Homeజాతీయ వార్తలుTamil Nadu Elections: ద్రవిడ పార్టీలను భయపెడుతున్న దురంధర్‌.. ఎన్నికల వేళ టెన్షన్‌!

Tamil Nadu Elections: ద్రవిడ పార్టీలను భయపెడుతున్న దురంధర్‌.. ఎన్నికల వేళ టెన్షన్‌!

Tamil Nadu Elections: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటీఫికేషన్‌ ఇచ్చింది. ఇందులో మూడు రాష్ట్రాలు కేరళ, పాండిచ్చేరి, అస్సాం రాష్ట్రల ఎన్నికలు ముగిశాయి. తమిళనాడు, పశ్చిమబెంగాల్‌ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ రెండు రాష్ట్రాలు చాలా కీలకంగా మారాయి. బెంగాల్‌లో పాగా వేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇక తమిళనలడులో అన్నాడీఎంకేతో కలిసి పోటీ చేస్తోంది. ఇక్కడ నామినేషన్లు పూర్తయ్యాక అన్ని పార్టీలు ప్రచారంపై దృష్టి పెట్టాయి. డీఎంకే, ఏఐఏడీఎంకే లాంటి ద్రవిడ పార్టీలు ఓటర్లను ఆకర్షించేందుకు వ్యూహాలు రూపొందిస్తుంటే, హిందీ సినిమా ’దురంధర్‌’ ద్రవిడవాద పార్టీను భయపెడుతోంది.

దురంధర్‌ను అడ్డుకునే ప్రయత్నం..
దురంధర్‌ సినిమా అంటే పాకిస్తాన్‌ భయపడాలి. ఇందులో భారత దేశభక్తి, పాకిస్తాన్‌లో మన ఏజెంట్లు చేస్తున్న ఆపరేషన్లతో ఇప్పటికే పాకిస్తాన్‌ హడలెత్తిపోతోంది. సినిమాను నిషేధించింది. తమిళనాడులోని ద్రవిడవాద పార్టీలు సినిమా విడుదలను ఆపమని కోర్టుల్లో పిటిషన్లు వేశాయి. డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లలో కూడా రిలీజ్‌ చేయవద్దని డిమాండ్‌ చేశాయి. ఎన్నికలయ్యే వరకు ఆపాలని వాదించాయి, ఎందుకంటే సినిమా బీజేపీకి అనుకూల ఓట్లు తెచ్చి, మిత్రపక్షాలకు లాభం చేస్తుందని భావిస్తున్నాయి.

స్వేచ్ఛకు మద్దతు
సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కోర్టు పిటిషనర్లు పార్టీ ప్రయోజనాలు ప్రభావితం చేసే సీన్లు న్యాయస్థానానికి చూపించలేకపోయాయి. సినిమాలో భారత గొప్పతనం, పాకిస్తాన్‌ రహస్య కార్యకలాపాలు మాత్రమే ఉన్నాయని, ఎన్నికలపై ప్రభావం లేదని కోర్టు తీర్పు ఇచ్చింది. సాక్ష్యాలు లేకుండా విడుదల ఆపడం అన్యాయమని న్యాయస్థానం పేర్కొంది.

బీజేపీని దేశభక్తి పార్టీగా చూస్తూ..
దేశభక్తి అంశాలు బీజేపీకి మాత్రమే లాభమని ద్రవిడ, విపక్ష పార్టీలు భావిస్తున్నాయి. దురంధర్‌ పాకిస్తాన్‌ను భయపెట్టాలని, తమిళనాడులో ద్రవిడ పార్టీలను కూడా భయపెట్టుతుందని వాదన. హిందీ సినిమా తమిళ ప్రేక్షకులను ప్రభావితం చేసి, ఓటింగ్‌ పద్ధతులను మార్చవచ్చని ఆందోళన. హిందీ అంటే తమకు నచ్చదని చెప్పే ద్రవిడ పార్టీలు హిందీ వర్షన్‌ కూడా విడుదల కావొద్దని భావించాయి.

కోర్టు తీర్పు వ్యక్తి స్వేచ్ఛ, మీడియా హక్కులకు బలం. ద్రవిడ పార్టీలు ఈ వివాదాన్ని ప్రచారంలో ఉపయోగించుకుని, ’హిందీ ఆధిపత్యం’ వాదన చేయవచ్చు. ’దురంధర్‌’ విడుదలైతే, ఎన్నికల్లో బీజేపీ, మిత్రాలకు చిన్న ప్లస్, విపక్షాల వైఖరి కారణంగా సినిమా మొత్తం ఫలితాలపై ప్రభావితం చూపకపోవచ్చు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version