భుతంగా పట్టుకున్నాడట. ఎంతైనా మెహర్ రమేష్ లో మంచి షార్ప్ డైరెక్టర్ ఉన్నాడు. పైగా హీరోలను స్టైలిష్ గా చూపించడంలో మెహర్ రమేష్ కి ప్రత్యేక టాలెంట్ ఉంది.

    Also Read: Pushpa: పుష్ప ఓటీటీ స్ట్రీమింగ్​కు​ డేట్​ ఫిక్స్​.. ఎప్పుడో తెలుసా?

    కాకపోతే, వరుస ప్లాప్ ల దెబ్బకు మెహర్ రమేష్ సినిమా చేసి దాదాపు పది సంవత్సరాలు అయిపోతుంది. అయితే, ఈ గ్యాప్ లో మెహర్ రమేష్ మాత్రం తనలోని డైరెక్షన్ స్కిల్స్ ను పెంచుకోవడానికి చాలా హార్డ్ వర్క్ చేశాడట. అందుకే ఈ సారి ఆ హార్డ్ వర్క్ వర్కౌట్ అయ్యేలానే ఉంది.

    Also Read: Adivi Sesh: పెళ్లివైపు గాలి మళ్లిందంటున్న అడవి శేష్​.. వచ్చే ఏడాదిలోనే వివాహం?

    Tags