https://oktelugu.com/

దేవాలయాల్లో e-పూజలు!

కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించే చర్యలలో భాగంగా మే 3 వరకు లాక్ డౌన్ ప్రకటించడంతో దేవాలయాల్లోకి భక్తులకు అనుమతించడం లేదు. ఈ నేపధ్యంలో దేవాదాయ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల కోరిక మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రధాన దేవాలయాల్లో ‘ఈ-పూజ’లను నిర్వహించే విధంగా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఆన్ లైన్ లో బుక్ చేసుకున్న భక్తులకు ఆయా దేవస్థానాల్లో భక్తుల గోత్ర నామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలు ఇంటికే పంపుతారు. ఈ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 15, 2020 / 05:41 PM IST
    Follow us on


    కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించే చర్యలలో భాగంగా మే 3 వరకు లాక్ డౌన్ ప్రకటించడంతో దేవాలయాల్లోకి భక్తులకు అనుమతించడం లేదు. ఈ నేపధ్యంలో దేవాదాయ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల కోరిక మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రధాన దేవాలయాల్లో ‘ఈ-పూజ’లను నిర్వహించే విధంగా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఆన్ లైన్ లో బుక్ చేసుకున్న భక్తులకు ఆయా దేవస్థానాల్లో భక్తుల గోత్ర నామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలు ఇంటికే పంపుతారు. ఈ విధానంపై ఆ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అమరావతిలోని సచివాలయంలో అధికారులతో సమీక్షించారు. భక్తులు ఈ పూజలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. ఆయా దేవాలయాల్లో నిత్యకైంకర్యాలు పూజలు యధావిధిగా కొనసాగుతున్నాయని తెలిపారు.

    రాష్ట్రంలోని అన్ని ప్రధాన దేవాలయాల్లో కిచెన్ కెపాసిటీ మరియు ఆర్థిక వనరుల అనుమతి మేరకు నిరుపేదలకు అన్నప్రసాద పంపిణీపై ఆయా జిల్లా కలెక్టర్ తో చర్చించి, అవసరం మేరకు వారి ద్వారా అన్నప్రసాద పంపిణీ చేయాలని దేవదాయ శాఖ అధికారులకు మంత్రి సూచించారు.

    అన్ని ప్రధాన దేవాలయాల్లో మరియు ఇతర చోట్ల సాంప్రదాయం ప్రకారం, సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ చేపట్టవలసిన అభివృద్ధి పనులను పూర్తి చేయాలన్నారు. మే నెల 3 తర్వాత అన్ని ప్రధాన దేవాలయాల ప్రవేశ ద్వారాల వద్ద డిస్ఇన్ఫెక్షన్ టన్నెల్ ను మరియు థర్మల్ స్కాన్ ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. కాన కాణిపాక దేవాలయం మరియు విజయవాడ దేవాలయాల అభివృద్ధి పనులపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారం పై కఠిన చర్యలు తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు.